నువ్వాగన్నా... నేను రాకుంటేంది? | tdp mla revanth reddy comments on errabelli dayakara rao | Sakshi
Sakshi News home page

నువ్వాగన్నా... నేను రాకుంటేంది?

Published Tue, Nov 11 2014 9:54 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

నువ్వాగన్నా... నేను రాకుంటేంది? - Sakshi

నువ్వాగన్నా... నేను రాకుంటేంది?

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా నిన్న అసెంబ్లీ లాబీలో నేతల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం సభ పది నిమిషాలు వాయిదా పడిన తర్వాత టీడీపీ, బీజేపీ నేతలు స్పీకర్ను ఆయన చాంబర్లో కలిసేందుకు వచ్చారు. బీజేపీ నేత లక్ష్మణ్ అప్పటికే స్పీకర్ ఛాంబర్కు చేరుకోగా... రేవంత్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ ఎర్రబెల్లి దయాకరరావు.. స్పీకర్ ఛాంబర్ ఎదటు నిలబడిపోయారు.

ఆ సమయంలో రేవంత్..రేవంత్ అంటూ ఎర్రబెల్లి ఒకింత గట్టిగానే పిలిచారు. జానా ఛాంబర్ ఎదుట విలేకర్లతో ముచ్చటిస్తున్న రేవంత్...'నువ్వాగన్నా.. నేను రాకుంటేంది? మీరు మాట్లాడలేరా..?' అంటూ విసురుగా సమాధానం చెబుతూ వెళ్లారు. దీంతో అవాక్కయి చూడటం ఎర్రబెల్లి వంతయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement