7 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ముగిసిన పోలింగ్‌ | Bypolls: Voting In 13 Assembly Seats In 7 States | Sakshi
Sakshi News home page

7 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ముగిసిన పోలింగ్‌

Published Wed, Jul 10 2024 9:27 AM | Last Updated on Wed, Jul 10 2024 7:01 PM

Bypolls: Voting In 13 Assembly Seats In 7 States

Updates..

👉ఏడు రాష్ట్రా‍ల్లో 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. 

👉పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఉన్న ఓటర్లు మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. 

👉ఇక, సాయంత్రం ఐదు గంటల వరకు బెంగాల్‌ ఉప ఎన్నికల్లో 62.71 శాతం పోలింగ్‌ నమోదైంది. 

👉ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు బుధవారం ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

👉బీహార్‌లోని రూపాలి, రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్ మానిక్తలా (పశ్చిమబెంగాల్‌లో), విక్రవాండి (తమిళనాడు), అమర్‌వార (మధ్యప్రదేశ్), బద్రీనాథ్, మంగ్లార్ (ఉత్తరాఖండ్‌లో), జలంధర్ వెస్ట్ (పంజాబ్)..డెహ్రా, హమీర్‌పూర్, నలాఘర్ (హిమాచల్ ప్రదేశ్)లో పోలింగ్‌ కొనసాగుతుంది.

👉ఎమ్మెల్యేల మరణం, వివిధ పార్టీలకు రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జూలై 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement