చావీ మిట్టల్
చావీ మిట్టల్ చక్కటి ప్రశ్నే వేశారు. ‘‘బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగితే తప్పు కాదు కానీ, తల్లి తన బిడ్డకు పాలిస్తే తప్పు అవుతుందా?’’ అని! ‘‘స్తన్యమివ్వడం ప్రకృతిలోని అందమైన విషయం. తల్లికి, బిడ్డకు మధ్య ఉండే ఈ బంధం ఎవరూ విడదీయలేనిది. బిడ్డకు ఆకలైనప్పుడు చనుబాలు పట్టడానికి ఇంట్లో ఉన్నానా, వీధిలో ఉన్నానా అని చూసుకోదు తల్లి. కానీ సమాజం దీన్నొక అపరాధంగా చూస్తోంది. రోడ్ల మీద సిగరెట్ కాలుస్తూ, తాగి తూలుతూ చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలిగిస్తే ఎవరికీ పట్టదు కానీ, ఒక తల్లి తన బిడ్డకు పాలు పడితే మాత్రం ఏదో బ్రహ్మాండం బద్దలైనట్లే మాట్లాడతారు’’ అని చావీ అంటున్నారు. టీవీ నటి అయిన చావీ ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment