ట్రాఫిక్ రూల్స్‌పై హిజ్రాల అవగాహన..
చెన్నై: ట్రాఫిక్ నియమాలను పాటించి తిరువళ్లూరును ప్రమాద రహిత జిల్లాగా మార్చడానికి సహకరించాలని హిజ్రాలు వాహనచోదకులకు సూచించారు. తిరువళ్లూరు ఎస్పీ శిబిచక్రవర్తి ఆదేశాల మేరకు హిజ్రాలు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఇందులో ఎస్పీ శిబిచక్రవర్తి, అదనపు ఎస్పీ స్టాలిన్ హజరుకాగా, దాదాపు 30 మంది హిజ్రాలు అవగాహన కల్పించారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం చేయకూడదని హిజ్రాలు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హిజ్రాలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసులు, హిజ్రాల సంఘం నేతలు పాల్గొన్నారు.