ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించిన రష్యా తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్తోంది. మరోవైపు యుద్ధం కారణంగా రష్యాలో ప్రజల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఈ దాడులని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలన్నీ ఆంక్షల విధించి రష్యాను ఏకాకిని చేసిన సంగతి తెలిసిందే. అయినా రష్యా ఏమాత్రం తగ్గకుండా ఉక్రెయిన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. మరోవైపు రష్యా మొత్తం ఆర్థిక సంక్షోభం సంభవిస్తోంది. చాలా దేశాలు ఆంక్షలు పేరుతో రష్యాకు దిగుమతులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసరసరకులు కొరత కూడా రష్యా ప్రజలను వేధిస్తోంది.
రష్యాలో వార్షిక ద్రవ్యోల్బణం 2015 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకోవడంతో చక్కెర ధరలు విపరీతంగా పెరిగాయి. అంతేగాక కొన్ని నిత్యావసరుకులు కొరత కారణంగా రష్యాలోని షాపులు కస్టమర్‌కి షరతులతో కూడిన సరకులను అందిస్తున్నాయి. తాజాగా ఓ సూపర్ మార్కెట్‌లో చక్కెర కోసం రష్యన్లు విచక్షణారహితంగా కొట్లాడుకున్నారు. ఒకరి దగ్గర ఉన్న చెక్కర ప్యాకెట్లను మరొకరు లాక్కున్నారు. చెక్కర కోసం కొట్లాడుకుంటున్న రష్యన్ ప్రజల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుత ఉక్రెయిన్ వ్యవహారం త్వరగా తేలకపోతే రష్యా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు.
Сахарные бои в Мордоре продолжаются pic.twitter.com/hjdphblFNc
— 10 квітня (@buch10_04) March 19, 2022
Comments
Please login to add a commentAdd a comment