
సాక్షి, న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వివిధ పార్టీలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ సమయం కేటాయించారు. సభలో ఆయా పార్టీల సంఖ్యా బలాన్ని బట్టి ప్రసంగించే సమయాన్ని కేటాయించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపడతారు.
చర్చలో బీజేపీకి మూడు గంటల 33 నిమిషాలు, కాంగ్రెస్‌కు 38 నిమిషాలు, ఏఐఏడీఎంకే 29 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్ 27 నిమిషాలు, బీజేడీ 15 నిమిషాలు, శివసేన 14 నిమిషాలు, టీడీపీ 13 , టీఆర్‌ఎస్ 9, సీపీఎం 7, ఎస్‌పీ 6, ఎన్‌సీపీ 6, ఎల్‌జేఎస్‌పీకి 5 నిమిషాల సమయం కేటాయించారు.