global smart city
-
స్మార్ట్ రేసులో భారత నగరాల వెనుకంజ
న్యూఢిల్లీ: ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో భారతదేశంలోని ప్రధాన నగరాలు కాస్త వెనుకంజ వేశాయి. ఈ జాబితాలో సింగపూర్ టాప్‌లో నిలిచింది. ఐఎండీ, ఎస్‌యూటీడీలు సర్వే చేసి 2020 స్మార్ట్ సిటీ సూచీని తయారు చేశాయి. ఈ జాబితాలో గతేడాదితో పోలిస్తే భారతీయ నగరాల ర్యాంకులు దిగజారాయి. జాబితాలో హైదరాబాద్ 85, న్యూఢిల్లీ 86, ముంబై 93, బెంగళూరు 95వ స్థానాల్లో నిలిచాయి. 2019లో ఈ నగరాలు వరుసగా 67, 68, 78, 79 స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా సంక్షోభానికి తయారుగా లేకపోవడంతో దేశీయ నగరాలు ఇబ్బంది పడ్డాయని సర్వే తెలిపింది. సాంకేతికత నిత్యనూతనంగా(అప్ టు డేట్) లేని చోట కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. భారతీయ నగరాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య వాయు కాలుష్యమని ఇక్కడ నివసించేవారు అభిప్రాయపడ్డారు. వాయు కాలుష్యం తర్వాత హైదరాబాద్, ఢిల్లీలో కనీస సౌకర్యాలు లేకపోవడం, ముంబై, బెంగళూరుల్లో ఇరుకు రోడ్లు ప్రధాన సమస్యలుగా నిలిచాయి. అంతర్జాతీయంగా చూస్తే జాబితాలో సింగపూర్ తర్వాత హెల్సిన్కి, జ్యూరిచ్, ఆక్లాండ్, ఓస్లో, కోపెన్‌హాగెన్, జెనీవా, తైపీ, ఆమ్స్టర్డామ్, న్యూయార్క్‌లు ఉన్నాయి. జాబితా రూపొందించడం కోసం ప్రతి నగరంలో వందలాదిమందిని సర్వే చేశారు. సర్వే కోసం 15 సూచికలను వాడారు. కీలకంగా ఆరోగ్యం, భద్రత, రవాణా, అవకాశాలు, పాలన తదితర అంశాల్లో సాంకేతికత వినియోగంపై సర్వేలో ఎక్కువ దృష్టి పెట్టారు. స్మార్ట్‌సిటీలపై కరోనా ప్రభావం తీసివేయలేనిదని, సాంకేతికత బాగా ఉన్న చోట్ల ప్రభావం తక్కువని ఐఎండీ ప్రొఫెసర్ అర్టురోబ్రిస్ చెప్పారు. -
సిటీలో ‘మల్టీ’ ఫ్లైఓవర్లు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం) పనుల్లో భాగంగా షేక్‌పేట నుంచి విస్పర్ వ్యాలీ వరకు ఆరు లేన్ల భారీ ఫ్లైఓవర్, మరో మూడు జంక్షన్లలో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ల పనులకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాధాన్యత క్రమంలో వీటిని చేపట్టేందుకు జీహెచ్ఎంసీకి అనుమతినిస్తూ పరిపాలనపర అనుమతులు జారీ చేసింది. రూ.263.09 కోట్లతో మూడు జంక్షన్ల పనులకు శనివారం జీవో జారీచేయగా, రూ. 333.55 కోట్లతో భారీ ఫ్లైఓవర్ పనులకు ఇటీవలే జీవో జారీ చేసింది. వెరసి మొత్తం రూ.596.64 కోట్ల పనులకు టెండర్లు పిలవనున్నారు. ఈ పనులు ఎస్సార్డీపీ మలిదశల్లో ఉన్నప్పటికీ, ఐటీ కారిడార్‌లో రోజురోజుకూ తీవ్రమవుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత క్రమంలో వీటిని నిర్మించాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్ భావించిన నేపథ్యంలో వీటికి ప్రాధాన్యత నిచ్చారు. ఆరు లేన్ల ఫ్లైఓవర్.. ఇందులో షేక్‌పేట కులీఖుతుబ్షాసెవెన్ టూంబ్స్ నుంచి ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్‌వ్యాలీ జంక్షన్(మహా ప్రస్థానం) వరకు దాదాపు 2.8 కి.మీ.