రేవంత్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయరు?: హరీష్‌రావు | Ex Minister Harish Rao Reaction To Allu Arjun Arrest | Sakshi
Sakshi News home page

రేవంత్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయరు?: హరీష్‌రావు

Published Fri, Dec 13 2024 4:09 PM | Last Updated on Fri, Dec 13 2024 5:06 PM

Ex Minister Harish Rao Reaction To Allu Arjun Arrest

సాక్షి, హైదరాబాద్‌: అల్లు అర్జున్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసలు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందెవరు?. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అంటూ ప్రశ్నలు గుప్పించారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులే. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ  వైఫల్యమే అని హరీష్‌రావు మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్‌ని ఎందుకు అరెస్టులు చేయరు?. రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు?. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.

అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్‌ కోసం క్లిక్ చేయండి

‘‘ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?. ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు  చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి. ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి?. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు’’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ‘అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో నాకేం సంబంధం లేదు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement