
సాక్షి ప్రతినిధి, చెన్నై: తల్లి కావడం ప్రతి మహిళకు ఒక వరం. రక్తం పంచుకుని జన్మించిన బిడ్డకు స్తన్యం ద్వారా పాలివ్వడం అనిర్వచనీయమైన అనుభూతి. అయితే దురదృష్టవశాత్తూ ఇలా పాలుపట్టడమే ఆ తల్లిపాలిట శాపమైంది. బిడ్డ ప్రాణాన్ని హరించివేసిన విషాద సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నై రాయపురానికి చెందిన వినోద్‌బాబు (25), సంధ్య (22) దంపతులకు ఆనంద్ అనే మూడు నెలల కుమారుడు ఉన్నాడు. బుధవారం రాత్రి సంధ్య తన కుమారుడికి స్థన్యం ద్వారా పాలుపడుతున్న సమయంలో బిడ్డకు ఊపిరాడలేదు.
దీంతో తల్లి ఒడిలో తలవాల్చేసి ప్రాణాలు విడిచాడు. ఈ హఠాత్పరిణామాన్ని తట్టుకోలేక తల్లి బిగ్గరగా ఏడవడంతో ఇరుగూపొరుగూ వచ్చి ఓదార్చారు. ఇంతలో పోలీసులు సైతం అక్కడికి చేరుకుని బిడ్డ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment