
మూడు కంపెనీల ఐపీఓలకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఇన్వెన్షియా హెల్త్‌కేర్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, ఎక్సెల్ప్ మ్యాక్ డిజైన్ అండ్ టెక్నాలజీ కంపెనీల ఐపీఓలకు సెబీ పచ్చజెండా ఊపింది. దీంతో ఈ ఏడాది సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య 73కు పెరిగింది.
ఇన్వెన్షియా ఐపీఓ రూ.450 కోట్లు
ఐపీఓలో భాగంగా ఇన్వెన్షియా హెల్త్‌కేర్ కంపెనీ రూ.125 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ప్రమోటర్లు, ఇతర వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) ద్వారా 31.64 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వాణిజ్య కార్యకలా పాలకు వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచి స్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్‌గా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, సెంట్రమ్ క్యాపిటల్‌లు వ్యవహరిస్తున్నాయి.
మెట్రోపొలిస్ ఐపీఓ
మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ ఐపీఓలో భాగంగా 1.52 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తారు. ఈ షేర్లలో సుశీల్ కనుభాయ్ షా 50 లక్షల షేర్లను, సీఏ లోటస్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ కోటి షేర్లను విక్రయిస్తాయి. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా జేఎమ్ ఫైనాన్షియల్, క్రెడిట్ సూసీ సెక్యూరిటీస్ ఉన్నాయి. ఎక్సెల్ప్‌మ్యాక్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.23 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఐపీఓ నిధులతో హైదరాబాద్, కోల్‌కతాల్లోని డెవలప్‌మెంట్ సెంటర్లకు కావలసిన ఐటీ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ పరికరాలను కొనుగోలు కోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించనున్నది.
Comments
Please login to add a commentAdd a comment