ట్రాన్స్‌జెండర్ల సంక్షేమాన్ని సాంఘిక న్యాయం, సాధికారత శాఖకు అప్పగిస్తూ కేంద్రం నిబంధనలు మార్చింది.
న్యూఢిల్లీ: ట్రాన్స్‌జెండర్ల సంక్షేమాన్ని సాంఘిక న్యాయం, సాధికారత శాఖకు అప్పగిస్తూ కేంద్రం నిబంధనలు మార్చింది. వీరిపై సామాజిక వేధింపులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
దీంతో వీరి కోసం కొత్త జాతీయ పాలసీని మంత్రిత్వ శాఖ రూపొందించనుంది. ‘ట్రాన్స్‌జెండర్ల హక్కుల బిల్లు-2015’ ప్రకారం.. వీరిని ఇతరులు అని కాకుండా ట్రాన్స్‌జెండర్లు అనే పిలవాలి.