ఏలూరులో ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపుకార్డులు అందిస్తున్న ఏడీ జీసీహెచ్ ప్రభాకర్
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అర్హులైన ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపుకార్డులు జారీ చేస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీసీహెచ్ ప్రభాకర్ అన్నారు.
స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని ఏడీ కార్యాలయంలో శుక్రవారం ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 126 మంది ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపుకార్డులు అందజేశామని, ఇంకా అర్హులుంటే తమ వివరాలతో కార్యాలయ పనివేళల్లో దరఖాస్తు అందజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment