యువత పాత్ర కీలకం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో యువత పాత్ర కీలకమైందని జేసీ–2 ఆర్.సాల్మన్ రాజ్‌కుమార్ అన్నారు. కృష్ణాపుష్కరాలను పురస్కరించుకొని పాత జెడ్పీ సమావేశమందిరంలో నిర్వహిస్తున్న చర్చావేదికలో భాగంగా బుధవారం విద్య నాలెడ్జ్ సొసైటీ, స్కిల్ డెవలప్‌మెంట్ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో వృత్తి విద్య కోర్సులను ప్రోత్సహించాలని కోరారు. వీఎస్‌యూ వీసీ ఆచార్య వీరయ్య మాట్లాడుతూ వృత్తి నైపుణ్యాల అభివృద్ధిలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర విశిష్టమైందన్నారు. యువత తమ శక్తిని ఎరిగి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని సూచించారు. బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి, డీఈఓ మువ్వా రామలింగం, ఎస్‌ఎస్‌ఏ పీఓ విజయలక్ష్మి, సెట్నల్ సీఈఓ సుబ్రమణ్యం మాట్లాడారు.