parayanam
-
ఐరాసలో రామకథాపారాయణం
న్యూయార్క్: రామచరిత మానస్‌ను ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో తొలిసారి పారాయణం చేయనున్నారు. ఐక్యరాజ్యసమితిలోని ప్రతినిధుల భోజనశాలలో 9 రోజుల పాటు ఈ పారాయణం జరగనుందని మొరారి బాపు తెలిపారు. శాంతిని పరిరక్షించడంతో పాటు మానసిక ఆరోగ్యానికి రామ కథలు మార్గం చూపుతాయన్నారు. రామాయణ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచంలో సోదర భావాన్ని పెంపొందించి సరిహద్దులకు అతీతంగా ప్రజలను ఏకం చేయడమే లక్ష్యమన్నారు. రామచరిత మానస్‌ను ప్రముఖకవి తులసిదాస్ రచించారు. -
ఆదిపురుష్: ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు
‘ఆదిపురుష్’ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీసనన్ సీతగా నటించారు. భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ‘ఆదిపురుష్’ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం’ అంటూ యూనిట్ ఇటీవల ప్రకటించింది. ఈ మంచి కార్యాన్ని తమవంతుగా ప్రోత్సహిస్తూ శ్రేయాస్ మీడియా వారు మరో నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(1 టిక్కెట్ హనుమాన్‌కి) టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని పేర్కొన్నారు. జై శ్రీరామ్ 🙏Spreading the Divine Aura of Lord Rama unconditionally🤩The Motto to take the Epic & Divine Tale #Adipurush to everyone & every corner continues to be celebrated 🙏@shreyasgroup announces 100+1⃣ tickets to Every Ramalayam in Every Village of Khammam Dt for… pic.twitter.com/2FB5BWVbh6— Shreyas Media (@shreyasgroup) June 11, 2023 చదవండి: నేను తండ్రినయ్యా.. ఇప్పటిదాకా పరిగెత్తింది చాలు: ప్రభుదేవా -
శ్రీశైలం, కాణిపాక దర్శన వేళల్లో మార్పులు
శ్రీశైలం టెంపుల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో చేసిన మార్పులకు అనుగుణంగా శ్రీశైల మల్లన్న దర్శన వేళలను మార్పు చేశారు. సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు తెరిచినప్పటి నుంచి రాత్రి మూసివేసే వరకు రోజువారీ కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. వీటిని అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు. 23న కాణిపాక దర్శన వేళల్లో స్వల్ప మార్పు కాణిపాకం (యాదమరి): చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 23న స్వామివారి దర్శన వేళలలో స్వల్ప మార్పు చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశు ఆదివారం తెలిపారు. ఆ రోజు స్వామివారి ప్రధాన ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు చెప్పారు. పూజల అనంతరం దర్శనాలు ఉంటాయని వెల్లడించారు. శ్రీభోగ శ్రీనివాసునికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం తిరుమల: శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్ర కలశాభిషేకం చేశారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల నడుమ ఆలయంలోని బంగారువాకిలి చెంత ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు. నేడు సుందరకాండ అఖండ పారాయణం కరోనా నుంచి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూన్ 21న 15వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సుందరకాండలోని 59 నుండి 64వ సర్గ వరకు గల 174 శ్లోకాలను పారాయణం చేస్తారు. చదవండి: తిరుమల–తిరుపతి మధ్య విద్యుత్ బస్సులు -
భక్తి, జ్ఞాన కుసుమాల మాల విష్ణుసహస్రం
–వేలాది భక్తుల సమష్టి సహస్రనామ గానం –త్రిదండి చిన్న శ్రీమన్నారాయణరామానుజ జీయరుస్వామి ఉపదేశం రాజమహేంద్రవరం కల్చరల్ : విష్ణుసహస్రనామ స్తోత్రం జ్ఞానకుసుమాల మాల, ఒకో నామం ఒకో పారిజాత కుసుమమని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి పేర్కొన్నారు. మంగళవారం ఎస్.కె.వి.టి.డిగ్రీ కళాశాలలో శ్రీరంగధామం ఆధ్వర్యంలో జరిగిన విరాట్ విష్ణుసహస్రనామ పారాయణలో ఆయన పాల్గొని, అనుగ్రహభాషణం గావించారు. సాధారణంగా భక్తుడు భగవంతుని సన్నిధిని చేరుకోవడానికి తాపత్రయ పడతాడు, కానీ, స్వచ్ఛంద మరణాన్ని వరంగా కలిగిన భీష్ముడు ప్రాణం వదిలే సమయం కోసం నిరీక్షిస్తున్న తరుణంలో, శ్రీకృష్ణభగవానుడే స్వయంగా పాండవాగ్రజునితో అంపశయ్య మీద ఉన్న భీష్ముని వద్దకు వచ్చాడని జీయరు స్వామి వివరించారు. నేడు ప్రపంచమంతా అభద్రతాభావంలో మునిగి ఉంది. వ్యక్తుల మధ్య, మతాల మధ్య, ఒకే మతంలో విభిన్న విభాగాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. ఉగ్రవాదం ఊపిరి పోసుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భయాలు తొలగాలంటే, ప్రేమ చిగురించాలి, మనమంతా ఒకే కుటుంబానికి చెందినవారమన్న భావన కలగాలి, విష్ణుసహస్రనామానికి ఆ శక్తి ఉన్నదని జీయరుస్వామి వివరించారు. భగవద్రామానుజాచార్యులు అవతరించిన సహస్రాబ్ధిలో మనం జన్మించడం, ఆయన్ను స్మరించుకుంటూ విష్ణుసహస్రనామాన్ని పారాయణ చేయడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. వికాసతరంగిణి ఆధ్వర్యంలో ప్రచురించిన శ్రీరామానుజ సంకీర్తన పుస్తకాన్ని జీయరు స్వామి ఆవిష్కరించారు. ప్రాచార్య శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ ఈ సృష్టిలో విష్ణుసహస్రనామాన్ని మించిన జ్ఞానపేటిక మరొకటి లేదని అన్నారు. వేయినామాలు చదవలేకపోయినవారు తొలి మూడు నామాలు చదివినా అనంత శుభఫలితాలు కలుగుతాయన్నారు. నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ భగవద్రామానుజాచార్యులు ప్రపంచానికి సోషలిజం బోధించిన తొలి వ్యక్తి అని అన్నారు. త్రిదండి దేవనాథజీయరుస్వామి, పులిగొల్ళ కృష్ణమాచార్యులు, సముద్రాల రంగరామానుజాచార్యులు ప్రసంగించారు. శతావధాని అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు భాగవతంలోని పద్యాలను రాగ, భావ యుక్తంగా గానం చేశారు. పొంగిపొరలిన భక్తిరసవాహిని వేలాది గళాలు భక్తి పారవశ్యంతో విష్ణుసహస్రనామాలను పారాయణ చేశారు. వేదవ్యాసభారతం, అనుశాసన పర్వంలో భీష్మాచార్యుడు శ్రీకృష్ణభగవానుని సన్నిధిలో ధర్మజునికి సహస్రనామాలు వినిపిస్తే, మంగళవారం త్రిదండి చిన్న జీయరుస్వామి సన్నిధిలో, వేలాది భక్తులు సహస్రనామాలను పారాయణ చేశారు. కళాశాల ఆవరణ అంతా దేవదేవుని నామస్మరణతో మారుమోగింది. -
శ్రీకరీ! శుభకరీ!
వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమలకు శ్రీకారం సహస్ర గళాలతో సహస్ర నామాల పారాయణకు సిద్ధమవుతున్న మహిళలు నలుగురు ఆడవాళ్లు ఒకచోట చేరితే, చీరలు, నగల గురించి మాట్లాడుకుంటారని లోకంలో ఓ అపప్రధ. 1960 దశకంలో పత్రికల్లో ప్రచురితమయ్యే కార్టూన్లకు ప్రధాన ముడిసరుకు ఆడవాళ్లే. అప్పడాలకర్రతో అతివ, గచ్చకాయంత బొడిపెతో భర్త కనిపించని కార్టూను ఉండేది కాదు. తదనంతరం ప్రారంభమైన ‘టీవీ సీరియళ్లకు అతుక్కుపోయే’ ఆడవారిపై కార్టూన్లు నేటికీ కొనసాగుతున్నాయి. నలుగురు ఆడవారు ఒకచోట చేరితే, సమాజానికి ఉపకరించే ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను మూడు దశాబ్దాలుగా సమర్థంగా నిర్వహించగలరని శ్రీకరి లలితామండలి నిరూపిస్తోంది. - రాజమహేంద్రవరం కల్చరల్ రాజమహేంద్రవరం, టి.నగర్లో నివసిస్తున్న గ్రంధి విజయలక్ష్మి పదోతరగతి చదువుకున్న ఓ మధ్యతరగతి మహిళ. చీకూచింతాలేని సంసారం. సమీపంలోని విశ్వేశ్వరస్వామి ఆలయానికి వెళ్లడం ఆమెకు అలవాటు. ఆమెకు మరో మధ్యతరగతి మహిళ పాలకోడేటి పద్మజ ఆలయంలో పరిచయమైంది. ఇద్దరూ కలసి పర్వదినాల్లో ఆలయంలో జరిగే సామూహిక పారాయణల్లో పాల్గొనేవారు. 1982లో గ్రంధి విజయలక్ష్మి వ్యవస్థాపకురాలిగా, ఏడుగురు మహిళలతో శ్రీకరి లలితామండలి ప్రారంభమైంది. మొదట్లో శ్రీకరి మహిళలలో జరిగే పారాయణల పరిధి పెరిగి, ఎవరు పిలిస్తే, వారింటికి వెళ్లి పారాయణలు చేయడం ప్రారంభించారు. మహిళల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సంఖ్య రెండు వందలు దాటింది. ‘ఇంతి’ంతై.. వటుడింతై 2009లో లక్ష కనకధారాపారాయణలు పూర్తి చేయాలని సంకల్పం కలిగింది. సుమారు ఒకటిన్నర సంవత్సరాల వ్యవధిలో లక్ష పారాయణలు పూర్తి చేశారు. పారాయణలు చేయమని జిల్లావ్యాప్తంగా ఆహ్వానాలు వచ్చాయి. అదే ఉత్సాహంతో వంద సౌందర్యలహరి పారాయణలు, 18 ఏకాదశలలో భగవద్గీతాపారాయణలు, వంద ఇళ్లలో వంద శివానందపారాయణలు శ్రీకరి మహిళలు పూర్తి చేశారు. అన్నమయ్య కీర్తనల శతగళార్చన, సహస్రగళార్చన, దశ సహస్రగళార్చనలు నిర్వహించారు. కొండవీటి జ్యోతిర్మయి దశసహస్రగళార్చనలో పాల్గొన్నారు. శ్రీవేంకటేశ్వరగానామృతం ఇప్పటి వరకు సుమారు 70 పారాయణలు పూర్తి చేశారు. ఏలూరు ప్రణవపీఠాధిపతి వద్దిపర్తి పద్మాకర్, ప్రచవన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, భారతభారతి శలాక రఘునాథశర్మలు శ్రీకరి కార్యక్రమాల్లో పాల్గొని ఆశీస్సులను అందజేశారు. అంతేకాదు శ్రీకరీశాంకరీ సత్క్రియా సమ్మేళనం అనే ట్రస్టును స్థాపించి, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సహస్రగళాలతో సహస్రనామాలు ఈనెల 22వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు రాజమహేంద్రవరం హిందూ సమాజంలో వేయిమందికి పైగా మహిళలు లలితాసహస్రనామపారాయణలో పాల్గొంటారు. వశిన్యాది వాగ్దేవతలుగా ఎనిమిదిమంది మహిళలు కొలువుతీరుతారు. లలితాసహస్రనామాలు రాయించి ఉన్న 12 అడుగుల చీరెను ప్రదర్శిస్తారు. ట్రస్టు ద్వారా దివ్యాంగులకు సేవలను అందిస్తారు.