
సాక్షి, అమరావతి: గతంలో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి కూడా అమలు కాలేదని, 2019లో వైఎస్ జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశం అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. గుంటూరు జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో ‘మేనిఫెస్టో అంటే జగన్ అంశం’పై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రవేశపెట్టింది మేనిఫెస్టో.. చంద్రబాబు ప్రవేశపెట్టింది మోసఫెస్టో.. తన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ కొమ్మినేని దుయ్యబట్టారు.
‘‘మేనిఫెస్టోను భగద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించిన వ్యక్తి సీఎం జగన్. మేనిఫెస్టో అంటే సీఎం జగన్ దృష్టిలో ప్రజలకు ఇచ్చిన హామీ. మేనిఫెస్టో అంటే చంద్రబాబు దృష్టిలో ప్రజలను నమ్మించే ఓ కాగితం. దేశమంటే మట్టికాదోయ్.. మనుషులోయ్ అన్నారు గురజాడ.. ఆయన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి సిద్ధమయ్యారు. సోనియా గాంధీని ఎదిరించి జగన్ మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ ఏనాడూ సోనియాగాంధీని దూషించలేదు’’ అని కొమ్మినేని అన్నారు.
చదవండి: ‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’
‘‘ఎన్టీఆర్ ను నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించిన చంద్రబాబు మళ్లీ ఆ పార్టీతోనే పొత్తులు పెట్టుకున్నాడు. 2014 లో మోదీ సూపర్ అన్నాడు. 2018 లో మోదీ అంత దుర్మార్గుడు లేడన్నారు. ఇప్పుడు మోదీ అంత సమర్ధుడు లేడంటున్నాడు. చంద్రబాబు వంటి స్థిరత్వం లేని.. బహురూపి దేశంలో మరొకరు లేరు. నా 45 ఏళ్లు అనుభవంలో మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేసిన ఒకే ఒక్క వ్యక్తి సీఎం జగన్.. ఆయన మేనిఫెస్టోను విమర్శించిన వారే ఇప్పుడు అమలు చేస్తామంటున్నారు. కేంద్రం నిధులిస్తుంటే ఎలా ఇస్తారంటూ ప్రశ్నించే దౌర్భాగ్య రాజకీయ పార్టీలు ఏపీలోనే ఉన్నాయి. విజయవాడ మెట్రోకు ఉరి అని ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోంది. 2017లో ఆపేసిన మెట్రోతో జగన్‌కి ఏం సంబంధం. మేనిఫెస్టోను చిత్తశుద్ధితో సీఎం జగన్ అమలు చేస్తున్నారు కాబట్టే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు’’ అని కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు.
చదవండి: ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా?
Comments
Please login to add a commentAdd a comment