టీవీలో ప్రసారమయ్యే లైవ్ డిబెట్ల గురించి తెలిసిందే. రాజకీయాలు, సామాజిక అంశం, ప్రస్తుతం విషయాల మీద కొంతమంది వ్యక్తులు, అనుభవజ్ఞులను తీసుకొచ్చి మాట్లాడిస్తుంటారు. పొలిటికల్ లీడర్స్ ఎక్కువగా ఈ డిబెట్‌లో పాల్గొంటుంటారు. చర్చల్లో భాగంగా వారి మధ్య వాదనలు, ఆరోపణలు, విమర్శలు, అప్పుడప్పుడు పరిస్థితులు చేయి దాటి పోవడంతో భౌతిక దాడులు కూడా చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటనే పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఛానల్ లైవ్ డిబెట్‌లో పాల్గొన్న ఇద్దరు నేతలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఏకంగా ఒకరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. వివరాలు.. జావేది చౌదరి హోస్ట్ చేసిన టాక్ షో ‘కల్ తక్)లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీకి న్యాయవాది షేర్ అఫ్జల్ మార్వత్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌ను పార్టీ సెనేటర్ అయిన అఫ్నాన్ ఉల్లా పాల్గొన్నారు.
ఇమ్రాన్ ఖాన్‌పై సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో సహనం కోల్పోయిన షేర్ అఫ్జల్ మార్వత్ తన కుర్చీలో నుంచి లేచి అఫ్నాతుల్లా ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఖాన్ కూడా మార్వత్‌పై ప్రతిదాడికి దిగాడు. ఇద్దరూ కిందపడిమరీ కొట్టుకున్నారు. పరిస్థితి మరింత దిగజారిపోవడంతో చివరికి వీరిని యాంకర్, సిబ్బంది అడ్డుకున్నారు. ఈ దాడిలో అఫ్నాన్ ఉల్లా ఖాన్ తలకు గాయమైంది.
مرشد کو گالی دو گے تو مرید تو جواب دے گا ہی۔۔ اور جواب بنتا بھی ہے! کوئی تو ان کو انکی زبان میں سمجانے والا ہو!
— SB_Blog (@Bukhari2204) September 28, 2023
پکڑنا ہے یا چھوڑنا ہے 🤣😎 pic.twitter.com/i52eSgjrGL
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా సేపటి వరకు గొడవ కొనసాగడంతో ఈ దృశ్యాలను లైవ్‌గా చూశారు. గౌరవ హోదాలో ఉన్న వ్యక్తులు ఇలా తన్నుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రవర్తించి తమ పరువును దిగజార్చుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
Champion @sherafzalmarwat
— Samiya Kanwal (@kanwal_samiya) September 28, 2023
Comments
Please login to add a commentAdd a comment