mother kills son
-
ప్రియుడి మైకంలో దారుణానికి ఒడిగట్టిన తల్లి..
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బిడ్డను హత్య చేసిన మహిళతోపాటు ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కాగా, ఈ దారుణంపై పోలీసుల కథనం మేరకు.. కృష్ణగిరి జిల్లా రాయకోట సమీపంలోని ఓడంపట్టి గ్రామానికి చెందిన మాదేశు (27) కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. ఇతడికి భార్య జ్ఞానమలర్ (21), ప్రకాష్ (3), ఆదిరా (9 నెలలు) పిల్లలున్నారు. మాదేశు రోజూ కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో జ్ఞానమలర్‌కు అదే గ్రామానికి చెందిన రైతు సాయి తంగరాజ్ (28)తో పరిచయం ఏర్పడి, ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. మాదేశు పనికి వెళ్లిన అనంతరం సాయితంగరాజ్, జ్ఞానమలర్ ఇంట్లో ఉల్లాసంగా గడిపేవారు. ఈ క్రమంలో ఈ సంగతి మాదేశుకు తెలియడంతో భార్యను మందలించాడు. దీంతో ఆగ్రహం చెందిన జ్ఞానమనర్ ఈ విషయాన్ని తంగరాజ్కు తెలిపింది. బిడ్డ ఉండడంతో వివాహేతర సంబంధం కొనసాగడం కష్టమని, బిడ్డలను హత్య చేయమని జ్ఞానమలర్ తెలిపింది. దీంతో, తంగరాజు ఇచ్చిన పథకం ప్రకారం జ్ఞానమలర్ కన్న పిల్లలు ప్రకాష్, ఆదిరాకు ఎలుక మందు పేస్టును ఇచ్చింది. ఇది తిన్న చిన్నారులు వాంతులు చేసుకుని, స్పృహ తప్పారు. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు ఆ బిడ్డలకు విషం ఇచ్చినట్టు గుర్తించి, కృష్ణగిరి ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. వీరిలో ఆదిరా గత ఐదో తేదీ ఉదయం మృతి చెందాడు. ఈ విషయమై మాదేశు రాయకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, జ్ఞానమలర్, ఆమె ప్రియుడు తంగరాజును అరెస్టు చేశారు. నిందితులను వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
ఏమంత కష్టమొచ్చె తల్లీ..
సంగారెడ్డి అర్బన్: పిల్లలకు నయం కాని అనారోగ్యం, ఆస్పత్రులకు అవుతున్న ఖర్చులు.. మనస్తాపంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను చున్నీతో ఉరేసి.. తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇండియన్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న శివశంకర్ ఏడు నెలల కింద ఆదిలాబాద్ నుంచి బదిలీపై వచ్చి భార్య జోస్నా, ఇద్దరు కుమారులతో కలసి సంగారెడ్డి జిల్లా కేంద్రం శాంతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. పెద్దబాబు రుద్రాక్షు (6)కు పుట్టినప్పటి నుంచి కిడ్నీల సమస్య ఉంది. చిన్నబాబు దేవాన్షు(4)కు మోషన్ (మలవిసర్జన సరిగా లేకపోవడం) సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. దీంతో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. డాక్టర్లు కూడా ఈ జబ్బులు నయం కావని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జోస్నా తన ఇద్దరు పిల్లలను చంపి తానూ చనిపోవాలని నిర్ణయించుకుంది. భర్త శివశంకర్ శుక్రవారం ఉదయం బ్యాంకుకు వెళ్లిన సమయం చూసి మధ్యాహ్నం సమయంలో ఇద్దరు కుమారులను చున్నీతో ఉరేసింది. ఇంటికి తాళం వేసి పట్టణ పరిధిలోని మహబూబ్‌సాగర్ చెరువు వద్దకు వెళ్లి భర్తకు వాట్సాప్‌లో ఫొటో పెట్టి చెరువులో దూకింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు ఆమెను పైకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న శివశంకర్ చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా, ఇద్దరు పిల్లలు బెడ్‌పై విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే భార్య, పిల్లలను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు పిల్లలిద్దరూ మృతి చెందారని నిర్ధారించారు. ప్రస్తుతం జోస్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శివశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం: కొడుకు తలను నేలకేసి కొట్టి చంపిన తల్లి
కీవ్: ఉక్రెయిన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తల్లి తన అయిదేళ్ల కుమారుడి పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించి చంపిన ఘటన సొకొల్వీకా గ్రమంలో జరిగింది. ఇళ్లంత గందరగోళం చేశాడనే కోపంలో తన కళ్లేదుటే తన తమ్ముడిని అమ్మ నేలకేసి కొట్టడంతో మృతి చెందినట్లు బాలుడి ఆరేళ్ల సోదరి పోలీసులకు వెల్లడించింది. దీంతో బాలిక సమాచారం మేరకు పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసి మానసిక ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత వారం మధ్య ఉకక్రెయిన్‌లో జరిగిన ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై సొకొల్వీకా గ్రామ మేయర్ వీరా అసౌలెంకో స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. బాలుడి తల్లి పేరు ఎలీనగా పేర్కొంది. ఆమె పిల్లలు పుట్టినప్పటి నుంచి మానసిక ఆరోగ్య సమ్యలతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో పిల్లలు ఇద్దరూ స్కూల్‌కు రాకపోవడంతో వారి ఇంటికి తనిఖీకి వెళ్లినట్లు చెప్పింది. ‘పిల్లలు స్కూల్ రాలేదని సమాచరాం రావడంతో నేనువ వారి ఇంటికి తనిఖీకి వెళ్లాను. అక్కడి వెళ్లాసరికి ఆమె బాలుడిని చేతిలో పట్టుకుని ఇంటి ఎదుట నిలబడి ఉంది. ఆ సమయంలో బాలుడు దుప్పటితో చూట్టి ఉన్నాడు. అయితే దగ్గరికి వెళ్లి చిన్నారి చేయి పట్టుకుని చూడగా అతడి చేయి చల్లగా ఉంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. బాలుడిని పరీకక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని, బాలుడి తలకు తీవ్రమైన గాయాలు, మెడపై చేతితో నులిమినట్లుగా చేతి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు చిన్నారి మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తలకు తీవ్రంగా గాయం కావడం వల్లే మరణించినట్లు ఫోరేన్సిక్ రిపోర్టులో ధృవికరించినట్లు ఆమె చెప్పింది. బాలుడి మృతిపై అనుమానంతొ పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొంది. దీంతో పోలీసులు విచారణలో భాగంగా బాలుడి సోదరిని ప్రశ్నించగా అసలు విషయం వెల్లడైంది. తన తమ్ముడిని అమ్మ నేలపై పడుకోబెట్టి.. ఆ తర్వాత అతడిపై కూర్చోని తలను నేలకేసి పలుమార్లు బాధినట్లు బాధిత బాలుడి సొదరి పోలీసులకు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు తల్లి ఎలీనాపై హత్య కేసు నమోదు చేసి ఆమెను మానసిక ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
మూడేళ్ల కొడుకును చంపి, తల్లి ఆత్మహత్య
-
మూడేళ్ల కొడుకును చంపి, తల్లి ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్: ఎల్బీనగర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన నగర్లో విషాదం నెలకొంది. ఓ వివాహిత మూడేళ్ల కుమారుడిని చంపి తానూ ప్రాణాలు తీసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గుళ్లం మమతా అనే మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుమారుడు రియాన్ష్ కుడిచేతిని కత్తితో కోయడంతో తీవ్ర రక్తస్రావమై బాలుడు మృతి చెందాడు. అనంతరం తాము ఉంటున్న మూడో అంతస్తుపై నుంచి మమత దూకేసింది. తీవ్ర గాయాలతో ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది. కేసు నమోదు చేసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మమత సొంతూరు యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లికిగా తెలిసింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. (చిన్నారులపై పిడుగు) -
ఉరితాడై బిగుసుకున్న కుటుంబ కలహాలు
కర్ణాటక, మైసూరు: కుటుంబ కలహాలు ఇద్దరు పిల్లలకు ఉరితాడై బిగుసుకున్నాయి. ఓ తల్లి చేజేతులా తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి అనంతరం తానూ బలవన్మరణం చెందింది. ఈఘటన గురువారం నగరంలోని బండిపాళ్యలో చోటు చేసుకుంది. బండిపాళ్యలో నివసిస్తున్న ఆశా(30),మహేశ్ దంపతుల మధ్య చాలా కాలంగా ఏదో విషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయి.బుధవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్థాపం చెందిన ఆశా గురువారం తన ఇద్దరు కవల పిల్లలు శౌర్య(8),సుప్రీత్(8)లను హత్య చేసి అనంతరం తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.కొద్ది సేపటి అనంతరం ఇంటికి వచ్చిన మహేశ్ ఎంత పిలిచినా భార్య తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆశా రాసిన డెత్‌నోట్ స్వాధీనం చేసుకున్నారు.అందులో తమ మరణాలకు ఎవరూ కారణం కాదని తన వల్ల తన కుటుంబానికి అవమానం జరిగిందనే మనస్థాపంతోనే పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు డెత్‌నోట్‌లో పేర్కొన్నారు.తమ ముగ్గురిని ఒకే చితిలో దహనం చేయాలని కూడా ఆశా అందులో రాసారు.మైసూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, జైపూర్(చెన్నూర్): అభం శుభం తెలియని పసివాడిని కన్నతల్లే కడతేర్చింది. అక్రమ సంబంధం కొనసాగించడానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఆ కసాయి తల్లి అమ్మతనాన్నే మరిచింది. పేగుపంచుకు పుట్టిన కుమారుడి గొంతు నులిమేసింది. మూడేళ్ల బాబును తిరిగిరాని లోకాలకు పంపింది. నూతన సంవత్సరం వేళ జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో మంగళవారం ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన దుర్గం శంకరయ్య–దీప అలీయాస్ దుర్గకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. శంకరయ్య గ్రామంలో పశువుల కాపరిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి మూడేళ్ల కిందట ఇద్దరు ఆడపిల్లలు పుట్టి కొద్దిరోజులకే మరణించారు. తదనంతరం..బాబు జన్మించాడు. అప్పటికే దీప మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పర్చుకుంది. పుట్టిన బాబు అంజన్నను కూడా సక్రమంగా చూడకపోయేది. బంధువుల దగ్గర పెరిగిన అంజన్నకు మూడేళ్లు వచ్చాయి. పశువుల కాసేందుకు భర్త ఉదయం వెళ్తే సాయంత్రం వచ్చేవాడు. ఇక తన అక్రమ సంబంధం కొనసాగించడానికి ప్రధాన అడ్డంకిగా భావించిన కొడుకును అడ్డు తొలగించుకోవాలని భావించింది. మంగళవారం ఉదయం శంకరయ్య రోజువారి పనిలో భాగంగా పశువులను తోలుకుని వెళ్లాడు. పాపం..ఆ పసివాడికి తెలియదు కన్నతల్లి ఇలా చేస్తుందని. రోజుమాదిరిగానే తల్లి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో దీప కొడుకు గొంతు నులిమి శ్వాస ఆడకుండా చేసి చంపివేసి మంచంలో పడుకోబెట్టింది. ఏం జరిగిందో తెలియకుండా ఉండేందుకు జాగ్రత్తపడింది. అయితే చుట్టు పక్కలవారు, తండ్రి శంకరయ్య వెంటనే ఇంటి వద్దకు చేరుకొని చనిపోయిన పసివాడిని చూసి ఆవేదనవ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో శ్రీరాంపూర్ సీఐ నారాయణనాయక్, ఎస్సై విజేందర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలపై ఆరాతీశారు. కాగా, తానే చంపినట్లు తల్లి ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డకు పాలివ్వటమే శాపమైంది
పెన్సిల్వేనియా రాష్ట్రంలో విచిత్రమైన కేసు నమోదు అయ్యింది. తల్లి రొమ్మే బిడ్డ ప్రాణం తీసింది. పాలు విషంగా మారటంతో ఆ బిడ్డ మృతి చెందింది. దీంతో ఆమెపై కేసు నమోదు కాగా.. కటకటాల పాలైంది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఫిలడెల్ఫియా నగరానికి చెందిన సమంత జోన్స్‌కి 11 నెలల బాబు. ఒళ్లు నొప్పులు ఉండటంతో మాత్రలు వేసి పడుకుంది. అయితే నిద్రలో పసికందు ఏడవటంతో లేచి పాలిచ్చింది. ఉదయం లేచి చూసేసరికి ఆ చిన్నారిని నురగ కక్కుకుని ప్రాణాలు విడిచాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తల్లిపాలు విషంగా మారటమే కారణమని తేలింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత 3 మిలియన్ డాలర్ల పూచీకత్తుపై సమంత బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. కాగా, ఈ కేసులో వాదనలు శుక్రవారం మొదలుకాగా, మెథడోన్‌తో కూడిన మందులను ఆమె తీసుకోవటమే చిన్నారి మరణానికి కారణమైందని ప్రాసిక్యూషన్ వాదించారు. అయితే మెథడోన్ మందులు వాడి బిడ్డకు పాలివ్వొచ్చన్న శాస్త్రవేత్తల వాదనను సమంత తరపు అటార్నీ వాదించారు. కాగా, ఈ కేసులో తదుపరి వాదనను జూలై 23కి వాయిదా వేశారు. కోర్టు దోషిగా ప్రకటిస్తే మాత్రం ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. -
కొడుక్కి విషమిచ్చి తల్లి ఆత్మహత్య
-
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.!
వనపర్తి : కట్టుకున్న భర్తను వదిలేసిన ఓభార్య.. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అభం శుభం తెలియని ఓ మూడేళ్ల చిన్నారిని బలి తీసుకుంది. తనతో కాపురం చేయకున్నా పర్వాలేదు.. తన సంతానాన్ని తనకు ఇవ్వాలని కాళ్లు మొక్కినా కనికరించని ఆ కసాయి తల్లి.. చివరికి కన్నపేగును తనే చిదేమిసిన సంఘటన వనపర్తిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బిజినేపల్లి మండలం కొట్టాల్‌గడ్డ గ్రామానికి చెందిన నర్సింహగౌడ్‌కు అదే మండలం పాలెం గ్రామానికి చెందిన పద్మతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. నర్సింహగౌడ్ వికలాంగుడు కావడంతో గ్రామంలో కల్లు దుకాణం నిర్వహిస్తూ వచ్చే ఆదాయంతోపాటు వికలాంగ పింఛన్‌తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి మీనాక్షి(6), కార్తీక్(3) సంతానం ఉన్నారు. భార్య పద్మ పాలెం అగ్రికల్చర్ యూనివర్శిటీలో దినసరి కూలీగా పనిచేస్తుండగా అక్కడే పనిచేస్తున్న మల్లేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయాన్ని తెలుసుకున్న భర్త నర్సింహగౌడ్ పద్ధతి మార్చుకోవాలని సూచించినా ఆమెలో మార్పురాలేదు. దీంతో కుటుంబంలో కలహాలు ప్రారంభమై పంచాయతీ దాకా వచ్చాయి. పంచాయతీలో పిల్లల భవిష్యత్ నాశనం చేయవద్దని ప్రాదేయపడినా భార్య వినలేదు. వనపర్తికి మకాం.. సరిగ్గా రెండు నెలల క్రితం భర్తను వదిలి ఇద్దరు పిల్లలతోపాటు మల్లేష్‌తో కలిసి వనపర్తిలోని శంకర్‌గంజ్ కాలనీలో అద్దెగదిలో నివాసం ఉంటున్నారు. ప్రతి రోజు పద్మ కూలి పనిచేయగా వచ్చిన డబ్బులను మల్లేష్‌కు ఇచ్చేది. ఈ క్రమంలో పద్మ శనివారం ఉదయం కార్తీక్(3) అనారోగ్యంతో మృతి చెందాడని మృతదేహాన్ని తీసుకుని అత్తారింటికి కొట్టాల్‌గడ్డకు వెళ్లింది. దీంతో భర్త నర్సింహగౌడ్, అతని కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి బాబు ఎలా చనిపోయాడో చెప్పాలని.. పాప మీనాక్షి ఎక్కడ ఉందని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో నర్సింహగౌడ్, కుటుంబ సభ్యులు పాపను కూడా చంపివేసిందన్న అనుమానంతో కార్తీక్ మృతదేహాంతో పాటు పద్మను వాహనంలో ఎక్కించుకొని పాపను చూయించాలని కొట్టాల్‌గడ్డ నుంచి బయలుదేరారు. కర్నూలు తదితర ప్రాంతాలను తిప్పించి చివరికి వనపర్తిలోనే పాప ఉందని చెప్పడంతో వారు వనపర్తికి వచ్చారు. మల్లేష్ దగ్గర ఉన్న పాప మీనాక్షిని తమతో తీసుకుని మల్లేష్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులకు ఫిర్యాదు.. కార్తీక్ గొంతు నులిమి ఉండడం, చెవుల్లో రక్తం రావడాన్ని గమనించిన తండ్రి నర్సింహగౌడ్ తన కుమారుడిని హత్య చేశారని వనపర్తి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వనపర్తి సీఐ వెంకటేశ్వర్లు శనివారం రాత్రి 9 గంటలకు పద్మ అద్దెకు ఉంటున్న శంకర్‌గంజ్ కాలనీకి వెళ్లి గది తలుపులు తెరిపించి ప్రాథమిక విచారణ చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పద్మ, మల్లేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కోడలి కోసం కొడుకును చంపిన తల్లి..
ముంబై: తాగుడుకు బానిసై భార్యను వేదిస్తున్న ఓ యువకున్ని కన్న తల్లే కడతేర్చింది. ఈ ఘటన ముంబైలోని మన్‌ఖుర్ద్‌లోని అంబేద్కర్ చౌల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం నదీమ్(25) అతని భార్య, తల్లి అన్వారీ ఇద్దరు సోదరులతో స్థానికంగా నివసిస్తున్నాడు. తాగుడుకు బానిసైన నదీమ్ రోజు గర్భవతి అయిన తన భార్యను కొడుతున్నాడు. గత మంగళవారం రాత్రి తాగి వచ్చిన నదీమ్ భార్యపై చేయిజేసుకున్నాడు. అడ్డుకున్న తల్లిపై కూడా దాడి చేశాడు. దీంతో అన్వారీ చిన్న కొడుకు సహయంతో నదీమ్‌ను తాళ్లతో కట్టేసింది. కుటుంబ సభ్యులందరినీ పక్కింటికి వెళ్లమని చెప్పింది. నదీమ్ కట్టేసిన కూడా తల్లిని తిడుతుండటంతో సహనం కోల్పోయిన అన్వారి దుప్పటితో గొంతు నులిమి చంపింది. కాసేపటికి ఇంట్లోకి వచ్చిన కోడలికి అన్వారి కొడుకు పక్కన కూర్చోని ఏడవడం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకోని అన్వారీని రిమాండ్‌కు తరలించారు. -
కొడుకును చంపిన తల్లికి.. 18 ఏళ్ల జైలు
ఆటిజంతో బాధపడుతున్న తన కొడుకును చంపిన తల్లికి.. 18 ఏళ్ల జైలుశిక్ష పడింది. 2010 సంవత్సరంలో మన్‌హట్టన్‌లోని ఓ ఖరీదైన హోటల్లో ఈ హత్య జరిగింది. తన ఎనిమిదేళ్ల కొడుకు జూడ్ మిర్రాకు క్రషర్, సిరంజి ద్వారా మందులు ఓవర్‌డోస్‌లో ఇచ్చి అతడిని చంపేసినట్లు గిగి జోర్డాన్ (54) అంగీకరించారు. అయితే, ఇది కేవలం మానవత్వంతో చేసిన హత్యేనని జోర్డాన్ న్యాయవాది రెండు నెలల విచారణలో వాదించారు. జూడ్ మిర్రా తండ్రి అతడిని లైంగికంగా వేధించకుండా నిరోధించడానికే ఆమె ఈ పని చేసిందన్నారు. దీంతో.. దాదాపు 25 ఏళ్ల వరకు పడాల్సిన జైలు శిక్షను జడ్జి చార్లెస్ సాల్మన్ 18 ఏళ్లకు తగ్గించారు. తల్లి తన కొడుకును కాపాడుకోవాలనుకోవడం సహజమే గానీ, అందుకోసం ఆమె అతడిని ఎందుకు చంపిదన్న విషయం అర్థం కావట్లేదని జడ్జి వ్యాఖ్యానించారు. వాస్తవానికి మిర్రాకు తన విషయాలు తాను చెప్పుకోవడం చేత కాకపోయినా, తండ్రి ఎమిల్ జెకొవ్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు తల్లికి చెప్ఆడని న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే యోగా ఉపాధ్యాయుడైన జెకొవ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇక ప్రాసిక్యూటర్లు మాత్రం తన కొడుకు ఆటిజంతో బాధపడుతున్నందువల్ల అతడిని పెంచలేక.. ఆమె అతడిని చంపేసిందని వాదించారు. -
కొడుకును చంపి.. పూడ్చిపెట్టేసింది
కనిగిరి మండలం కాశిరెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. కొడుకు వేధింపులు భరించలేక కన్నతల్లే అతడిని గొడ్డలితో నరికి చంపేసింది. శివశంకర్ అనే యువకుడు గత పదేళ్లుగా రోజూ తాగి వచ్చి, ఇంట్లో భార్యా బిడ్డలతో పాటు తల్లిని కూడా తీవ్రంగా వేధించేవాడు. ఎవరు ఎంతగా చెప్పినా అతడు తన పద్ధతిని మార్చుకోలేదు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగింది. దాంతో సహనం కోల్పోయిన తల్లి నరసమ్మ అతడిని గొడ్డలితో నరికి చంపేసింది. అనంతరం ఇంటి సమీపంలోనే మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టింది. కాలనీ వాళ్లకు కూడా ఈ విషయం తెలిసినా, శివశంకర్ ఆగడాల గురించి తెలియడంతో ఎవరూ ఈ విషయం బయటపెట్టలేదు. కానీ ఆనోటా ఈనోటా చివరకు పోలీసుల వద్దకు విషయం తెలిసింది. దాంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసే పరిస్థితి లేదు. పోలీసులు వచ్చిన తర్వాత తల్లి నరసమ్మ తన నేరాన్ని అంగీకరించడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.