హగ్‌ మీ ప్లీజ్‌.. | Queer hug Campaign For Transgenders | Sakshi
Sakshi News home page

హగ్‌ మీ ప్లీజ్‌..

Published Mon, Sep 10 2018 8:07 AM | Last Updated on Mon, Sep 10 2018 8:41 AM

Queer hug Campaign For Transgenders - Sakshi

సాక్షి, ఖైరతాబాద్‌: ‘అందరిలాగే మేము కూడా మనుషులమే.. మమ్మలను అందరితో సమానంగా చూడండి. మాతో మాట్లాడినంత మాత్రాన, మమ్మల్ని కౌగిలించుకున్నంత మాత్రాన ఏమీ కాద’0టూ హిజ్రాలు, గే, లేస్బియన్స్‌ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తమతో స్నేహం చేయాలంటూ ఆదివారం సాయంత్రం మోబీరా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘క్వీర్‌ కౌగిలి’ పేరుతో నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో ప్రచారం చేశారు.

ప్రేమ అనేది మనసుకు చెందినదని, శరీరానికి కాదని, తమను ఓ సారి కౌగిలించుకుంటే ఏమీ కాదని ప్లకార్డులు ప్రదర్శించారు. తాము సమాజంలో మనుషులమేనని గుర్తించాలని కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శాండీ, అనిల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీపుల్స్‌ ప్లాజాలో రేయిన్‌బో ప్లాగ్‌ను ప్రదర్శిస్తూ ర్యాలీ తీశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement