Metropolis
-
సుందర విశాఖ.. ప్రగతి వీచిక
కేజీ రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మహానగరంగా రూపుదిద్దుకున్న విశాఖపట్నం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఓ వైపు కడలికెరటాల సవ్వడులు... మరోవైపు పచ్చదనం పరచుకున్న ప్రకృతి అందాలు... పెట్టని ఆభరణాలుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇటు విస్తరిస్తున్న ఐటీ రంగం... అటు విద్యాసుగంధాలు వెదజల్లుతున్న సరస్వతీ నిలయాలు నగరానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్నాయి. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఫ్లై ఓవర్లు... మల్టీ లెవెల్ కారు పార్కింగ్ సౌకర్యాలు విశేష గౌరవాన్ని ఆపాదిస్తున్నాయి. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు... ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన జంక్షన్లు నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖ ఉక్కుకర్మాగారం... ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఓడరేవు... నగర సమీపంలో విస్తరిస్తున్న పారిశ్రామిక వాడలు విశాఖకు విశేష గుర్తింపునివ్వగా... గతేడాది మార్చిలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సన్నాహక సదస్సులతో నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ప్రగతి పథంలో నడుస్తూ కార్యనిర్వాహక రాజధానికి కావలసిన అర్హతలన్నీ పుణికిపుచ్చుకుంది. నాలుగేళ్లుగా అభివృద్ధిలో పురోగమిస్తున్న నగరం విస్తరిస్తున్న ఐటీ రంగం ► రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను బీచ్ ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వాటికోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చింది. ఫలితంగా ప్రధాన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన డెవలప్మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేసింది. దానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు కంపెనీకి వెళ్లేందుకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేశారు. ► ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ తదితర ఐటీ, వాటి అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. రుషికొండ ఐటీ సెజ్ లో హిల్ నెంబర్–2లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తొలి విడతలో 1000 మందితో ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ► దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2006లో విప్రో క్యాంపస్‌కు 750 మందితో ప్రారంభించేందుకు వీలుగా స్థలాన్ని కేటాయించారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో దశలవారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ► వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ని మార్చాలని నిర్ణయించింది. విశాఖలో స్టార్టప్‌ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) సీఈవో సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు. ► ఐటీ రంగంలో విశాఖను అభివృద్ధి చేసేందుకు ఇక్కడే ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా.. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) సహకారంతో పాటు సంయుక్త సర్టిఫికేషన్ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ► అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్.. విశాఖలో కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. భారత్‌లో ఢిల్లీ తర్వాత వైజాగ్‌లోనే చెగ్ సంస్థ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం. విశేషం. అంతర్జాతీయ సదస్సులకు వేదికగా... ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన అంతర్జాతీయ ఐటీ సదస్సు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సన్నాహక సదస్సులు సూపర్ సక్సెస్ అయ్యాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఇన్ ఇండియా(ఎన్‌ఎఫ్‌ఐసీఐ) 28వ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశంతో పాటు 12వ సర్వ సభ్య సమావేశాలు, జైళ్ల శాఖ ఎనిమిదో జాతీయ సదస్సు, అగ్రిసదస్సు, ఇలా ప్రతి ఒక్కరికీ విశాఖ ఆహ్వానం పలుకుతోంది. డేటా సెంటర్లు.. స్టార్హోటల్స్కు కేరాఫ్ ఐటీ డెస్టినీగా మారుతున్న విశాఖపట్నంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం కలిగించేలా సీఎం వైఎస్ జగన్ తీర్చిదిద్దారు. అందుకే.. ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు తానే స్వయంగా శంకుస్థాపన చేశారు. ► వైజాగ్ టెక్‌పార్క్ కూడా 39,815 మందికి ఉపాధి కల్పించేలా డేటాసెంటర్‌తో పాటు బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీని రూ.21,844 కోట్లతో ఏర్పాటుకు ముందుకొచ్చింది. ► గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్‌మాల్, టర్బో ఏవియేషన్.. ఇలా.. విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టుల్ని విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపారు. సరికొత్తగా నగర రహదారులు గుంతల మయంగా ఉన్న రహదారులు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సరికొత్తగా రూపు దిద్దుకున్నాయి. నాలుగేళ్లలో మంజూరైన రహదార్లు: 2089 వెచ్చించనున్న నగదు: రూ.547.45 కోట్లు ఇప్పటివరకూ పూర్తయిన రోడ్లు: 1,216 వీటికి అయిన ఖర్చు: రూ. 202.59 కోట్లు పురోగతిలో ఉన్న రహదారులు: 873 వీటికి చేస్తున్న ఖర్చు: రూ.344.86 కోట్లు కొత్తగా వేస్తున్న రహదారుల పొడవు: 27 కి.మీ. వీటికి వెచ్చిస్తున్న మొత్తం: రూ.104 కోట్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్‌బేలు: 20 వీటికి చేసిన ఖర్చు: రూ.462.70 లక్షలు ట్రాఫిక్ కష్టాలకు ఫ్లైఓవర్‌తో చెక్ అత్యంత రద్దీ కూడలిగా ఉన్న ఎన్ఏడీలో ఫ్లైఓవర్ నిర్మాణానికి వీఎంఆర్డీఏ 2016 నుంచి ప్రయత్నిస్తున్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం సరైన సహకారం అందించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూతూ మంత్రంగా 2018 చివర్లో పనులు ప్రారంభించారు. కానీ.. ఎన్నికల ముందు నాటికే బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ పనులు భుజానికెత్తుకొని రూ.150 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఎన్ఏడీ జంక్షన్.. నగర కూడళ్లలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. దీనివల్ల పూర్తిగా ట్రాఫిక్ కష్టాలకు తెరపడింది. పర్యాటకం...మరింత ఆకర్షణీయం.. ► గతంలో విశాఖ పేరు వింటేనే ఆర్కే బీచ్, రిషికొండ, భీమిలి బీచ్ ప్రాంతాలు గుర్తుకువచ్చేవి. ఇప్పుడు పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు వీలుగా ప్రభుత్వం 11 కొత్త బీచ్‌లను అభివృద్ధి చేసింది. ► రూ.12.55 కోట్లతో మొత్తం 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలతో ఎప్పటికప్పుడు బీచ్‌లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఏరివేస్తూ శుభ్రం చేస్తున్నారు. ► ఈ 11 బీచ్‌లను అనుసంధానిస్తూ.. కోస్టల్ బీచ్ మాస్టర్ ప్లాన్‌లో జిల్లాలోని 25 బీచ్‌లు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. భీమిలిలోని పాండవుల పంచ బీచ్, అన్నవరం, భీమిలి, నేరెళ్లవలస, ఎర్రమట్టిదిబ్బలు, ఐఎన్ఎస్ కళింగ, మంగమారిపేట, తొట్లకొండ, తిమ్మాపురం, ఎస్ఈజెడ్, రుషికొండ, ఇస్కాన్ టెంపుల్, సాగర్‌నగర్, జూపార్క్, జోడుగుళ్లపాలెం, తెన్నేటిపార్క్, ఆర్కేబీచ్, రాధాకృష్ణ బీచ్, రాక్‌బీచ్, దుర్గా బీచ్, యారాడ, ప్యారడైజ్, అప్పికొండ, అప్పికొండ–2, అప్పికొండ బ్రిడ్జ్ బీచ్‌లు కొత్తగా పర్యాటకుల్ని స్వాగతం పలకనున్నాయి. ఆరోగ్యప్రదాయినిగా కేజీహెచ్ ► గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌ను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లతో ఆధునికీకరంచింది. ► ఐదు దశాబ్దాల క్రితం ఏర్పడిన క్యాజువాలిటీయే ఇప్పటికీ కొనసాగుతుండగా రెండో క్యాజువాలిటీ నిర్మాణానికి కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున రూ.30 లక్షలు కేటాయించి చేసి 15 పడకలతో నిర్మించారు. ► సెకెండ్ క్యాజువాలిటీని రౌండ్‌ది క్లాక్ పనిచేసేగా తీర్చిదిద్దారు. రోగుల కోసం రూ.15 లక్షలతో లేబొరేటరీతో పాటు మొబైల్ ఎక్స్‌రే యూనిట్, అల్ట్రా స్కానింగ్ సిద్దం చేశారు. ఆధునిక సౌకర్యాలు,సెంట్రల్ ఎయిర్ కండిషన్, పడకలు, ఆక్సిజన్, ఇతర సదుపాయాలు కల్పించారు. ► కార్డియాలజీ విభాగాన్ని రూ.24 లక్షల సీఎస్సార్ నిధులతో పునర్నిర్మించారు. ఐసీయూ, ఈకో, స్టేర్ కేస్, ఏసీ సదుపాయం, పెయింటింగ్స్, మరుగుదొడ్లు కొత్తగా తీర్చిదిద్దారు. ► విద్యుత్ ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో కేజీహెచ్‌లో 120 కేవీ సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ► ఓపెన్ హార్ట్ సర్జరీకి అవసరమైన పరికరం దశాబ్దం నుంచి పనిచేయకపోవడంతో శస్త్ర చిక్సితలు నిలిచిపోయాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని టెంపరేచర్ కంట్రోల్ మెషిన్ని మంజూరు చేసింది. ► అకస్మాత్తుగా వచ్చే గుండె నొప్పి బారిన పడేవారికోసం రాష్ట్ర ప్రభుత్వం స్టెమి ప«థకాన్ని రూపొందించింది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల్లో దీనిని అమలు చేస్తున్నారు. కార్డియాలజీ వైద్యుల సూచన మేరకు సుమారు రూ.30 వేల విలువైన ఇంజక్షన్ కేజీహెచ్‌లో ఉచితంగా రోగులకు అందిస్తున్నారు. రెండింతల అభివృద్ధి...! 2014–19 వరకూ టీడీపీ చేసిన ఖర్చు: రూ.1450 కోట్లు టీడీపీ ఐదేళ్ల హయాంలో చేపట్టిన పనులు: 4450 2019–2023 వరకూ వైఎస్సార్సీపీ చేసిన ఖర్చు: రూ.2490 కోట్లు వైఎస్సార్సీపీ హయాంలో నాలుగేళ్ల కాలంలో చేపట్టిన పనులు: 9920 గడపగడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన పనులు: 708 దీనికోసం వెచ్చిస్తున్న నగదు: రూ. 66 కోట్లు జంక్షన్లు... జిగేల్ ! ► మహావిశాఖ పరిధిలోని జంక్షన్లు కొత్త రూపును సంతరించుకున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారులు కలిసే జంక్షన్లను విశాలంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా కూడళ్ల వద్ద అందరినీ ఆకట్టుకునేలా అభివృద్ధి చేశారు. ► రైల్వేస్టేషన్ జంక్షన్ వద్ద రైల్వే కోచ్‌తో కూడిన జంక్షన్ నగరవాసులతో పాటు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక బస్టాండ్లను కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దారు. -
మూడు ఐపీఓలకు సెబీ ఆమోదం
మూడు కంపెనీల ఐపీఓలకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఇన్వెన్షియా హెల్త్‌కేర్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, ఎక్సెల్ప్ మ్యాక్ డిజైన్ అండ్ టెక్నాలజీ కంపెనీల ఐపీఓలకు సెబీ పచ్చజెండా ఊపింది. దీంతో ఈ ఏడాది సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య 73కు పెరిగింది. ఇన్వెన్షియా ఐపీఓ రూ.450 కోట్లు ఐపీఓలో భాగంగా ఇన్వెన్షియా హెల్త్‌కేర్ కంపెనీ రూ.125 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ప్రమోటర్లు, ఇతర వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా 31.64 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వాణిజ్య కార్యకలా పాలకు వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచి స్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్‌గా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, సెంట్రమ్ క్యాపిటల్‌లు వ్యవహరిస్తున్నాయి. మెట్రోపొలిస్ ఐపీఓ మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ ఐపీఓలో భాగంగా 1.52 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తారు. ఈ షేర్లలో సుశీల్ కనుభాయ్ షా 50 లక్షల షేర్లను, సీఏ లోటస్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ కోటి షేర్లను విక్రయిస్తాయి. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా జేఎమ్ ఫైనాన్షియల్, క్రెడిట్ సూసీ సెక్యూరిటీస్ ఉన్నాయి. ఎక్సెల్ప్మ్యాక్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.23 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఐపీఓ నిధులతో హైదరాబాద్, కోల్‌కతాల్లోని డెవలప్మెంట్ సెంటర్లకు కావలసిన ఐటీ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ పరికరాలను కొనుగోలు కోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించనున్నది. -
ముగిసిన మెట్రో పొలిస్ అంతర్జాతీయ సదస్సు
-
వాతావరణ మార్పులపై తక్షణం స్పందించండి
సాక్షి, హైదరాబాద్: వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, అప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని పర్యావరణవేత్త, ది ఎనర్జీ అండ్ ది రిసోర్స్ సంస్థ డెరైక్టర్ రాజేంద్రకుమార్ పచౌరి పేర్కొన్నారు. భవిష్యత్ తరాల ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా వర్తమాన సమాజ అవసరాలను తీర్చుకోవడమే సుస్థిర అభివృద్ధికి అసలైన నిర్వచనమన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఏదైనా దుర్ఘటన జరిగి భారీ మూల్యం చెల్లించే వరకు చూసే ధోరణి సరికాదని ఆయన హెచ్చరించారు. హెచ్ఐసీసీలో నాలుగు రోజులుగా జరుగుతున్న ‘11వ మెట్రోపొలిస్ అంతర్జాతీయ మేయర్ల సదస్సు’ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజున ‘వాతావరణ మార్పులు, విశ్వ నగరాలు’ అన్న అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో రాజేంద్ర పచౌరి పాలుపంచుకున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో తాజా పరిస్థితిపై కచ్చితమైన శాస్త్రీయ సమాచారం ప్రపంచం ముందుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం వంటివి వాతావరణ మార్పులకు శాస్త్రీయ ఆధారాలుగా పేర్కొన్నారు. ఈ శాతాబ్దం చివరి నాటికి వడగాల్పులు తీవ్రమవుతాయని, భారీ వర్షాలూ కురుస్తాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పట్టణ ప్రాంత వాతావరణ మార్పుల ప్రమాదాలు, దుష్ర్పభావాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగర వ్యవహారాలు, సేవలు, సదుపాయాలపై పర్యావరణ మార్పు ప్రభావం భవిష్యత్తులో తీవ్రంగా ఉండబోతుందన్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ పరిరక్షణకు పట్టణ ప్రాంతాల్లో శీఘ్ర చర్యలు అవసరమని నొక్కిచెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ధరిత్రిపై 2 శాతమే విస్తరించి ఉన్న నగరాలు.. ఏకంగా 78 శాతం ఇంధన శక్తిని వినియోగిస్తూ 60 శాతం వరకు కాలుష్యాలను విడుదల చేస్తున్నాయన్నారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ర్పభావాలతో ఎక్కువగా మురికివాడల ప్రజలు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒప్పందాల వేదిక..‘మెట్రోపొలిస్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన ‘11వ మెట్రోపొలిస్ సదస్సు 2014’ నగరాల మధ్య ఒప్పందాలకు వేదికగా నిలిచింది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన సదస్సు శుక్రవారం ముగిసింది. సదస్సు అర్థవంతమైన చర్చలకు.. ఆయా దేశాల్లోని నగరాల సమస్యలపై అవగాహన, పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఉపయోగపడిందని పలువురు ప్రతినిధులు పేర్కొన్నారు. ఆయా అంశాల్లో కలసి పనిచేసేందుకు భాగస్వామ్య ఒప్పందాలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నాలుగు నగరాలతో చర్చలు జరిపింది. జీ2జీ(గవర్నమెంట్ టు గవర్నమెంట్) నెట్వర్క్ చర్చల్లో భాగంగా బార్సిలోనా(స్పెయిన్), జోహన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా), మసాద్(ఇరాన్), సావోపొలో(బ్రెజిల్) లతో హైదరాబాద్ ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా నగరాల నుంచి వచ్చిన అధికారులు/మేయర్లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. మెరుగైన రహదారులు, వరదల నివారణ, చారిత్రక కట్టడాలు, హైదరాబాద్ పాతబస్తీ పునరుద్ధరణ అంశాలపై బార్సిలోనా, మసాద్, జోహన్నెస్బర్గ్లతో, సరసమైన ధరలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సావోపొలోతో చర్చలు జరిగాయి. మరో రెండు, మూడు చర్చల అనంతరం ఆయా నగరాలతో పూర్తిస్థాయి ఒప్పందం కుదర్చుకోనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. మెరుగైన సదుపాయాల కోసం.. మెరుగైన పార్కింగ్ సమస్యలు, వరదల నివారణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ఆర్థిక వనరుల పెంపు వంటి విధానాలున్న నగరాలతో ఇతర దేశాల నగరాలు ఒప్పందానికి ఆసక్తి కనబర్చాయి. బార్సిలోనా నగరంలో వరదల నివారణకు, వేసవిలో నీటి ఎద్దడి పరిష్కారానికి అనుసరిస్తున్న విధానం బాగుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అక్కడ భూగర్భంలో ఎక్కువ పరిమాణంలో నీటిని నిల్వ చేయగల ట్యాంకులు నిర్మించారు. వర్షం నీరంతా వాటిల్లో నిలువ ఉంటుంది. వేసవిలో నీటిఎద్దడి సమయాల్లో సదరు ట్యాంకుల్లోని నీటిని వినియోగిస్తారు. వర్షాలొచ్చేప్పుడు ఎక్కువ నీరు చేరకుండా ఎప్పటికప్పుడు తగిన మొత్తంలో నీటిని వినియోగిస్తారు. తద్వారా రెండు కాలాల్లోనూ ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని మన హైదరాబాద్‌లో అమలు చేసేందుకు అవకాశం ఉందని, జలగం వెంగళరావు పార్కు, కేసీపీ సమీపంలో ఇలాంటివి ఏర్పాటు చేయవచ్చని కమిషనర్ చెప్పారు. ఒంటరిగా ఉంటున్న వయోవృద్ధులు ఆపత్కాలంలో వినియోగించేందుకు రూపొందించిన ఉపకరణం కూడా బాగుందన్నారు. గుండీ మాదిరిగా ఉండే ఉపకరణాన్ని టచ్ చేస్తే చాలు.. ఆప్తులకు అలారం వినిపిస్తుందని, త్వరితంగా వారు చేరుకునేందుకు వీలుంటుందన్నారు. వచ్చే సదస్సు అర్జెంటీనాలో.. మూడేళ్లకోమారు జరుగనున్న మెట్రోపొలిస్ తదుపరి సదస్సును 2017లో అర్జెంటీనాలోని బ్యూనోస్‌ఎయిర్స్ నగరంలో జరిపేందుకు సదస్సు తీర్మానించింది. -
మీడియాకు దూరంగా మెట్రోపొలిస్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన మెట్రోపొలిస్ సదస్సుపై అన్ని వర్గాల్లో విస్తృత అవగాహన కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 50 దేశాల ప్రతినిధులు హాజరయిన ఈ అంతర్జాతీయ సదస్సుకు ఈనెల 6 నుంచి 9 వరకు మీడియా ప్రతినిధులను హైటెక్స్ భవనం వరకే పరిమితం చేయడం, సదస్సు జరుగుతున్న హెచ్ఐసీసీవేదిక దరిదాపుల్లోకి చేరనీయకపోవడంతో వారు పలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సదస్సుకు రావడంతో ఈ ఆంక్షలు తీవ్రమయ్యాయి. నాలుగురోజుల పాటు జరిగిన సదస్సులను హైటెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరలపై వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే పలు సదస్సులకు సంబంధించిన ప్రసారాలు స్పష్టంగా కనిపించక, వక్తల ప్రసంగాలు సరిగా వినిపించకపోవడంతో విదేశీప్రతినిధుల అభిప్రాయాలను, అనుభవాలను సైతం క్షుణ్ణంగా తెలుసుకోవడం కష్టసాధ్యమైందని పలువురు మీడియా ప్రతినిధులు ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరవాత తొలిసారిగా జరిగిన మెట్రోపొలిస్ సదస్సు గురించి నగరంలోని యువత, మహిళలు, మేధావులు, సాంకేతిక నిపుణులు, ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల ప్రతినిధులకు సరైన అవగాహన కల్పించడంలోనూ అధికారులు విఫలమయ్యారు. దీంతో పలువురు సదస్సులో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేయించుకోలేకపోయారు. విదేశాలకు చెందిన సుమారు 60 నగరాల మేయర్లు ఈ సదస్సులో పాల్గొంటారని తొలుత నిర్వాహకులు హడావుడిగా ప్రకటించినప్పటికీ అంతమంది మేయర్లు ఈ సదస్సులో పాల్గొనలేదని తెలిసింది. ఆయా నగరాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులే సదస్సులో పాల్గొన్నట్లు సమాచారం. ఇక కీలక అంశాలపై ప్రముఖులు తెలిపిన విలువైన సలహాలు, సూచనలను బహిర్గతం చేయడంలోనూ నిర్వాహకులు విఫలమయ్యారు. మొక్కుబడిగానే సదస్సుల వారీగా పత్రికాప్రకటనలు విడుదల చేసి అందులో అరకొర విషయాలను పేర్కొని మమ అనిపించడం గమనార్హం. -
ఈ శతాబ్ది నగరాలదే
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న సవాళ్లను కొత్త ఆలోచనా విధానాలతో ఎదుర్కొనేందుకు పాలనాయంత్రాంగం సిద్ధంకావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని అత్యధిక శాతం నగరాలు ఇందుకు సిద్ధంగా లేవన్నారు. పాలనా నిర్వహణను, స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రస్తుత డిమాండ్లను, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. హెచ్ఐసీసీలో జరుగుతున్న 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ ముగింపు కార్యక్రమానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్, హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్, సీఎస్ రాజీవ్‌శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న ప్రతినిధులను ఉద్దేశించి రాష్ర్టపతి ప్రసంగించారు. వాతావరణ మార్పులు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలు, కాలుష్యం వంటి సవాళ్లను అధిగమించడంతో పాటు మంచినీటి సరఫరా, ప్రజా రవాణా వ్యవస్థ, చెత్త సేకరణ, దాని నుంచి విద్యుత్ ఉత్పాదన, గ్రీన్ బిల్డింగ్‌ల నిర్మాణం వంటి సేవలను పౌరులకు అందుబాటులోకి తీసుకురావాలని మేయర్లకు సూచించారు. పట్టణాలకు వలస పెరుగుతున్నందున అందరికీ ఇళ్లు సమకూర్చేందుకు వీలుగా గృహ నిర్మాణ పథకాలను చేపట్టాలని, తద్వారా మురికివాడలను కూడా అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. శాటిలైట్ టౌన్ల నిర్మాణం తదితర అంశాల్లో ప్రైవేట్‌కు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. పట్టణీకరణ ప్రపంచాన్ని కుదిపేస్తున్నదని, 2050కల్లా 75 శాతం ప్రపంచ జనాభా పట్టణాల్లోనే కేంద్రీకృతం కానుందని ప్రణబ్ తెలిపారు. ఈ నే పథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని భారత్ సైతం గుర్తించిందన్నారు. రాష్ట్రాలకు కేంద్రం చేయూత.. 19వ శతాబ్దం రాచరికాలది కాగా, 20వ శతాబ్దం దేశాలదని, 21వ శతాబ్దం మాత్రం నగరాలదేనని రాష్ర్టపతి పేర్కొన్నారు. ‘నగరాలు అందరికీ’(సిటీస్ ఫర్ ఆల్) అనే అంశంపై ఈ అంతర్జాతీయ సదస్సులో జరిగిన మేధోమథనం సత్ఫలితాలనిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణ ప్రణాళిక, పరిపాలన వంటి అంశాల్లో లోతైన విశ్లేషణల ద్వారా అంతిమ లక్ష్యాలు నెరవేరాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 136 మెట్రో నగరాలకు చెందిన ప్రముఖులు, అందులో వందకుపైగా భారత నగరాలకు చెందిన వారు ఒకే వేదికపై భారత్‌లో సమావేశం కావడం సంతోషకరమన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 31 శాతం మంది భారతీయులు నగరాల్లో నివసిస్తున్నారని గుర్తు చేశారు. మౌలికసదుపాయాలు, కనీస సౌకర్యాల విషయంలో భారత్ సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. దేశంలో తొమ్మిది శాతం ప్రజలకు రక్షిత మంచినీటి సౌకర్యం లేదని, 12.6 శాతం ప్రజలకు మరుగుదొడ్లు లేవని పేర్కొన్నారు. శరవేగంగా సాగుతున్న పట్టణీకరణకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూతనివ్వడానికి కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించనుందని రాష్ట్రపతి తెలిపారు. దేశంలోని 500 నగరాల్లో ఈ పథకాన్ని చేపట్టనున్నట్లు, దీని అమల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని(పీపీపీ) ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. వంద స్మార్ట్‌సిటీల నిర్మాణానికి కేంద్రం చొరవ తీసుకుందన్నారు. మురికివాడలు మానవాళికి శాపం: సీఎం మానవాళికి మురికివాడలే శాపాలని, పట్టణ జీవనంలో ఇదే దుర్భరమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నగరాలను మురికివాడలరహితంగా మార్చాలని, అవి మళ్లీ తయారుకాకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం అవసరమన్నారు. ఇస్తాంబుల్ నగరంలోని కట్టడాలను పరిరక్షించినట్లే.. భాగ్యనగరంలోని చారి త్రక సంపదను పరిరక్షిస్తామని, పాతనగర అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో భూముల కొరత సమస్యను శాస్త్రీయంగా అధిగమించేం దుకు అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. స్మార్ట్‌సిటీలు అనేవి మానవీయ కోణంలో పర్యావరణహితంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలను సీఎస్ రాజీవ్‌శర్మ ప్రస్తావించారు. మెట్రోపొలిస్ కాంగ్రెస్ కో ప్రెసిడెంట్, జోహెన్నెస్‌బర్గ్ ఎగ్జిక్యూటివ్ మేయర్ పార్క్స్ టావ్ ప్రసంగిస్తూ.. హైదరాబాద్ అందించిన ఆతిథ్యానికి, స్నేహానికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
నగరాలకు బార్సిలోనా స్ఫూర్తి
సాక్షి, సిటీబ్యూరో: అభివృద్ధిలో బార్సిలోనా నగరాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం హెచ్ఐసీసీలో జరిగిన మెట్రోపొలిస్ సదస్సులో ‘ఫైనాన్సింగ్ టెరిటోరియల్ డెవలప్మెంట్’ అంశంపై జరిగిన చర్చలో పలువురు వక్తలు మాట్లాడారు. స్పెయిన్ దేశ స్థూల జాతీయోత్పత్తిలో బార్సిలోనా నగరం వాటా సుమారు 50 శాతం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, నూతన అవకాశాల సృష్టి, వనరుల వినియోగం, అన్ని రంగాల సమతుల్య అభివృద్ధితోనే ఈ నగరాభివృద్ధి సాధ్యపడిందని వారన్నారు. వర్ధమాన దే శాల్లోని పలు నగరాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు ఈ నగరాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరి సహకారంతోనే అభివృద్ధి.. అన్ని కీలక రంగాల్లో సంస్కరణలు చేపట్టడం, పన్నుల వసూలు పకడ్బందీగా ఉండడంతో తమ నగరం అభివృద్ధి చెందిందని బార్సిలోనా మెట్రోపాలిటన్ ఏరియా తొలి ఉపాధ్యక్షుడు ఆంటోనియో బాల్మన్ అన్నారు. అభివృద్ధిలో ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకోవడంతో సత్ఫలితాలు వచ్చినట్టు చెప్పారు. వరదలతో సతమతం.. జోహెన్స్‌బర్గ్ (దక్షిణాఫ్రికా) మేయోరల్ కమిటీ సభ్యుడు జెఫీమకుబో మాట్లాడుతూ.. తమ నగరం మంచినీటి ఎద్దడి, మైనింగ్ వల్ల తలెత్తే సమస్యలు, వరదలు, జనాభా పెరుగుదలతో సతమతమవుతుండడంతో ఆర్థికాభివృద్ధి మందగించిందన్నారు. దీంతో వాణిజ్య బ్యాంకులు, ప్రజల నుంచి నగరాభివృద్ధికి పెట్టుబడులు సమీకరించి ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. వసతుల కల్పనకు పెద్దపీట.. డచ్ డెవలప్మెంట్ పార్క్‌కు చెందిన ఫ్లెక్స్ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా నిర్మాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. నగరాభివృద్ధికి కేటాయించే నిధులు పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరముందన్నారు. నగదు ఆడిట్ ప్రతి విషయంలో తప్పనిసరిగా ఉండాలన్నారు. -
మెట్రో సదస్సుకు హాజరైన రాష్ట్రపతి
-
హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు
హైదరాబాద్ : రానున్న 20 ఏళ్లలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారమిక్కడ అన్నారు. అభివృద్ధి చెందిన అన్ని నగరాల టెక్నాలజీలను పర్యవేక్షిస్తున్నామని మెట్రోపొలిస్ సదస్సులో పాల్గొన్న ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ స్మార్ట్‌సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ తెలిపారు. పౌరులకు నాణ్యమైన సేవలు అందించేవే స్మార్ట్ సిటీలు అని, స్మార్ట్, సేఫ్ సిటీలు అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు అని, పన్నులు, ఆదాయం విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. డిజిటల్ హైదరాబాద్ కోసం కృషి చేస్తామని కేటీఆర్ తెలిపారు. -
యువసైన్యం
ఫిలిప్ వీస్.. ‘ది సినర్జిస్ట్’ కో ఫౌండర్.. ‘హైపర్ థింకింగ్’.. ఆథర్.. మెట్రోపొలిస్‌లో స్పీకర్.. బెల్జియం దేశస్తుడైనా ఈ దేశంతో.. ఈ సిటీతో జన్మబంధం ఉన్నవాడు.. మూడుముళ్ల అనుబంధం కలుపుకున్నవాడు.. ‘సిటీప్లస్’తో ఇలా మాటకలిపాడు... మా అమ్మ బ్రిటిషర్. నాన్న జర్మన్. నేను పెళ్లిచేసుకుంది మహారాష్ట్రియన్ అమ్మాయిని. పెళ్లయి పదిహేనేళ్లవుతోంది. కాని ఇండియాతో అంతకు ముందునుంచే అనుబంధం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌తో. మా తాత (అమ్మ వాళ్ల నాన్న) నిజాం దగ్గర ఉద్యోగస్తుడు. అమ్మ ఇక్కడే పుట్టింది. చాన్నాళ్ల కిందట హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఫలక్‌నుమా ప్యాలెస్ చూశాను. బ్యూటిఫుల్ ప్యాలెస్. మార్పు సులభం.. హైదరాబాద్ మార్పును ఆహ్వానిస్తుంది. నిత్యనూతనంగా ఉండడానికి ఉవ్విళ్లూరుతుంది. చేంజ్ కావడానికి రియల్ విల్లింగ్‌నెస్ కనిపిస్తుంటుంది. ఇక్కడి యూత్‌లో చాలా ఎనర్జీ ఉంది. అయితే గాంధీగారన్నట్టు.. సమాజాన్ని మార్చాలనుకునే ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి. నేను రాసిన హైపర్థింకింగ్ పుస్తకంలోనూ ఇదే ఉంటుంది. ఇండియా వైవిధ్యాల సమ్మేళనం. వీటన్నింటినీ కలిపితే అద్భుతమైన శక్తిగా మారుతుంది. కోరిక బలంగా ఉంటే మార్పు సులభమవుతుంది. ఇక్కడ అవకాశాలు ఎక్కువ. వాటిని అందుకుని కలలను సాకారం చేసుకునే యూత్ కూడా ఎక్కువే. మెట్రోపొలిస్ హాకథాన్‌లో పాల్గొన్న యువత అవగాహన, ఐడియాలు, ప్లానింగ్, ఆసక్తి చూస్తుంటే ముచ్చటేసింది. వాళ్లఆశావాదం అబ్బురపరిచింది. ఏ సమాజానికైనా కావల్సింది ఇలాంటి యువతే కదా. స్మార్ట్ అంటే .. స్మార్ట్ సిటీస్ అంటే కేవలం టెక్నాలజీ బేస్ కాదు..మనసులో ఉన్న ఆలోచనను పంచుకొని ఆచరణలో పెట్టడమే. అభివృద్ధికి సులువైన మార్గాలు అన్వేషించడమే. అలాంటి వాటికి ఇలాంటి గ్యాదరింగ్స్ చాలా ఉపయోగపడతాయి. సవాళ్లున్న చోటే పరిష్కారాలుంటాయి.వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియాలాంటి దేశానికి.. ముఖ్యంగా హైదరాబాద్‌లాంటి నగరంలో ఈ మెట్రోపొలిస్ మీట్ జరగడం ఎంతో హెల్ప్ అవుతుంది. -
పది అంశాలపై విస్తృత చర్చ
సాక్షి, హైదరాబాద్: మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్‌లో భాగంగా మంగళవారం తొమ్మిది అంశాలపై విడివిడిగా చర్చా కార్యక్రమాలు జరిగాయి. ఫైనాన్సింగ్ అర్బన్ ఇండియా, న్యూ సిటీస్/శాటిలైట్ సిటీస్, సిటీ మేనేజ్మెంట్/వేస్ట్ మేనేజ్మెంట్, గ్లోబల్ వాటర్ లీడర్షిప్, సస్టెయినబుల్ హైదరాబాద్, ఈ-అర్బన్ గవర్నెన్స్, సర్కిల్స్ ఆఫ్ సస్టెయినబిలిటీ, బిజినెస్ ఆఫ్ సిటీస్-ఎకానమీ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్, స్మార్ట్ సిటీస్ ఎజెండా అంశాలపై ఈ చర్చలు సాగాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం కూడా కీలకోపన్యాసం చేశారు. నేటి ఎజెండా ఉదయం 9 గంటలకు ‘డిఫైనింగ్ అర్బన్ ఎజెండా బిగ్ డేటా, బిగ్ చాలెంజెస్, బిగ్ ఐడియాస్’ అంశంపై చర్చ 11.30కి ‘అర్బన్ పూర్ అండ్ బ్యాలెన్స్ ఈక్విటీ, సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్’ అంశాలపై చర్చ మధ్యాహ్నం 2 గంటలకు మెట్రోపొలిస్ బోర్డ్ డెరైక్టర్స్ మీటింగ్, అర్బన్ మొబిలిటీ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ‘వాటర్ మేనేజ్మెంట్’పై చర్చ, మెట్రోపొలిస్ జనరల్ అసెంబ్లీ, ఇతర సమావేశాలు -
రెండో రోజూ మీడియాకు అనుమతి నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న మెట్రోపొలిస్ కార్యక్రమంలో మంగళవారం రెండోరోజూ సదస్సు వేదిక వద్దకు మీడియాను అనుమతించలేదు. సమీపంలోని హైటెక్స్ భవనంలోనే వారిని ఉంచి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు తిలకించే ఏర్పాట్లు చేశారు. కాని సదస్సులో ఒకే పర్యాయం మూడు, నాలుగు సమావేశాలు జరుగుతుండడంతో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్న టీవీల గోల ఎక్కువైంది. సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో టీవీల్లో సదస్సు దృశ్యాలు తప్ప, ఎవరేం మాట్లాడిందీ అర్థం కాలేదు. సాయంత్రం మీడియా సమావేశానికి హాజరైన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చారు. మీడియాకు ఎదురైన ఇబ్బందులు.. కవరేజీకి అనుమతించకపోవడం.. ఉదయం నుంచి పడిగాపులు గాసినా ప్రయోజనం లేకపోవడం.. వంటి సమస్యలపై మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. సాయంత్రం 5 గంటలకు విదేశీ మేయర్లతో ముఖాముఖి ఉంటుందని అధికారులు ప్రకటించినా, అనంతరం దాన్ని రద్దు చేశారు. సాయంత్రం 5 గంటలకు ఐటీ కారిడార్‌లో జరగాల్సిన (టీవీలో ప్రత్యక్షప్రసారం కావాల్సిన) మెట్రోపొలిస్ ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటన కూడా రద్దయింది. ప్రతినిధుల హాజరు.. అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సుకు దాదాపు రెండువేల మంది ప్రతినిధులు వస్తారని అధికారులు అంచనా వేయగా, మంగళవారం మధ్యాహ్నం వరకు 1309 మంది హాజరయ్యారు. వీరిలో విదేశీప్రతినిధులు 212 మంది కాగా, మిగతా వారు దేశంలోని వివిధ ప్రాంతాలు, మన రాష్ట్రానికి చెందినవారే. వీరిలో 60 మందికిపైగా మేయర్లున్నారు. రేపు, ఎల్లుండి కూడా ప్రతినిధులు రానున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. దాదాపు 400 మందికిపైగా విదేశీప్రతినిధులు సదస్సుకు హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేయించుకున్నారు. -
గ్రేటర్ అభివృద్ధికి ఇది దిక్సూచి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోన్న హైదరాబాద్ ప్రస్తుతం, భవిష్యత్‌లో పలు సమస్యలను అధిగమించి అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను‘సస్టైనబుల్ హైదరాబాద్ ప్రాజెక్టు పుస్తకం వివరించింది. ఈ పుస్తకాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హెచ్ఐసీసీలో మంగళవారం జరిగిన మెట్రోపోలిస్ సదస్సులో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో నగరం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు అన్వేషించాలో విశ్లేషించింది. ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాలు ప్రభుత్వానికి దిక్సూచిలా పనిచేస్తాయని రచరుుతలు శ్రీగిరి శ్రీనివాస్‌రెడ్డి, చాలిగంటి రఘు, రమేశ్ చెన్నమనేని తెలిపారు. ఈ పుస్తకంలో హైదరాబాద్ అభివృద్ధికి అంశాలవారీగా తీసుకోవాల్సిన చర్యలిలా ఉండాలని వారు పేర్కొన్నారు. వాతావరణ మార్పులు-నగర స్థానిక ప్రభుత్వం ఇటీవలి కాలంలో గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలు పెరగడంతో నగర వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో నగర వాసుల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. మంచినీరు, ఇంధన కొరత వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆహారం, మంచినీరు, ఇంధన కొరత, రవాణా సదుపాయాల కల్పన వంటి అంశాలపై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. నిపుణుల సలహాలు, సూచనలతో ఆయా అంశాల్లో పురోగతి సాధించేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలకు శ్రీకారం చుట్టాలి. వాతావరణ మార్పుల నేపథ్యంలో నగర ప్రణాళిక 2031 నాటికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా(హెచ్ఎండీఏ) పరిధిలో సంభవించే వాతావరణ మార్పులను తట్టుకునేలా నగర అభివృద్ధి ప్రణాళికలుండాలి. నగర జీవనం, ప్రజలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావాలను ముందుగానే అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో పురోగతి సాధించిన నగరాల అనుభవాలను పరిగణలోకి తీసకుంటే సత్ఫలితాలు సాధించవచ్చు. భవిష్యత్‌లో కాలుష్యానికి కారణమౌతోన్న గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను గణనీయంగా తగ్గించాల్సి ఉంది. మురికివాడలు లేని నగరంగా సిటీని తీర్చిదిద్దాలి. అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాలి. భారీ వర్షాలు కురిసినపుడు లోతట్టు ప్రాంతాలు నీటమునగకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉంది. నగరం నలుమూలల్లో వరదనీరు,మురుగునీటి పారుదల వ్యవస్థలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలి. ప్రజారవాణా గ్రేటర్లో లక్షలాది మంది వ్యక్తి గత వాహనాలు వినియోగించకుండా ఉండేందుకు ప్రజారవాణా వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిదాలి. బస్సు సర్వీసులు, రోడ్నెట్వర్క్ను పెంచడంతోపాటు ఎంఎంటీఎస్, మెట్రో రైలు ప్రాజెక్టుల విస్తరణ చేపట్టాలి. బస్సులు మాత్రమే తిరిగేందుకు వీలుగా ప్రత్యేక మార్గాలు(బీఆర్టీఎస్) ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ వ్యవస్థను ఆధునీకరించాలి. పలు కూడళ్లను విస్తరించాలి. ప్రమాదకర మలుపులున్న ప్రాంతాల్లో రహదారులను తక్షణం విస్తరించాలి. బస్టాపుల్లోనే బస్సులను విధిగా ఆపేలా చూడాలి. స్టాపులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. పాదచారులు నడిచి వెళ్లేందుకు వీలుగా ఫుట్‌పాత్‌లను విస్తరించాలి. సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి. ఇంధన భద్రత విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో భవిష్యత్‌లో సౌరశక్తిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరముంది. సమగ్ర సోలార్ పవర్ పాలసీని రూపొందించాలి. సోలార్ పవర్ ప్రాజెక్టులకు పరపతి సౌకర్యాలు పెంచాలి. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రభుత్వం తోడ్పాటునందించాలి. సౌర విద్యుత్ ప్లాంట్లకు స్థలం కేటాయింపు, పర్యావరణ అనుమతులు, గ్రిడ్ కనెక్టివిటీ వంటి అంశాల్లో సత్వరం అనుమతులు ఇవ్వాలి. పరిశ్రమలకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలి. ఫుట్‌పాత్ వ్యాపారుల కోసం.. ఫుట్‌పాత్ వ్యాపారుల ప్రయోజనాలను రక్షించేలా స్ట్రీట్ వెండర్స్ పాలసీని రూపొందించాలి. నగరంలో ఆహార భద్రత పెంచడం, ఉపాధి అవకాశాల విస్తరణ, పర్యాటక కేంద్రాల వద్ద చిరువ్యాపారాల విస్తరణ విషయంలో సమగ్ర విధానం అవసరం. పర్యావరణ విద్య నగర జీవనం కాలుష్యకాసారం కాకుండా ఉండేం దుకు అన్ని వర్గాల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. నగర వాసుల జీవనశైలి పర్యావరణ హననానికి కారణం కారాదు. పర్యావరణ అనుకూల దృక్పథం అలవరుచుకునేందుకు పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలుతోపాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలను, కాలనీ సంఘాలను పర్యావరణ పరిరక్షణ కృషిలో భాగస్వాములను చేయాలి. తాగునీరు, పారిశుద్ధ్య పనుల్లో ప్రజల భాగస్వామ్యం గ్రేటర్ నగరంలో అందరికీ స్వచ్ఛమైన తాగునీటి కల్పన జఠిలంగా మారింది. పేదలు నివసిస్తున్న బస్తీలకు మంచినీటి సరఫరా అరకొరగానే ఉంది. ఈవిషయంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. వాటర్‌పాలసీ రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలి. నీటినాణ్యత,స్వచ్ఛత పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్యం విషయంలోనూ ప్రజల భాగస్వామ్యం లేనిదే సత్ఫలితాలు సాధించలేము. రాజీవ్ ఆవాస్ యోజన వంటి పథకాలతో మురికివాడల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. -
కావాల్సింది సమ్మిళిత అభివృద్ధే
సాక్షి, హైదరాబాద్: నగరాలను కాంక్రీట్ జంగిల్స్‌గా మార్చొద్దని, సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. నగరాల్లో అందరికీ ఇళ్లు, శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటు, తగిన మురుగునీటి వ్యవస్థ, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరగడంతో ప్రపంచంలోని నగరాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో 11వ మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సును గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో గవర్నర్‌తోపాటు సీఎం కె.చంద్రశేఖర్‌రావు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, సీఎస్ రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ‘అందరికీ నగరాలు’ అనే ప్రధాన అంశంపై చర్చించడం ఎంతో ఉపయోగకరమని, మన నగరాలకు సమ్మిళితఅభివృద్ధి ఎంతో అవసరమని అన్నారు. హైదరాబాద్‌ను ఈ సదస్సుకు వేదికగా ఎన్నుకోవడం పట్ల మెట్రోపొలీస్ సంస్థను అభినందించారు. అభివృద్ధి చెందుతున్న నగరంగా అన్ని అభిప్రాయాలు, సూచనలు చర్చించేందుకు హైదరాబాద్ అనువైన వేదికగా నిలుస్తుందన్నారు. నాయకత్వం, ప్రణాళికలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణల విషయంలో ప్రైవేట్ కంపెనీల్లో ప్రభుత్వ సంస్థలు పనిచేసే అద్వితీయమైన అవకాశాన్ని మెట్రోపొలీస్ సదస్సు కల్పించిందన్నారు. ప్రస్తుత సదస్సు భవిష్యత్ నగరాల ప్రణాళికలో మహిళలు, యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సదస్సుకు హాజరైన వారు హైదరాబాద్‌కు ప్రత్యేకమైన ముత్యాలను తీసుకోవాలని ప్రతినిధులకు సూచించారు. గ్లోబల్ సిటీగా మార్చేందుకు సమగ్ర ప్రణాళిక: సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి గ్లోబల్ స్మార్ట్‌సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర బృహత్ ప్రణాళికను అభివృద్ధి చే స్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన క్లుప్తంగా.. మూడు నిముషాలు కూడా మించకుండా మాట్లాడారు. తెలంగాణలో ఈ సదస్సును నిర్వహించడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. తెలంగాణలోని మొత్తం జనాభాలో 40 శాతం పట్టణ జనాభానేనన్నారు. హైదరాబాద్ ప్రపంచస్థాయి ఆర్థిక పురోగతి ఉన్న నగరమని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన వనరులన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. చారిత్రక నగరమే కాకుండా సాంస్కృతిక భిన్నత్వానికి కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందన్నారు. భవిష్యత్ నగరాలకు కీలకం: జీన్‌పాల్ మెట్రోపొలీస్ సదస్సు అధ్యక్షుడు జీన్‌పాల్ ఫ్రెంచ్‌లో మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ కాంగ్రెస్‌ను నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ సదస్సు ప్రతినిధులకు మంచి ఆతిథ్యాన్ని అందించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో చర్చిస్తున్న అంశాలు భవిష్యత్ నగరాలకు ఎంతో అవసరమన్నారు. నగరాల్లో మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల పట్ల తగిన శ్రద్ధను తీసుకోవాల్సి ఉందన్నారు. సవాలును అవకాశంగా తీసుకుంటాం: వెంకయ్య శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణ సవాలే అయినప్పటికీ.. దీన్నే ఒక అవకాశంగాా మలుచుకొని సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వినియోగదారులకు నమ్మదగిన సేవలు, ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించే నగరాలు పెట్టుబడులను ఆకర్షిస్తాయన్నారు. ఇందుకు పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో సుస్థిరతను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి పరచాలని తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ప్రస్తుతం దేశంలోని పట్టణ జనాభా 31 శాతం మాత్రమే ఉన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 60 శాతం తోడ్పాటు అందిస్తోందని పేర్కొన్నారు. రానున్న 15 ఏళ్లలో దేశంలో పట్టణ జనాభా మరో 15.7 కోట్లకు పెరుగుతుందని, 2050 నాటికి ఇది 50 కోట్లకు చేరుతుందని చెప్పారు. వెంకయ్య తన ప్రసంగ ప్రారంభంలో వేదికపై ఉన్నవారి పేర్లను ప్రస్తావిస్తూ.. కేసీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేర్కొని ఆ వెంటనే సరిదిద్దుకున్నారు. ఆ వెంటనే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూద నాచారిని సైతం ఏపీ స్పీకర్‌గా పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు బంగారు భవిష్యత్తు ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా నగరంలో ఈ సదస్సు నిర్వహించడం గర్వకారణమని నగర మేయర్ మాజీద్ హుస్సేన్ పేర్కొన్నారు. కర్బన రహిత నగరమే నా స్వప్నం: అబ్దుల్ కలాం కర్బన రహిత నగరమే తన స్వప్నమని, విశ్వనగరమంటే తన దృష్టిలో కర్బన రహిత నగరమేనని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్పష్టం చేశారు. రానున్న 20 ఏళ్లలో స్వచ్ఛమైన పర్యావరణ నగరాలను నిర్మించడంపై అందరూ దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తే క్రమంగా ఇంధన వినియోగ ఖర్చులు తగ్గిపోయి ఉచిత విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. భవిష్యత్తు అంతా సౌర విద్యుత్ నగరాలదే నని అభిప్రాయపడ్డారు. మెట్రోపొలిస్ సదస్సులో భాగంగా ‘సిటీస్ ఫర్ ఆల్’ అనే అంశంపై నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో కలాం కీలకోపన్యాసం చేశారు. ఏ నగరమైనా ప్రజలు ఆరోగ్యకరంగా జీవించే విధంగా ఉండాలని సూచిం చారు. చండీగఢ్ నిర్మాణ తీరు తనను ఎంతో ఆకట్టుకుందని, ఆ నగరం నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. డీఆర్డీవో మాజీ డెరైక్టర్ వీకే సారస్వత్ మాట్లాడుతూ... స్మార్ట్ సిటీలంటే డిజిటల్ టెక్నాలజీ ఒక్కటే కాదన్నారు. ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల వినియోగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్ మేయర్ పార్క్స్ టావ్ మాట్లాడుతూ... తమ దేశ జనాభాలో 50 శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారన్నారు. హరిత భవనాలు, పరిశోధన కేంద్రాల స్థాపనతో పాటు మెరుగైన మౌలిక వసతులతోనే స్మార్ట్ సిటీలు సాధ్యమవుతాయన్నారు. -
‘స్మార్ట్’ భాగ్యం మనకూ ఉంది!
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ సిటీ... దేశ వ్యాప్తంగా ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్. హైదరాబాద్ నగరంలో మెట్రోపొలిస్ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైకి అందరి దృష్టీ మళ్లింది. ఈనేపథ్యంలో మన ‘గ్రేటర్’ స్మార్ట్‌సిటీగా మారే ‘భాగ్య’ం ఉందా అని పరిశీలిస్తే ..ఉందన్నదే సర్వత్రా వ్యక్తమౌతున్న అభిప్రాయం. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చెందిన పలు నగరాల అనుభవాల నుంచి పాఠాలు స్వీకరిస్తే ‘గ్రేటరూ’...‘స్మార్ట్’గా మారడం కష్టసాధ్యం కాదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సిటీ పూర్తిగా అధునాతన డిజిటల్ టెక్నాలజీ వినియోగం పైనే ఆధారపడి విజ్ఞానాధారిత నగరంగా ఎదుగుతుంది కాబట్టి ఇక్కడి పౌరులూ తమ నైపుణ్యాలనూ ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. భాగ్యనగరం ‘స్మార్’్టసిటీగా రూపుదిద్దుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక్కడి వనరులు, పౌరుల సహకారం, ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. భాగ్యనగర ప్రస్థానమిదీ... భాగ్యనగర నిర్మాణ సమయంలో కేవలం 5 లక్షల జనాభానే దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు అది 20 రెట్లు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనాభా సుమారు 90 లక్షలకు చేరువైంది. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ అంచనా ప్రకారం.. 2031 నాటికి ఇది 1.84 కోట్లకు చేరుకుంటుంది. వచ్చే 20 ఏళ్ల పాటు నిమిషానికి 30 మంది గ్రామీణులు ఉపాధి, ఉద్యోగం వంటి అనేక కారణాలతో నగరబాట పడతారని నిపుణుల అంచనా. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకూ చేరేకొద్దీ నగరాలకు గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయి. ఇలా వలస వచ్చే వారికి అనువుగా నగరాలు అభివృద్ధి చెందాలి. లేకుంటే ప్రస్తుతం ఉన్నవి త్వరలోనే నివాసయోగ్యం కాకుండా పోతాయి. ఐరోపాలో మాదిరిగా హైదరాబాద్‌లో ఓ క్రమపద్ధతిలో పట్టణీకరణ జరగలేదు. మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు వృద్ధి చెందలేదు. ప్రధాని మోదీ కల దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలనేది ప్రధాని మోదీ లక్ష్యం. ఇందుకోసం రూ.7,060 కోట్లను ఖర్చు చేయనున్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మాణ విస్తీర్ణాన్ని 50 వేల చ.మీ. నుంచి 20 వేల చ.మీ.కు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 10 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్లకు తగ్గించారు. వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు 3 ఏళ్ల కాల పరిమితిని నిర్దేశించారు. పలు స్మార్ట్‌సిటీల విజయ గాథలివీ.. ఆమ్స్టర్ డ్యామ్: నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డ్యామ్ స్మార్ట్ సిటీ ‘మొబైల్ అప్లికేషన్స్’ ద్వారా తమ రహదారులపై రవాణా రద్దీ గుర్తించి ముందస్తు సమాచారాన్ని పౌరులకు అందిస్తుంది. దీనికి జీపీఎస్‌ను ఉపయోగించుకుంటుంది. ఫలానా కూడలిలో ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉందని పసిగట్టి, ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది. దీని వల్ల పౌరులకు సమయం, ఇంధనం ఆదా అవుతాయి. అత్యవసర సేవలు సకాలంలో అందుకొనే వీలు కలుగుతుంది. దీనికి భిన్నంగా మన నగరాల్లో అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుంటాయి. వియన్నా: ఆస్ట్రియా రాజధాని వియన్నా పలు ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రపంచ టాప్ 10 స్మార్ట్ సిటీ జాబితాలో చేరింది. ఇన్నోవేషన్ సిటీలో 5వ స్థానం, రీజనల్ గ్రీన్ సిటీలో 4వ స్థానం, క్వాలిటీ ఆఫై లైఫ్‌లో ప్రథమ స్థానం, డిజిటల్ గవర్నెన్స్‌లో 8వ స్థానం సంపాదించింది. ఇక్కడి ప్రభుత్వ పథకాల విషయానికొస్తే.. స్మార్ట్ ఎనర్జీ విజన్-2050, రోడ్‌మ్యాప్ 2020, యాక్షన్ ప్లాన్ 2012-15 వంటి ప్రభుత్వ కార్యక్రమాలు వియన్నా స్మార్ట్ సిటీగా పురోగతి చెందడంలో దోహదపడ్డాయి. టొరంటో: కెనడాలోని ఒంటారియా రాజధాని టొరంటో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోవడంలో ఆధునిక టెక్నాలజీ వినియోగమే ప్రధాన కారణం. నవీకరణ, వ్యవస్థాపక సామర్థ్యాలకు ప్రోత్సాహం, ఆర్థిక కార్యకలాపాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనుసంధానం, తీరైన శాంతిభద్రతలు, న్యాయపాలన, డీమ్యాట్ రూపంలో భూములు, భవనాలు, దస్తావేజులను భద్రపరచడం వంటివన్నీ టెక్నాలజీతో అనుసంధానం చేశారు. దీనివల్ల లావాదేవీలకయ్యే ఖర్చులు తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. నేడు చర్చలో పాల్గొనే ప్రముఖులు వీరే... ఐదు రోజుల అంతర్జాతీయ 11వ మెట్రోపొలిస్ సదస్సులో భాగంగా మంగళవారం ‘థింక్ గ్లోబల్ అండ్ యాక్ట్ లోకల్’ అనే థీమ్ ఆధారంగా ‘స్మార్ట్‌సిటీస్’ అంశంపై పలుదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు చర్చించనున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. సదస్సులో పాల్గొనే ప్రతినిధులు వీరే.. ఉడ్రోవిల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ గ్లోబల్ ఫెల్లో, అర్బన్ ఏజ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ టిమ్ క్యాంబెల్ ఎంఐటీ సెన్సబుల్ సిటీ లాబొరేటరీ, మసాచూసెట్స్ డెరైక్టర్ ప్రొ॥ కార్లో రట్టీ పబ్లిక్ సెక్టార్ సొల్యూషన్స్ డెరైక్టర్, ఓరాకిల్, నెథర్లాండ్స్ లెమ్కీ ఇడ్సింగ్ బ్రసెల్స్ ఫిలిప్ప్ విస్సీ ఏసియన్ పసిఫిక్ అండ్ మిడిల్ ఈస్ట్ మేనేజర్ అల్బెర్టో మార్టిన్ టొర్రస్ సోయెల్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్ జూన్హో కో అర్బన్ గవర్నెన్స్ ప్రొగ్రామ్, అస్కి డెరైక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ చారీ వెడల కర్నాటక మాజీ చీఫ్ సెక్రటరీ, సెంటర్ ఫర్ సస్టెనబుల్ డెవలప్మెంట్ చైర్మన్ డాక్టర్ ఎ. రవీంద్ర ఇలా ఉంటేనే ‘స్మార్ట్’ అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, ప్రజా జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవడం స్మార్ట్‌సిటీలకు చోదకాలుగా చెప్పుకోవచ్చు. పరిపాలన, విద్యుత్, భవనాలు, రవాణా, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఆరోగ్య సేవలు ఆధునిక సాంకేతిక సాయంతో పనిచేసే నగరం ఈ కోవలోకి వస్తుంది. ట్రాఫిక్ లైట్లు మొదలుకొని భవంతులు వరకూ అన్నీ కంప్యూటర్ నెట్వర్క్ లేదా వైఫైతో అనుసంధానమై ఉంటాయి. వైర్లెస్ సెన్సర్లు ఎప్పటికప్పుడు వాతావరణ, ఇతర పరిస్థితులను గమనిస్తూ ప్రజ లకు, అధికారులకు సమాచారమిస్తాయి. నీటి పైపుల్లో లీకేజీలున్నా, చెత్త కుండి నిండినా కార్పొరేషన్ అధికారులకు సమాచారం వస్తుంది. ట్రాఫిక్ జామ్‌ల గురించి ప్రజలకు తక్షణ సమాచారం వస్తుంది. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ పరిస్థితులను బట్టి ట్రాఫిక్ లైట్ల వెలుతురులో హెచ్చు తగ్గులుంటాయి. వాన నీటిని ఒడిసి పట్టి నగరాల్లో పచ్చదనం పెంపునకు వినియోగించుకోవాలి. పనిచేసే చోటుకు దగ్గరగానే నివాస సముదాయాలు ఉండేలా చూస్తారు. మెట్రో, మోనో రైలు వంటి అధునాతన రవాణా వ్యవస్థలు సమకూరుతాయి అవసరాన్ని బట్టి స్మార్ట్‌గా పనిచేసే విద్యుత్ గ్రిడ్, పౌర సేవల కోసం ప్రత్యేకమైన టెక్ ఆధారిత ప్రాజెక్ట్లును ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ రోడ్లు, భారీ మైదానాలు, భూగర్భ జలాలు పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు. అగ్ని ప్రమాదాలు, వాతావరణాన్ని గుర్తించే సెన్సర్లు, ఆటోమేటిక్ విద్యుత్ వ్యవస్థలతో పాటు ఆధునిక రక్షణ ఏర్పాట్లు కల్పిస్తారు. -
మీడియాకు తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి సదస్సును హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు అట్టహాసంగా ప్రకటించినా ప్రింట్ మీడియా ప్రతినిధులకు మాత్రం సోమవారం తిప్పలు తప్పలేదు. మెట్రోపొలిస్ సదస్సు కవరేజీ కోసం వెళ్లిన విలేకరులను సదస్సు ప్రధాన వేదిక అయిన హేచ్ఐసీసీ వేదిక వద్దకూ అనుమతించలేదు. తర్వాత టీవీ చానెళ్లకు మాత్రం ఫీడ్‌ను ఇచ్చారు. అప్పుడు, ఇప్పుడు ప్రెస్ బ్రీఫింగ్ అంటూ చివరికి మూడుగంటలకు ఏర్పాటుచేశారు. ఈ విషయమై సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్‌ను విలేకరులు ప్రశ్నించగా.. భద్రతా కారణాల దృష్ట్యా మీడియాను అనుమతించలేదన్నారు. -
మార్గ నిర్దేశకులు యువతే
సాక్షి, హైదరాబాద్: మహానగరాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు ఉద్దేశించిన మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సు సోమవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సును మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలిరోజు ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ స్థలాలు, రోడ్లపై మహిళలు, పిల్లలు, వృద్ధులకు రక్షణ, విపత్తుల సమయంలో చేపట్టాల్సిన చర్యలు, శానిటేషన్-వేస్ట్ మేనేజ్మెంట్, మురికివాడల్లో ఆరోగ్య సేవలు, ఇళ్లకు నంబర్లు వంటి అంశాలపై విడివిడిగా చర్చ ప్రారంభమైంది. భవిష్యత్తులో యువత ఆలోచనలే నగరాల రూపురేఖలను మారుస్తాయని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. యువత సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. సోమవారం దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన 782 మంది ప్రతినిధులతోపాటు విదేశాలకు చెందిన 140 మంది ప్రతినిధులు హజరయ్యారు. 10వ తేదీ వరకు సాగనున్న ఈ సదస్సులో మంగళవారం 400 మందికి పైగా విదేశీ ప్రతినిధులతో సహా 2 వేలమందికి పైగా హాజరు కాగలరని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం కార్యక్రమంలో గవర్నర్, సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మేయర్ మాజిద్, మెట్రోపొలిస్ అధ్యక్షుడు జీన్‌పాల్ పాల్గొననున్నారు. గళమెత్తిన బాలలు.. తొలిరోజు ‘వాయిస్ ఆఫ్ చిల్డ్రన్’ అంశంపై ప్రసంగించిన బాలలు నగరాల్లోని మురికివాడల దుర్భర పరిస్థితులపై ధారాళంగా ప్రసంగించారు. తమకు ఇళ్లు, తాగునీరు, మరుగుదొడ్లువంటి సదుపాయాలు లేకపోవడాన్ని ప్రశ్నించారు. పారిశుధ్య నిర్వహణ, ఆటస్థలాలు లేకపోవడం, రోడ్లపై ప్రాణాంతకంగా వేలాడే విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల పరిసరాల్లో రక్షణ చర్యలు లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. మురికివాడల్లోకి అంబులెన్స్‌లు త్వరితంగా వెళ్లేందుకు వీల్లేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు రూపొందించేటప్పుడు బాలల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. బాలల అభిప్రాయాలతో ఆయా ప్రభుత్వాలు తగిన పాలసీలు రూపొం దించే అవకాశముందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ సెషన్లో పాల్గొన్న బాలల్లో హైదరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్, ముంబైకి చెందిన కాజల్ ఖురానా, ఢిల్లీకి చెందిన మాలతీయాదవ్ ఉన్నారు. ఇళ్ల ధరలు అందుబాటులో ఉండాలి.. దేశంలో అందరికీ ఇళ్లు సమకూరాలంటే అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు తమ సలహాలిచ్చారు. ముఖ్యంగా ఇళ్ల ధరలు ప్రజలు భరించగలిగే ధరల్లో ఉండాలని. అందుకు ప్రైవేట్ రంగం కూడా తమ వంతు సహకారం ఇవ్వాలని సూచించారు. హౌసింగ్ పాలసీలు-అమలుకు మధ్య వ్యత్యాసం ఉంటోందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించనున్న ఇళ్ల ప్రస్తావన కూడా వచ్చింది. తొలిరోజు పలు అంశాలపై జరిగిన చర్చల వివరాలను ఆయారంగాలకు చెందిన విదేశీ ప్రముఖులు మీడియాకు వివరాలు తెలియజేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సీనియర్ డెరైక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ వారిని మీడియాకు పరిచయం చేశారు. హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తు హైదరాబాద్ హాకథాన్ పేరిట ఒక పోటీని నిర్వహిస్తున్నాం. నగరంలోని సమస్యల పరిష్కారానికి 20 బృందాలు చేసిన ప్రతిపాదనలను పరిశీలించాం. ఈ పోటీలో చివరకు 5 బృందాలను ఎంపికచేస్తాం. నగరాలనేవి ఫైబర్ ఆప్టిక్ట్లకే పరిమితం కావొద్దు. ప్రజలు, ప్రభుత్వం, పౌరసమాజం కలిసి ప్రణాళికలు రూపొందించుకోవాలి. హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉంది. - ఆల్ఫెన్స్ గోవెల (నెక్స్ ్టస్మార్డ్ సిటీస్ వ్యవస్థాపకులు, మెక్సికో) యువత నడిపిస్తుంది భవిష్యత్ నగరాలు కాంట్రీబ్యూటరీ నగరాలుగా ఉండాలి. యువజనులు తప్పకుండా మార్పు తీసుకురాగలరు. యువత ఆలోచనా ధోరణులకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. నగరాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలకు యువత పరిష్కారాలను కనుక్కుంటుంది. - అలెన్ ర్యాంక్ (సిటీ ప్లానర్, ఫ్రాన్స్) వారి ఆలోచనలను పట్టుకుంటే అద్భుతాలే నేటి యువత అద్భుతమైన ఆలోచనలను ఆవిష్కరిస్తోంది. ఈ ఆలోచనలను ఒడిసిపట్టగలిగితే ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. హైదరాబాద్‌లో మార్పు స్పష్టంగా గోచరిస్తోంది. డిజిటల్ ప్రాజెక్ట్స్ ముఖ్య భూమిక నిర్వహిస్తాయి. - ఫిలిప్ వీస్ట్ (డిజిటల్ ప్రాజెక్ట్స్, బ్రిటన్) మంచి ప్రతిపాదనలు వచ్చాయి హైదరాబాద్ అర్బన్ హాకథాన్ పేరిట నగరంలోని సమస్యలకు 18-35 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న యువత ద్వారా పరిష్కారాలను ఆహ్వానించాం. మైక్రోసాఫ్ట్, ఐఐఐటీ-హైదరాబాద్ 20 బృందాలను ఎంపిక చేసింది. వీటి నుంచి 5 బృందాలను ఎన్నుకుని ఆయా సమస్యలపై ప్రాజెక్టులను చేపట్టాలి. పలు అంశాలపై మంచి ప్రతిపాదలు వచ్చాయి. - సుబ్రహ్మణ్య శర్మ (ఐఎస్బీ సీనియర్ డెరైక్టర్) మెట్రోపొలిస్‌లో నేడు చర్చించనున్న ముఖ్యాంశాలు గ్లోబల్ వాటర్ లీడర్షిప్ న్యూ సిటీస్/ విజనరీ ఆర్ కానండ్రమ్ సస్టెయినబుల్ హైదరాబాద్ రిపోర్ట్ సిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్- వేస్ట్ మేనేజ్మెంట్ ఫైనాన్సింగ్ అర్బన్ ఇండియా బిజినెస్ ఆఫ్ సిటీస్ ఎకానమీ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్ సర్కిల్స్ ఆఫ్ సస్టెయినబిలిటీ ఈ-అర్బన్ గవర్నెన్స్ స్మార్ట్‌సిటీస్ అజెండా- థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్ సాయంత్రం 5 గంటలకు హైటెక్‌సిటీ వద్ద స్మార్ట్‌సిటీ అంశంపై -
రేర్ ఇవెంట్
-
మెట్రపొలిస్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చేనెల 9వ తేదీన హైదరాబాద్ రానున్నారు. నగరంలో వచ్చేనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగునున్న ప్రపంచ మేయర్ల సదస్సు (మెట్రో పొలీస్) ముగింపు సమావేశంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. వచ్చేనెల 9వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో హైటెక్స్‌లో జరిగే మెట్రో పొలీస్ ముగింపు సదస్సు ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడి కార్యక్రమాల్లో గంటసేపు పాల్గొన్న అనంతరం, అదేరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు. మెట్రో పొలీస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని కూడా కేసీఆర్ కోరడం విదితమే. ఆయన పాల్గొనడంపై ప్రభుత్వానికింకా సమాచారం లేదు. పలు రాష్ట్రాల మహిళా సీఎంలు, లోక్‌సభ స్పీకర్ తదితరులు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడంపైనా ఇంకా సమాచారం లేదు. -
ఆధ్యాత్మిక శోభ
జంట పండుగలతో అలరారనున్న మహానగరం ఓవైపు బోనాలు, మరోవైపు పవిత్ర రంజాన్ ప్రార్థనలు నేడు గోల్కొండ కోటలో బోనాలు మతసామరస్యం వెల్లివిరిసేలా నెలరోజుల పండుగలు సాక్షి, సిటీబ్యూరో: జంట పండుగల వేళ మహానగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మతసామరస్యం వెల్లివిరిసేలా అన్ని వర్గాల వారు భక్తిపూర్వకంగా జరుపుకొనే పండుగలివి. భిన్న సంస్కృతుల మధ్య ఐక్యతకు చాటే సమయమిది. ఓ వైపు ఆనందం ఉట్టిపడేలా జరుపుకొనే ఆషాఢం బోనాల జాతర.. మరోవైపు ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే పవిత్ర రంజాన్ ప్రార్థనలు ఒకేసారి రావడంతో నగరం ప్రత్యేకంగా ముస్తాబైంది. ఆషాఢంలో అమ్మవారి బోనాలు, పోతరాజుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఆషాఢ మాసం ప్రవేశించడంతో ఆదివారం భక్తజనసందోహం నడుమ గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వందల ఏళ్లుగా భక్తుల ఆరాధ్యదైవంగా, కొంగుబంగారంగా వెలుగొందుతోన్న జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఓ వైపు బోనమెత్తుకొని బారులు తీరే మహిళలు, మరోవైపు గుగ్గిలం, మైసాక్షిల పరిమళాలు, పోతరాజుల విన్యాసాలు అమ్మవారిని వేనోల్లా కీర్తిస్తూ ఆలపించే పాటలతో నగరం పులకించిపోనుంది. గోల్కొండలో ప్రారంభమయ్యే జాతర వరుసగా పాతబస్తీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, ఆ తరువాత నగరంలోని అన్ని ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలతో నెల పాటు కొనసాగుతుంది. మరోవైపు రంజాన్ ప్రార్థనలు.. మరోవైపు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం కూడా ప్రారంభమవుతుంది. ఇది కూడా నెల పాటు కొనసాగనుంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లాను ఆరాధిస్తూ, ఉపవాసాలతో మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మిక వాతావరణమే నెలకొంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిల్లిపాది కఠోరమైన ఉపవాసదీక్షలు పాటిస్తారు. అన్ని వర్గాలతో కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటారు. పేద ముస్లింలను ఆదుకునేందుకు అందజేసే ఆర్థిక సహాయం రంజాన్ మాసంలోని గొప్పతనాన్ని ఆవిష్కరించనుంది. వరుస పండుగలు... ఆషాఢం తరువాత శ్రావణంలోనూ వరుగా పండుగలే వస్తున్నాయి. శ్రావణమాసం కూడా పవిత్రమైంది. ఆ నెలంతా భక్తులు, మహిళలు పూజలు, వ్రతాలు, నోములతో గడిపేస్తారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలతో నగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడనుంది. ఈ వరుస పండుగలు మానసిక ప్రశాంతతను, ఆహ్లాదాన్ని, ప్రేమ, ఆప్యాయతలను పంచుతాయి. ఆధ్యాత్మిక భావాలను కలిగించడంతోపాటు, మానవ సంబంధాల్లోని మహోన్నతమైన విలువలను ఆవిష్కరిస్తాయి. -
ఎన్నాళ్లీ కన్నీళ్లు
పేరుకే మహానగరం.. దాహార్తిని తీర్చే దారే గగనం.. ఇదీ శివారు గ్రామాల ప్రజల దైన్యం. పానీ పరేషానే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎజెండాగా నిలవనుంది. ఎన్నాళ్లీ కన్నీళ్లని శివారు జనం ప్రధాన పార్టీలను నిలదీయనున్నారు. మంచినీళ్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన తరవాతేఓట్లు అడగాలని రాజకీయ పార్టీలకు స్పష్టం చేయనున్నారు. శివార్లలో తొమ్మిది శాసనసభ, మూడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో బరిలోకి దిగనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులను పానీపరేషాన్పైనే జనం ప్రధానంగా ప్రశ్నించనున్నారు. ఆయా రాజకీయ పక్షాలు కూడా నియోజకవర్గాల వారీగా విడుదల చేయనున్న స్థానిక మేనిఫెస్టోల్లో మంచినీటి సమస్య పరిష్కరిస్తామని స్పష్టంగా పేర్కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘గ్రేటర్’లో నీటికి కటకట మహానగరంలో మొత్తం భవనాలు సుమారు 25 లక్షలు. కుళాయిలున్న నివాస సముదాయాలు కేవలం 8 లక్షలే. ఈ వివరాలు చాలు.. గ్రేటర్లో మంచినీటి సరఫరా దుస్థితి ఎలా ఉందో తేటతెల్లం చేయడానికి. శివార్లలోని 11 మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో మొత్తంగా 900 కాలనీలు, బస్తీలకు జలమండలి మంచినీటి పైప్‌లైన్ నెట్వర్క్ లేదు. ఫలితంగా నిత్యం 35 లక్షలమంది గొంతెండుతోంది. సుమారు 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ పరిధిలో 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మంచినీటి సరఫరా నెట్వర్క్ లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో జనం ఫల్టర్ప్లాంట్లు, బోరుబావులను ఆశ్రయించి బావురుమంటున్నారు. నెలకు మంచినీటి కోసమే ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే నీటి కటకట ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది. అంతేకాదు ఒకవైపు నగర శివార్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కానీ మంచినీటి పైప్‌లైన్ నెట్వర్క్, స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించడంలోనూ సర్కారు విఫలమౌతోంది. కుంటినడకన సాగుతున్న గోదావరి, కృష్ణా మూడోదశ ప్రాజెక్టులు, స్టోరేజి రిజర్వాయర్ల లేమి... వెరసి మహానగర సిటీజనులకు కన్నీటి కష్టాలే మిగులుతున్నాయి. శివారు మంచినీటి పథకాలను పూర్తిచేసేందుకు రూ.3195 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సిద్ధం చేసిన ప్రణాళికలు ఐదేళ్లుగా కాగితాల్లోనే మగ్గుతున్నాయి. నీళ్లఖర్చు తడిసి మోపెడు గ్రేటర్ పరిధిలో సుమారు 900 కాలనీలు, బస్తీలు నిత్యం దాహార్తితో అల్లాడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో జలమండలి సరఫరా చేస్తున్న 300 మిలియన్ గ్యాలన్ల మంచినీటిలో 40 శాతం మేర సరఫరా నష్టాలే ఉన్నాయి. రోజువారీ సరఫరా 180 మిలియన్ గ్యాలన్లకు మించడం లేదు. ఇక శివారు ప్రాంతాల్లో జలమండలి సరఫరా నెట్వర్క్ లే కపోవడం, భూగర్భజలాలు తరిగిపోవడంతో ఫిల్టర్ ప్లాంట్లు, ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతి ఇంటికి నెలకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు నీటిపైనే ఖర్చు పెట్టాల్సిన దుస్థితి తలెత్తింది. దీంతో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలకు పానీపరేషాన్ తప్పడం లేదు. స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, మంచినీటి పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తరించనిపక్షంలో కృష్ణా మూడోదశ, గోదా