![Congress Mark Rajmudra With Three Colours In Telangana](/styles/webp/s3/article_images/2024/05/30/telangana-new-logo.jpg.webp?itok=8i-oUW8j)
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ తమ మార్క్ రాజ ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతోంది. అధికారిక గేయం ఎంపిక.. అధికారిక చిహ్నానికి మార్పులపై కసరత్తు చేస్తోంది. పలు రకాలు లోగోలు డిజైన్ చేయగా, రాజముద్రలో మూడు సింహాల జాతీయ చిహ్నం, వ్యవసాయం, తెలంగాణ వీరుల స్తూపానికి చోటు లభించినట్లు సమాచారం. ఆవిర్భావ దినోత్సవం రోజున లోగా ఆవిష్కరించనున్నారు. లోగో ఖారారుపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు.. పార్టీ నేతలతో భేటీ తర్వాత ఇవాళ రాష్ట్ర చిహ్నాన్ని ఖారారు చేసే అవకాశం ఉంది.
కాగా, దశాబ్ది ఉత్సవాల క్రమంలోనే.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాచరిక ఆనవాళ్లు లేకుండా చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను అధికారిక లోగో నుంచి తొలగించే ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది.
![](/sites/default/files/inline-images/31_3.jpg)
తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిందని.. అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీస్తోంది. అయితే ఈ అంశాలపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. దశాబ్ది వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కానీ దశాబ్ది వేడుకలకు సోనియాగాం«దీని ఏ హోదా ఉందని పిలుస్తారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment