
లండన్: ఓ ట్రాన్స్‌జెండర్ ఆస్పత్రిలోని వైఫై ఉపయోగించుకుని ఏకంగా 80 వేల పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన యూకేలో చోటు చేసుకుంది. 54 ఏళ్ల జూలీ మార్షాల్ అనే ట్రాన్స్‌జెండర్ 2017 ఆగస్టులో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరింది. బెడ్డుపై పేషెంటు స్థితిలో ఉన్న ఆమె అక్కడ ఉన్న పబ్లిక్ వైఫైను తన ఫోన్‌కు, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకుంది. అనంతరం 80 వేల వరకు పోర్న్ ఫొటోలు, వీడియోలను ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసింది. అవన్నీ కూడా పిల్లల పోర్న్ ఫొటోలే కావడం గమనార్హం. అయితే పెద్ద మొత్తంలో ఉండే ఇంటర్నెట్ ప్యాక్ ఎంతో తొందరగా అయిపోవడంతో ఆస్పత్రి వర్గాలు అసలేం జరుగుతోందని ఆరా తీశాయి. అప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్ అసలు రంగు బయటపడింది. (చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించిన ఫోటోగ్రాఫర్!)
ఉన్న నెట్టంతా అసభ్య ఫొటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోడానికే ఆమె వినియోగించిందని తేలింది. దీంతో వెంటనే ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె దగ్గర నుంచి ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఆమెపై అనుమానంతో ఇంటికి వెళ్లి చూడగా కుప్పలుగా పడి ఉన్న సీడీలను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా ఆమెకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇప్పుడు పోలీసులకు అసలైన చిక్కొచ్చి పడింది. ట్రాన్స్‌జెండర్‌ను మహిళల జైల్లో ఉంచాలా? లేదా మగవాళ్ల జైల్లో ఉంచాలా? అనేది అర్థమవక తలలు పట్టుకుంటున్నారు. (జోక్ చేశాడని హత్య చేశారు!)
Comments
Please login to add a commentAdd a comment