ల మేర ఫ్లైౖఓవర్ నిర్మించనున్నారు. టూ వే ఆరు లేన్ల ఫ్లైఓవర్ ఇది. కోర్ ఏరియా(పాత ఎంసీహెచ్) ప్రాంతం నుంచి హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లే వారికి ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల్ని తొలగించేందుకు దీన్ని నిర్మించనున్నారు. మెహదీపట్నం, అత్తాపూర్ తదితర ప్రాంతాల నుంచి టోలిచౌకి ఫ్లైఓవర్ మీదుగా హైటెక్ సిటీవైపు వెళ్తున్న వారికి ఫ్లైఓవర్ దాటాక తీవ్ర ట్రాఫిక్ చిక్కులు ఎదురువుతున్నాయి. కొత్తగా నిర్మించబోయే ఆరులేన్ల ఈ ఫ్లైఓవర్ ద్వారా వీరితోపాటు కోర్ ఏరియాలోని వివిధ ప్రాంతాల నుంచి ఐటీ హబ్ వైపు వెళ్లే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. మూడు జంక్షన్లలో మల్టీ ఫ్లైఓవర్లు.. ఐటీ కారిడార్‌లోని మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు 1.8 కి.మీ. పరిధిలో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. బొటానికల్ గార్డెన్‌కు 400 మీటర్ల ముందు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు ఒక ఫ్లైఓవర్ ప్రారంభమవుతుంది. ఇది నాలుగు లేన్ల ఒన్ వే ఫ్లైఓవర్ బొటానికల్ గార్డెన్ జంక్షన్ దగ్గర దీనికి ఒక అప్ర్యాంప్ కలుస్తుంది. ఇది రెండు లేన్ల ఒన్ వే. ఐదు లేన్లుగా ఇది కొత్త గూడ జంక్షన్ వరకు కొనసాగుతుంది. కొత్త గూడ జంక్షన్లో మూడు లేన్ల ఒన్‌వే డౌన్ ర్యాంప్ ఒకటి మాదాపూర్, హైటెక్‌సిటీ వైపు వెళ్లే వారికోసం నిర్మిస్తారు. కొత్త గూడ జంక్షన్ నుంచి మియాపూర్ వైపు వెళ్లేందుకు కొండాపూర్ దగ్గర మూడు లేన్ల ఒన్‌వే డౌన్ ర్యాంప్ ఉంటుంది. మియాపూర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం కొత్తగూడ జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మిస్తారు. దీన్ని రెండు లేన్లతో ఒన్‌వేగా నిర్మిస్తారు. ఈ జంక్షన్ల వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు పూర్తయితే ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఇబ్బంది తగ్గుతుంది. ప్రాజెక్టులు సరే.. నిధులేవీ..? ఇవిలా ఉండగా, నాలాల ఆధునీకరణ పనుల కోసం మరో రూ. 230 కోట్లకు ప్రభుత్వం శుక్రవారం జీహెచ్ఎంసీకి పరిపాలన అనుమతులిస్తూ జీవో జారీ చేసింది. ఈ పనులన్నింటినీ జీహెచ్ఎంసీ నిధులతోనే చేపట్టాల్సి ఉంది. ఈ మూడు ప్రాజెక్టులు కలిపితే దాదాపు రూ. 928 కోట్ల రూపాయలవుతుంది. జీహెచ్ఎంసీ ఖజానాలోని ఆదాయం నిర్వహణ పనులకే సరిపోతోంది. ఈ ప్రాజెక్టులతో పాటు ఇతరత్రా పనుల కోసం బాండ్ల జారీ, బ్యాంకు రుణాల ద్వారా రూ. 3500 కోట్లు సేకరించాలని భావించారు. ఆ పనుల కోసం జీహెచ్ఎంసీ గత ఏప్రిల్‌లో పంపిన ఫైలు ప్రభుత్వం వద్ద ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే బాండ్ల జారీ ద్వారా రూ.1000 కోట్లు, బ్యాంకు రుణాల ద్వారా రూ. 2500 కోట్లు సేకరించే ప్రక్రియ ప్రారంభించాలని ఎదురు చూస్తున్నారు. అప్పటి దాకా ఏమీ చేయలేని పరిస్థితి. -
ఫ్రీ వై ఫై
నగరమంతా 150 హాట్ స్పాట్స్ ఏర్పాటు {పణాళికలు రూపొందించిన బీఎస్ఎన్ఎల్ సిటీబ్యూరో: గ్లోబల్ స్మార్ట్ సిటీలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ అంతటా ఉచిత వై ఫై సేవల విస్తరణకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. దేశంలోనే తొలి పూర్తి స్థారుు వై ఫై మహా నగరంగా తీర్చిదిద్దేందుకు సొంతంగా హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియను సైతం పూర్తి చేసింది. ఇప్పటి వరకు క్వాడ్జన్ సంస్థ ఒప్పందంతో సుమారు 49 హాట్ స్పాట్స్‌లను ఏర్పాటు చేసి ఉచిత వై ఫై సేవలు అందిస్తోంది. తాజాగా 150 వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేసి సేవలు విస్తరించాలని సంకల్పించింది. వైఫై హాట్‌స్పాట్స్ ద్వారా వినియోగదారులు 2 నుంచి 10 ఎంబీపీఎస్ వరకు డాటాను డౌన్లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు కలగనుంది. స్మాల్, మీడియం,లార్జ ్జహాట్ స్పాట్స్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో హాట్ స్పాట్స్‌కు ఐదు వై ఫై టవర్స్, ఒక్కో టవర్ ఐదు నుంచి పది కిలో మీటర్ల మేర సేవలు అందించే విధంగా చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం పది కిలోమీటర్లకు ఒక జోన్‌గా పరిగణిస్తున్నారు. మొబైల్ డాటా ఆఫ్ లోడ్.. బీఎస్ఎన్ఎల్ మొబైల్ 3 జీ వినియోగదారులకు ఉచిత వై ఫై టవర్ మరింత వెసులు బాటుగా మారింది. హాట్ స్పాట్స్ టవర్ పరిధిలోకి మొబైల్ రాగానే మొబైల్ డాటా అటో మెటిక్‌గా ఆఫ్ అరుు ఉచిత వైఫై డాటా వినియోగంలోకి వస్తుంది. మొబైల్ డాటా ప్లాన్ ప్రకారం డాటాను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పర్యాటక ప్రాంతాలైన గోల్కొండ ఖిల్లా, నెహ్రూ జూ పార్క్, సాలార్ జంగ్ మ్యూజియం ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సేవలు విస్తరించనున్నారు. 15 నిమిషాలు ఉచితం.. బీఎస్ఎన్ఎల్ హాట్ స్పాట్స్ ద్వారా వైఫై సేవలను వినియోగదారులు ఒక మొబైల్ ద్వారా 15 నిమిషాల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత వోచర్ బేస్ట్ సర్వీసెస్, ఈ-వోచర్ బెస్ట్ సర్వీసెస్ అందుబాటులో ఉంటారుు. ఈ వోచర్స్ కోసం డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను వినియోగించవచ్చు. ఈ సర్వీసులను తక్కువ రేట్లకు బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. మార్చి లోపు సిటీ అంతటా ఉచిత వైఫై.. బీఎస్ఎన్ఎల్ హాట్ స్పాట్స్ ద్వారా మార్చి లోగా సిటీ అంతటా ఉచిత వైఫై సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించాం. సొంతంగా హాట్ స్పాట్స్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అరుు్యంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే బీఎస్ఎన్ఎల్ లక్ష్యం. - రాంచంద్, ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్, బీఎస్ఎన్ఎల్, హైదరాబాద్ -
హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు
హైదరాబాద్ : రానున్న 20 ఏళ్లలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారమిక్కడ అన్నారు. అభివృద్ధి చెందిన అన్ని నగరాల టెక్నాలజీలను పర్యవేక్షిస్తున్నామని మెట్రోపొలిస్ సదస్సులో పాల్గొన్న ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ స్మార్ట్‌సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ తెలిపారు. పౌరులకు నాణ్యమైన సేవలు అందించేవే స్మార్ట్ సిటీలు అని, స్మార్ట్, సేఫ్ సిటీలు అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు అని, పన్నులు, ఆదాయం విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. డిజిటల్ హైదరాబాద్ కోసం కృషి చేస్తామని కేటీఆర్ తెలిపారు.