న్యూయార్క్: రామచరిత మానస్‌ను ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో తొలిసారి పారాయణం చేయనున్నారు. ఐక్యరాజ్యసమితిలోని ప్రతినిధుల భోజనశాలలో 9 రోజుల పాటు ఈ పారాయణం జరగనుందని మొరారి బాపు తెలిపారు.
శాంతిని పరిరక్షించడంతో పాటు మానసిక ఆరోగ్యానికి రామ కథలు మార్గం చూపుతాయన్నారు. రామాయణ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచంలో సోదర భావాన్ని పెంపొందించి సరిహద్దులకు అతీతంగా ప్రజలను ఏకం చేయడమే లక్ష్యమన్నారు. రామచరిత మానస్‌ను ప్రముఖకవి తులసిదాస్ రచించారు.
Comments
Please login to add a commentAdd a comment