
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ సైన్యంలో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం విధిస్తూ చేసిన తీర్మానంపై సంతకం చేశారు. అయితే, ఇతర సాయుధ బలగాల్లో వారిని ఉపయోగించుకునేందుకు కొంత విస్తృత భావనతో ఆలోచించాలని చెప్పారు. అమెరికా సైన్యంలో ఇప్పటి వరకు స్వలింగ సంపర్కులు సైతం తమ సేవలు అందించారు. అయితే, వారితో పలుమార్లు సమస్యలు వస్తున్నాయని, వారిలో చాలామంది ఆత్మన్యూనతవంటి భావనలతో జీవితాలపై ఆసక్తి లేకుండా బతికేస్తున్నారని, ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు సైన్యంలో ఉపయోగించుకుంటే సమస్యలు వస్తాయని వారిని మున్ముందు కొనసాగించకూడదని నిర్ణయించారు.
జెండర్ డిస్పోరియా అనే లక్షణం స్వలింగ సంపర్కుల్లో ఉంటుందని, వారికి వ్యక్తిగతంగా కొంత వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని, అలాగే, మందులు ఉపయోగించడం, అవసరం అయితే, శస్త్ర చికిత్సలు వెళ్లడం లాంటివి ఉంటాయని, వారితో మిలిటరీలో ప్రమాదం అని భావించి ఈనిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు వైట్ హౌస్ డిఫెన్స్ సెక్రటరీ జిమ్ మట్టిస్ ప్రకటన చేశారు. 'తాజాగా మా అధ్యక్షుడు సంతకం చేసిన కొత్త పాలసీ ద్వారా భౌతికంగా, మానసికంగా సమర్థులైనవారే సైన్యంలోకి రావాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రపంచంలోనే మేటి అయిన సైన్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నాం' అని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment