
ఎన్నాళ్లీ కన్నీళ్లు
పేరుకే మహానగరం.. దాహార్తిని తీర్చే దారే గగనం.. ఇదీ శివారు గ్రామాల ప్రజల దైన్యం. పానీ పరేషానే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎజెండాగా నిలవనుంది. ఎన్నాళ్లీ కన్నీళ్లని శివారు జనం ప్రధాన పార్టీలను నిలదీయనున్నారు. మంచినీళ్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన తరవాతేఓట్లు అడగాలని రాజకీయ పార్టీలకు స్పష్టం చేయనున్నారు.
శివార్లలో తొమ్మిది శాసనసభ, మూడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో బరిలోకి దిగనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులను పానీపరేషాన్‌పైనే జనం ప్రధానంగా ప్రశ్నించనున్నారు. ఆయా రాజకీయ పక్షాలు కూడా నియోజకవర్గాల వారీగా విడుదల చేయనున్న స్థానిక మేనిఫెస్టోల్లో మంచినీటి సమస్య పరిష్కరిస్తామని స్పష్టంగా పేర్కొనాల్సిన పరిస్థితి తలెత్తింది.
‘గ్రేటర్’లో నీటికి కటకట
మహానగరంలో మొత్తం భవనాలు సుమారు 25 లక్షలు. కుళాయిలున్న నివాస సముదాయాలు కేవలం 8 లక్షలే. ఈ వివరాలు చాలు.. గ్రేటర్‌లో మంచినీటి సరఫరా దుస్థితి ఎలా ఉందో తేటతెల్లం చేయడానికి. శివార్లలోని 11 మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో మొత్తంగా 900 కాలనీలు, బస్తీలకు జలమండలి మంచినీటి పైప్‌లైన్ నెట్‌వర్క్ లేదు.
ఫలితంగా నిత్యం 35 లక్షలమంది గొంతెండుతోంది. సుమారు 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ పరిధిలో 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మంచినీటి సరఫరా నెట్‌వర్క్ లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో జనం ఫల్టర్‌ప్లాంట్లు, బోరుబావులను ఆశ్రయించి బావురుమంటున్నారు. నెలకు మంచినీటి కోసమే ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే నీటి కటకట ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది. అంతేకాదు ఒకవైపు నగర శివార్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కానీ మంచినీటి పైప్‌లైన్ నెట్‌వర్క్, స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించడంలోనూ సర్కారు విఫలమౌతోంది.
కుంటినడకన సాగుతున్న గోదావరి, కృష్ణా మూడోదశ ప్రాజెక్టులు, స్టోరేజి రిజర్వాయర్ల లేమి... వెరసి మహానగర సిటీజనులకు కన్నీటి కష్టాలే మిగులుతున్నాయి. శివారు మంచినీటి పథకాలను పూర్తిచేసేందుకు రూ.3195 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సిద్ధం చేసిన ప్రణాళికలు ఐదేళ్లుగా కాగితాల్లోనే మగ్గుతున్నాయి.
నీళ్లఖర్చు తడిసి మోపెడు
గ్రేటర్ పరిధిలో సుమారు 900 కాలనీలు, బస్తీలు నిత్యం దాహార్తితో అల్లాడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో జలమండలి సరఫరా చేస్తున్న 300 మిలియన్ గ్యాలన్ల మంచినీటిలో 40 శాతం మేర సరఫరా నష్టాలే ఉన్నాయి. రోజువారీ సరఫరా 180 మిలియన్ గ్యాలన్లకు మించడం లేదు. ఇక శివారు ప్రాంతాల్లో జలమండలి సరఫరా నెట్‌వర్క్ లే కపోవడం, భూగర్భజలాలు తరిగిపోవడంతో ఫిల్టర్ ప్లాంట్లు, ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
ప్రతి ఇంటికి నెలకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు నీటిపైనే ఖర్చు పెట్టాల్సిన దుస్థితి తలెత్తింది. దీంతో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలకు పానీపరేషాన్ తప్పడం లేదు. స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, మంచినీటి పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తరించనిపక్షంలో కృష్ణా మూడోదశ, గోదా