హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు
హైదరాబాద్ : రానున్న 20 ఏళ్లలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారమిక్కడ అన్నారు. అభివృద్ధి చెందిన అన్ని నగరాల టెక్నాలజీలను పర్యవేక్షిస్తున్నామని మెట్రోపొలిస్ సదస్సులో పాల్గొన్న ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ స్మార్ట్సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ తెలిపారు.
పౌరులకు నాణ్యమైన సేవలు అందించేవే స్మార్ట్ సిటీలు అని, స్మార్ట్, సేఫ్ సిటీలు అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు అని, పన్నులు, ఆదాయం విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. డిజిటల్ హైదరాబాద్ కోసం కృషి చేస్తామని కేటీఆర్ తెలిపారు.