హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన తర్వాతనే అసెంబ్లీలో చర్చ ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆ ఆ తర్వాత ఎంతసేపయినా ప్రతిపక్షం చర్చించవచ్చని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ చర్చ కోసం పట్టు బడుతోందని మంత్రులు యనమల ఆక్షేపించారు.
సభ నడవకుండా అడ్డుకోవడం తగదన్నారు. ప్రభుత్వం పక్షాన ప్రకటన చేస్తామని చెప్పిన తర్వాత.. దానిపై చర్చ కోరడం తగదని యనమల స్పష్టం చేశారు. సభ ఎప్పుడైనా నియమావళి ప్రకారమే పని చేస్తుందని ఆయన అన్నారు. ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన మంత్రి.. ఎవరి ఇష్టానుసారమో సభ పని చేయదని తేల్చి చెప్పారు. సంప్రదాయానికి భిన్నంగా పోతున్న టీడీపీ ప్రభుత్వ వైఖరిపై మీ స్పందన తెలపండి....