krishna pushkara
-
యువత పాత్ర కీలకం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో యువత పాత్ర కీలకమైందని జేసీ–2 ఆర్.సాల్మన్ రాజ్‌కుమార్ అన్నారు. కృష్ణాపుష్కరాలను పురస్కరించుకొని పాత జెడ్పీ సమావేశమందిరంలో నిర్వహిస్తున్న చర్చావేదికలో భాగంగా బుధవారం విద్య నాలెడ్జ్ సొసైటీ, స్కిల్ డెవలప్మెంట్ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో వృత్తి విద్య కోర్సులను ప్రోత్సహించాలని కోరారు. వీఎస్‌యూ వీసీ ఆచార్య వీరయ్య మాట్లాడుతూ వృత్తి నైపుణ్యాల అభివృద్ధిలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర విశిష్టమైందన్నారు. యువత తమ శక్తిని ఎరిగి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని సూచించారు. బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి, డీఈఓ మువ్వా రామలింగం, ఎస్ఎస్ఏ పీఓ విజయలక్ష్మి, సెట్నల్ సీఈఓ సుబ్రమణ్యం మాట్లాడారు. -
కృష్ణా పుష్కరాలకు రెవెన్యూ సిబ్బంది
30 మంది తహసీల్దార్లు, 35 మంది డీటీలు పుష్కరాల విధుల్లో పాల్గొనే వారికి నేడు శిక్షణ నెల్లూరు (పొగతోట) : కృష్ణా పుష్కరాల విధులు నిర్వహించేందుకు జిల్లా నుంచి 9 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, 30 మంది తహసీల్దార్లు, 35 మంది డిప్యూటీ తహసీల్దార్లు వెళ్లనున్నారు. ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల విధుల్లో పాల్గొనే అధికారులు, తహసీల్దార్లు, డీటీలు ఈ నెల 8వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంది. ఈ నెల 25వ తేదీన పుష్కరాల విధులకు హాజరైన వారిని రిలీవ్ చేస్తారు. కృష్ణా పుష్కరాల విధుల్లో పాల్గొనే అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. విజయవాడ ఏ–1 కన్వెన్షన్ హాలులో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు శిక్షణ ప్రారంభం కానుంది. శిక్షణ పూర్తయిన తర్వాత విధులకు హాజరయ్యే వారందరితో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేస్తారు. -
జోగుళాంబ ఘాట్ పరిశీలన
12న కృష్ణా పుష్కరాలు, ప్రారంబోత్సవానికి సీఎం కేసీర్ అలంపూర్ : కృష్ణా పుష్కరాల్లో భాగంగా మండలంలోని గొందిమల్లలో నిర్మిస్తున్న జోగుళాంబ ఘాట్‌ను డీఎస్పీ బాలకోటి బుధవారం పరిశీలించారు. ఈనెల 12న కృష్ణా పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఇక్కడికి రానున్నారు. 11వ తేదీ రాత్రి అలంపూర్‌లో బసచేసి మరుసటిరోజు తెల్లారుజామున జోగుళాంబ ఘాటులో పుష్కర స్నానం చేయనున్నారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మశ్వరస్వామివార్లను దర్శించుకోనున్నారు. ఈ ఆలయాల వరకు బందోబస్తు నిమిత్తం డీఎస్పీ పరిశీలించారు. సుమారు 10కి.మీ. మేర సుమారు 800మంది పోలీసులు అవసరముంటుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పర్వతాలు పాల్గొన్నారు.