అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్
కేంద్ర బడ్జెట్‌పై చర్చలో ఇద్దరి నడుమ మాటల యుద్ధం
కేసీఆర్ ఎందుకు రాలేదన్న రేవంత్.. మీ స్థాయికి మేం చాలన్న కేటీఆర్
నేను అయ్యా, తాత పేరు చెప్పుకుని రాలేదన్న సీఎం... రాహుల్, రాజీవ్‌ను అంటున్నారా? అంటూ కేటీఆర్ కౌంటర్
అన్నదమ్ముల అనుబంధంఏమైందంటూ ప్రశ్న... మోదీతో ప్రేమలోమురిసిపోయిందెవరని ప్రశ్నించిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బుధవారం శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పక్షాన మాట్లాడిన ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరుచేసిన వ్యాఖ్యలను మరొకరు దీటుగా తిప్పికొట్టారు. మధ్యలో డిప్యూటీ సీఎం భట్టి కూడా కలుగజేసుకున్నారు. అయితే ఈ మాటల యుద్ధం ప్రధానంగా రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా సాగింది.
చర్చా..తీర్మానమా?: కేటీఆర్
కేటీఆర్: కేంద్ర బడ్జెట్‌పై చర్చ పెట్టారా? తీర్మానం చేస్తున్నారా? ఏం అర్థం కావడం లేదు.
రేవంత్: కేంద్ర బడ్జెట్‌పై చర్చ అని స్పష్టంగా చెప్పా. అవగాహన రాహిత్యంతో మళ్లీ ప్రశ్నిస్తే ఎలా?
కేటీఆర్: సీఎం మాట్లాడతారని అనుకున్నాం. మంత్రితో చర్చను ప్రారంభించారు. ముఖ్యమంత్రికి మాట్లాడడం ఇష్టం లేదేమో?
రేవంత్: ఇష్టం లేనిది పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి. కేసీఆర్ ఎందుకు రాలేదు? మోదీ ఎక్కడ చూస్తారో, ఏమవుతుందోననే భయంతో ఇంట్లో కూర్చుని వీళ్లను పంపించి మాట్లాడిస్తున్నారు. వీళ్లా మాట్లాడేది?
కేటీఆర్: ఈ నాయకుడి స్థాయికి మేం చాలు. కేసీఆర్ అవసరం లేదు. మీ సత్తా మాకు తెలుసు. మాకు సమాధానం చెప్పండి చాలు.
మీది అవగాహనా రాహిత్యం: సీఎం
కేటీఆర్: తీర్మానం ఏది? ఏం చేస్తున్నారో అర్థం కాకుండా పోతోంది. ముఖ్యమంత్రి అంటే గతంలో మంత్రిగా చేయలేదు. ఆయనకు అనుభవం లేకపోవచ్చు. అనుభవం ఉన్న మంత్రిగా మీరు (శ్రీధర్‌బాబునుద్దేశించి) చెప్పాలి కదా? మేం మిమ్మల్ని కోరుతున్నాం.
రేవంత్: మీది అవగాహన రాహిత్యం. అనవసర వివాదాలను తేవద్దు. మీది మేనేజ్‌మెంట్ కోటా మాత్రమే కాదు... నయా భూస్వామ్య విధానం. నేను అయ్యా, తాత పేరు చెప్పుకుని రాలేదు. జిల్లా పరిషత్ నుంచి మండలి సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా స్వయంకృíÙతో ఎదిగి సీఎం అయ్యా. వివాదాలు వద్దు. చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పండి.
కేటీఆర్: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారికి సహనం, సంయమనం, ఓపిక ఉండాలి. నన్ను మేనేజ్‌మెంట్ కోటా అన్నారు. పేమెంట్ కోటాలో సీఎం సీటు కొట్టేశారని నేను అంటా. అయ్యల పేర్లు చెప్పి అని మాట్లాడుతున్నారు. మీరు రాహుల్ గురించి మాట్లాడుతున్నారా? రాజీవ్ గురించి మాట్లాడుతున్నారా?
మీదాకా వస్తే కానీ అర్థం కాలేదా?: కేటీఆర్
కేటీఆర్: ప్రధాని రాష్ట్రానికి వస్తే పెద్దన్నా అంటూ అన్నదమ్ముల అనుబంధాన్ని పండించారు. కానీ ఏం జరిగింది? మీదాకా వస్తే కానీ అర్థం కాలేదా? మేం ఇన్ని రోజులు చెప్పింది అదే. వారి వ్యవహారం అలానే ఉంటుంది. తత్వం ఇప్పుడైనా మీకు అర్థమైంది చాలు.
రేవంత్: మిషన్ భగీరథ కార్యక్రమానికి 2016, ఆగస్టు 7న మెదక్ జిల్లా కోమటిబండకు ప్రధాని మోదీ వస్తే కేసీఆర్ ఏమన్నారు. మాకు 50 వేల కోట్లు, లక్ష కోట్లు వద్దు. మీ ప్రే మ, ఆశీర్వాదాలు చాలు అనలేదా? ప్యార్ చాహియే అంటూ మోదీ ప్రేమలో మునిగి తేలి తెలంగాణను ముంచలేదా?
బీజేపీని కాపాడింది మీరు కాదా?: రేవంత్
కేటీఆర్: ఎలివేటెడ్ కారిడార్ మేమే తెచ్చాం. రక్షణ శాఖ భూముల విషయంలో ఎంతో చేశాం. ఎవరో చేసిన దాన్ని మా ఖాతాల్లో వేసుకునే అలవాటు లేదు. ఏమీ చేయకుండానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని మేం చెప్పుకోం. కేంద్రం నిధులివ్వకపోయినా ఆగలేదు. పోరాడాం.. గర్జించాం.
రేవంత్: మీరేదో పోరాటం చేసినట్టు, మీ పోరాటానికి ఢిల్లీ దద్దరిల్లినట్టు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014–21 వరకు ఎన్డీయేకు రాజ్యసభలో మెజార్టీ లేనప్పుడు బీజేపీని కాపాడింది మీరు కాదా? జీఎస్టీ బిల్లు పెట్టగానే బీజేపీ రాష్ట్రాల కంటే ముందే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేయలేదా? ఆర్టీఐ చట్ట సవరణ బిల్లు, నోట్ల రద్దుకు మద్దతివ్వడంతో పాటు రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడికి ఓట్లు వేసిందెవరు? ఆరి్టకల్ 370 రద్దుకు మద్దతిచి్చందెవరు? ట్రిపుల్ తలాఖ్ అప్పుడు వాకౌట్ చేసిందెవరు? ఇప్పుడు అసలు విషయం పక్కనపెట్టి ఏదో చేశామని చెప్తారా?
ఓల్డ్ సిటీలో అదానీ మనుషుల సంగతి చూడండి: కేటీఆర్
కేటీఆర్: కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టమంటే మేం పెట్టలేదు. రైతుల పక్షాన నిలబడ్డాం. కానీ, ఇప్పుడు హైదరాబాద్‌లో కరెంటును అదానీకి అప్పజెపుతున్నారని వార్తలొచ్చాయి. ఓల్డ్‌సిటీలో అదానీ మనుషులు వచ్చారని గొడవలు జరుగుతున్నాయి చూసుకోండి. ఎంఐఎం ఎమ్మెల్యేలతో మాట్లాడి వారిలో భరోసా కలి్పంచండి.
భట్టి: అదానీ గురించి మేం ఎప్పుడూ చెప్పలేదు. సభను తప్పుదోవ పట్టించకండి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అసలు అంశాన్ని పక్కన పెట్టి ఆవు కథలాగా మళ్లీ పదేళ్ల చరిత్ర చెబుతున్నారు. బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందోనని ‘ఆవుకు నాలుగు కాళ్లు ఉండును. తోక ఉండును అని
అంటున్నారు.
రేవంత్: గాలివాటం వార్తలు పట్టుకుని గాలిమాటలు మాట్లాడడం కాదు. అదానీకి అప్పగిస్తామని మేమెప్పుడూ చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment