
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీకి దిగాలని ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి సవాల్ విసిరారు. ఆమె మంగళగిరి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా సోమవారం నామినేషన్ వేశారు. అనంతరం తమన్నా సింహాద్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో మొట్ట మొదటి ట్రాన్స్‌జెండర్‌గా ప్రజా సేవకు ముందుకు వస్తున్నానని, ఈ ఎన్నికల్లో తనకు నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జనసేన పార్టీకి నేను దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ పార్టీ నాకు సరైన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. నారా లోకేష్ బాబుకు మంగళగిరిలో ఓటమి తప్పదని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని తమన్నా వ్యాఖ‍్యానించారు. తమకు ఏ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment