
నరేంద్ర మోడీకి దిగ్విజయ్ సింగ్ సవాల్
యూపీఏ ప్రభుత్వ పాలన, అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమని,తమ పార్టీకి చెందిన ఏ నాయకుడితోనైనా సరే చర్చకు రావలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ బీజేపీ ప్రధాన అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంపై మోడీ తీవ్ర విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. భారత రాజకీయాల్లో అద్భుతాలు చేస్తానని ఆయన చెప్పడం భ్రమేనన్నారు.
మోడీ అంతకుముందు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఆర్ఐ మద్దతు దారులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. దేశం ఆర్థికంగా తిరోగమని దిశలో పయనిస్తోందని, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన దిగ్విజయ్.. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తప్పుడు లెక్కలతో అభివృద్ధి సాధించినట్టు గొప్పలు చెప్పుకుందని ట్వీట్ చేశాడు. యూపీఏ పాలనపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.