- 30 మంది తహసీల్దార్లు, 35 మంది డీటీలు
- పుష్కరాల విధుల్లో పాల్గొనే వారికి నేడు శిక్షణ
కృష్ణా పుష్కరాలకు రెవెన్యూ సిబ్బంది
Published Thu, Aug 4 2016 10:57 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
నెల్లూరు (పొగతోట) : కృష్ణా పుష్కరాల విధులు నిర్వహించేందుకు జిల్లా నుంచి 9 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, 30 మంది తహసీల్దార్లు, 35 మంది డిప్యూటీ తహసీల్దార్లు వెళ్లనున్నారు. ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల విధుల్లో పాల్గొనే అధికారులు, తహసీల్దార్లు, డీటీలు ఈ నెల 8వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంది. ఈ నెల 25వ తేదీన పుష్కరాల విధులకు హాజరైన వారిని రిలీవ్ చేస్తారు. కృష్ణా పుష్కరాల విధుల్లో పాల్గొనే అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. విజయవాడ ఏ–1 కన్వెన్షన్ హాలులో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు శిక్షణ ప్రారంభం కానుంది. శిక్షణ పూర్తయిన తర్వాత విధులకు హాజరయ్యే వారందరితో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేస్తారు.
Advertisement
Advertisement