జమ్మూ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370పై చర్చించాల్సిన అవసరముందని బీజేపీ మరోసారి ఈ విషయాన్ని లేవనెత్తింది. ఈ అంశంపై చర్చించేందుకు రావాలని అధికార నేషనల్ కాన్ఫరెన్స్తో పాటు రాష్ట్రంలోని ఇతర పార్టీలు రావాలని సవాల్ చేసింది. దేశంతో రాష్ట్ర సమైక్యతకు ఈ ఆర్టికల్ అవరోధం కలిగిస్తోందని జమ్మూకాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు జుగల్ కిశోర్ శర్మ రాజకీయ సలహాదారు హరి ఓమ్ చెప్పారు. చర్చలో పాల్గొనని వారికి దీనిపై ఓ వైఖరి లేదని విమర్శించారు. ఇలాంటి తప్పుడు విధానాల వల్ల జమ్మూ, కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లోని హిందువులు, సిక్కులు వంటి మైనారిటీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
ఇటీవల జమ్మూలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఆర్టికల్ 370కి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరగాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. సభలో మోడీ కన్నా ముందు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. ఆయన కూడా ఆర్టికల్ 370తో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగిందని నిర్ధారణ అయితే, అందుకనుగుణంగా తమ విధానాన్ని మార్చుకుంటామని స్పష్టం చేశారు.
ఆర్టికల్ 370పై చర్చించాల్సిందే: బీజేపీ
Published Sun, Jan 19 2014 9:27 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement