Free Wi Fi
-
ఆరు వేల రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే మరో మైలురాయిని అందుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత వై-ఫై సేవలు ఇప్పటి వరకు 6 వేల స్టేషన్లకు విస్తరించాయి. జార్ఖండ్‌లోని హజారిబాగ్ టౌన్లో శనివారం ఈ సౌకర్యం కల్పించడంతో రైల్వే 6 వేల స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు అందిస్తున్నట్లు జాతీయ రవాణా సంస్థ తెలిపింది. 2016లో ముంబై రైల్వే స్టేషన్లో మొట్ట మొదట ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని మిదాన్‌పూర్ స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు అందించి 5,000 మార్కును అందుకుంది. అలాగే, మే 15 న ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని జరపాడ స్టేషన్‌కు కూడా వై-ఫై సౌకర్యం కల్పించినట్లు ఆదివారం తెలిపింది. "డిజిటల్ ఇండియాలో కార్యక్రమం కిందదేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సౌకర్యం" కల్పిస్తున్నారు. దీని వల్ల గ్రామీణ పట్టణ పౌరుల మధ్య డిజిటల్ అంతరం తగ్గుతుంది. తద్వారా గ్రామాల్లో డిజిటల్ మీద అవగాహన పెరుగుతుంది అని అని రైల్వే శాఖ తెలిపింది. "భారతీయ రైల్వేలు ఇప్పుడు 6,000 స్టేషన్లలో వై-ఫై సౌకర్యాన్ని అందిస్తున్నాయి" అని తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని పీఎస్‌యు రైల్‌టెల్ సహాయంతో రైల్వేలకు ఎటువంటి ఖర్చు లేకుండా స్టేషన్లలో వై-ఫై సౌకర్యాలు కల్పిస్తున్నారు. గూగుల్, డాట్(యుఎస్ఓఎఫ్ కింద), పీజిసీఐఎల్, టాటా ట్రస్ట్ భాగస్వామ్యంతో ఈ పని చేపట్టినట్లు తెలిపింది. చదవండి: 5.5 కోట్ల యూజర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ -
ఫ్రీ వైఫై; 80 వేల పోర్న్ వీడియోలు డౌన్లోడ్
లండన్: ఓ ట్రాన్స్‌జెండర్ ఆస్పత్రిలోని వైఫై ఉపయోగించుకుని ఏకంగా 80 వేల పోర్న్ వీడియోలను డౌన్లోడ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన యూకేలో చోటు చేసుకుంది. 54 ఏళ్ల జూలీ మార్షాల్ అనే ట్రాన్స్‌జెండర్ 2017 ఆగస్టులో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరింది. బెడ్డుపై పేషెంటు స్థితిలో ఉన్న ఆమె అక్కడ ఉన్న పబ్లిక్ వైఫైను తన ఫోన్‌కు, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకుంది. అనంతరం 80 వేల వరకు పోర్న్ ఫొటోలు, వీడియోలను ల్యాప్‌టాప్‌లో డౌన్లోడ్ చేసింది. అవన్నీ కూడా పిల్లల పోర్న్ ఫొటోలే కావడం గమనార్హం. అయితే పెద్ద మొత్తంలో ఉండే ఇంటర్నెట్ ప్యాక్ ఎంతో తొందరగా అయిపోవడంతో ఆస్పత్రి వర్గాలు అసలేం జరుగుతోందని ఆరా తీశాయి. అప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్ అసలు రంగు బయటపడింది. (చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించిన ఫోటోగ్రాఫర్!) ఉన్న నెట్టంతా అసభ్య ఫొటోలు, వీడియోలు డౌన్లోడ్ చేసుకోడానికే ఆమె వినియోగించిందని తేలింది. దీంతో వెంటనే ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె దగ్గర నుంచి ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఆమెపై అనుమానంతో ఇంటికి వెళ్లి చూడగా కుప్పలుగా పడి ఉన్న సీడీలను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా ఆమెకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇప్పుడు పోలీసులకు అసలైన చిక్కొచ్చి పడింది. ట్రాన్స్‌జెండర్‌ను మహిళల జైల్లో ఉంచాలా? లేదా మగవాళ్ల జైల్లో ఉంచాలా? అనేది అర్థమవక తలలు పట్టుకుంటున్నారు. (జోక్ చేశాడని హత్య చేశారు!) -
ఫ్రీ వై ఫై
నగరమంతా 150 హాట్ స్పాట్స్ ఏర్పాటు {పణాళికలు రూపొందించిన బీఎస్ఎన్ఎల్ సిటీబ్యూరో: గ్లోబల్ స్మార్ట్ సిటీలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ అంతటా ఉచిత వై ఫై సేవల విస్తరణకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. దేశంలోనే తొలి పూర్తి స్థారుు వై ఫై మహా నగరంగా తీర్చిదిద్దేందుకు సొంతంగా హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియను సైతం పూర్తి చేసింది. ఇప్పటి వరకు క్వాడ్జన్ సంస్థ ఒప్పందంతో సుమారు 49 హాట్ స్పాట్స్‌లను ఏర్పాటు చేసి ఉచిత వై ఫై సేవలు అందిస్తోంది. తాజాగా 150 వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేసి సేవలు విస్తరించాలని సంకల్పించింది. వైఫై హాట్‌స్పాట్స్ ద్వారా వినియోగదారులు 2 నుంచి 10 ఎంబీపీఎస్ వరకు డాటాను డౌన్లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు కలగనుంది. స్మాల్, మీడియం,లార్జ ్జహాట్ స్పాట్స్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో హాట్ స్పాట్స్‌కు ఐదు వై ఫై టవర్స్, ఒక్కో టవర్ ఐదు నుంచి పది కిలో మీటర్ల మేర సేవలు అందించే విధంగా చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం పది కిలోమీటర్లకు ఒక జోన్‌గా పరిగణిస్తున్నారు. మొబైల్ డాటా ఆఫ్ లోడ్.. బీఎస్ఎన్ఎల్ మొబైల్ 3 జీ వినియోగదారులకు ఉచిత వై ఫై టవర్ మరింత వెసులు బాటుగా మారింది. హాట్ స్పాట్స్ టవర్ పరిధిలోకి మొబైల్ రాగానే మొబైల్ డాటా అటో మెటిక్‌గా ఆఫ్ అరుు ఉచిత వైఫై డాటా వినియోగంలోకి వస్తుంది. మొబైల్ డాటా ప్లాన్ ప్రకారం డాటాను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పర్యాటక ప్రాంతాలైన గోల్కొండ ఖిల్లా, నెహ్రూ జూ పార్క్, సాలార్ జంగ్ మ్యూజియం ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సేవలు విస్తరించనున్నారు. 15 నిమిషాలు ఉచితం.. బీఎస్ఎన్ఎల్ హాట్ స్పాట్స్ ద్వారా వైఫై సేవలను వినియోగదారులు ఒక మొబైల్ ద్వారా 15 నిమిషాల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత వోచర్ బేస్ట్ సర్వీసెస్, ఈ-వోచర్ బెస్ట్ సర్వీసెస్ అందుబాటులో ఉంటారుు. ఈ వోచర్స్ కోసం డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను వినియోగించవచ్చు. ఈ సర్వీసులను తక్కువ రేట్లకు బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. మార్చి లోపు సిటీ అంతటా ఉచిత వైఫై.. బీఎస్ఎన్ఎల్ హాట్ స్పాట్స్ ద్వారా మార్చి లోగా సిటీ అంతటా ఉచిత వైఫై సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించాం. సొంతంగా హాట్ స్పాట్స్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అరుు్యంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే బీఎస్ఎన్ఎల్ లక్ష్యం. - రాంచంద్, ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్, బీఎస్ఎన్ఎల్, హైదరాబాద్