![Watch Video About Groundhog Taunts Dogs With Pizza - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/16/Squirrel.jpg.webp?itok=EO5DHXJ1)
ఫిలడెల్ఫియా : 'మీరెంత ఉరిమి చూసిన నేను వచ్చిన పని పూర్తి చేసేదాకా తిరిగివెళ్లనంటూ' గ్రౌండ్‌హగ్ (ఉడుత జాతికి చెందిన జంతువు) అంటుంది. అదేంటి అసలు అది వచ్చిన పనేంటో తెలుసుకోవాలంటే మాత్రం వార్త మొత్తం చదివి తీరాల్సిందే. వివరాలు.. ఫిలడెల్ఫియాలో నివాసం ఉంటున్న క్రిస్టిన్ చలేలా బాగ్నెల్ అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్రిస్టిన్ తన పనిలో తాను నిమగ్నమయ్యుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ ఒక గ్రౌండ్ హగ్ దర్జాగా వారి ఇంటి బాల్కనిలోకి వచ్చి దర్జాగా ఫిజ్జాను తినడం ప్రారంభించింది. ఇంతలో యాజమాని పెంచుకుంటున్న రెండు కుక్కలు దానిపై దాడి చేసేందుకు వేగంగా వచ్చినా బాల్కనీకి అద్దం అడ్డుగా ఉండడంతో ఆగిపోయాయి. ఇంకేముంది తనను అవి ఏం చేయలేవని భావించిందేమో ఇంకా దర్జాగా తినడం ప్రారంభించింది. అయితే కుక్కలు ఉరిమి చూసిన ప్రతీసారీ వెటకారంగా వాటిని రెచ్చగొడుతూ ఆగి మరి ఫిజ్జాను తినడం మొదలుపెట్టింది. చివరకు అవి చూస్తుండగానే ఫిజ్జాను తినేసి అక్కడినుంచి వెళ్లిపోయింది. అయితే ఇదంతా గమనించిన ఇంటి యజయాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి షేర్ చేసిన కాసేపటికే వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.
(ఆశ్చర్యం: గాలిపటం ఎగరేస్తున్న కోతి)
Comments
Please login to add a commentAdd a comment