ఫ్రీ వై ఫై
నగరమంతా 150 హాట్ స్పాట్స్ ఏర్పాటు
{పణాళికలు రూపొందించిన బీఎస్‌ఎన్‌ఎల్
సిటీబ్యూరో: గ్లోబల్ స్మార్ట్ సిటీలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ అంతటా ఉచిత వై ఫై సేవల విస్తరణకు బీఎస్‌ఎన్‌ఎల్ సిద్ధమవుతోంది. దేశంలోనే తొలి పూర్తి స్థారుు వై ఫై మహా నగరంగా తీర్చిదిద్దేందుకు సొంతంగా హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియను సైతం పూర్తి చేసింది. ఇప్పటి వరకు క్వాడ్జన్ సంస్థ ఒప్పందంతో సుమారు 49 హాట్ స్పాట్స్‌లను ఏర్పాటు చేసి ఉచిత వై ఫై సేవలు అందిస్తోంది. తాజాగా 150 వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేసి సేవలు విస్తరించాలని సంకల్పించింది. వైఫై హాట్‌స్పాట్స్ ద్వారా వినియోగదారులు 2 నుంచి 10 ఎంబీపీఎస్ వరకు డాటాను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు కలగనుంది. స్మాల్, మీడియం,లార్‌జ ్జహాట్ స్పాట్స్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో హాట్ స్పాట్స్‌కు ఐదు వై ఫై టవర్స్, ఒక్కో టవర్ ఐదు నుంచి పది కిలో మీటర్ల మేర సేవలు అందించే విధంగా చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం పది కిలోమీటర్లకు ఒక జోన్‌గా పరిగణిస్తున్నారు.
మొబైల్ డాటా ఆఫ్ లోడ్..
బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ 3 జీ వినియోగదారులకు ఉచిత వై ఫై టవర్ మరింత వెసులు బాటుగా మారింది. హాట్ స్పాట్స్ టవర్ పరిధిలోకి మొబైల్ రాగానే మొబైల్ డాటా అటో మెటిక్‌గా ఆఫ్ అరుు ఉచిత వైఫై డాటా వినియోగంలోకి వస్తుంది. మొబైల్ డాటా ప్లాన్ ప్రకారం డాటాను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పర్యాటక ప్రాంతాలైన గోల్కొండ ఖిల్లా, నెహ్రూ జూ పార్క్, సాలార్ జంగ్ మ్యూజియం ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సేవలు విస్తరించనున్నారు.
15 నిమిషాలు ఉచితం..
బీఎస్‌ఎన్‌ఎల్ హాట్ స్పాట్స్ ద్వారా వైఫై సేవలను వినియోగదారులు ఒక మొబైల్ ద్వారా 15 నిమిషాల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత వోచర్ బేస్ట్ సర్వీసెస్, ఈ-వోచర్ బెస్ట్ సర్వీసెస్ అందుబాటులో ఉంటారుు. ఈ వోచర్స్ కోసం డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను వినియోగించవచ్చు. ఈ సర్వీసులను తక్కువ రేట్లకు బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులో ఉంచింది.
మార్చి లోపు సిటీ అంతటా ఉచిత వైఫై..
బీఎస్‌ఎన్‌ఎల్ హాట్ స్పాట్స్ ద్వారా మార్చి లోగా సిటీ అంతటా ఉచిత వైఫై సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించాం. సొంతంగా హాట్ స్పాట్స్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అరుు్యంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే బీఎస్‌ఎన్‌ఎల్ లక్ష్యం. - రాంచంద్, ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్, బీఎస్‌ఎన్‌ఎల్, హైదరాబాద్