ఆదిపురుష్: ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు | Prabhas And Kriti Sanon Adipurush Team Dedicates 1 Seat To Lord Hanuman In Every Theatre | Sakshi
Sakshi News home page

Adipurush Movie Tickets: ఆ జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు ఉచితం

Published Mon, Jun 12 2023 3:33 AM | Last Updated on Mon, Jun 12 2023 7:15 PM

Prabhas And Kriti Sanon Adipurush Team Dedicates 1 Seat To Lord Hanuman In Every Theatre - Sakshi

‘ఆదిపురుష్‌’ సినిమా కోసం పాన్‌ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  కృతీసనన్‌ సీతగా నటించారు. భూషణ్‌ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్‌ రౌత్, ప్రసాద్‌ సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్‌ చేస్తోంది. ‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం.

ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ‘ఆదిపురుష్‌’ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం’ అంటూ యూనిట్‌ ఇటీవల ప్రకటించింది. ఈ మంచి కార్యాన్ని తమవంతుగా ప్రోత్సహిస్తూ శ్రేయాస్‌ మీడియా వారు మరో నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(1 టిక్కెట్‌ హనుమాన్‌కి) టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్‌ మీడియా అధినేత శ్రీనివాస్‌ తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని పేర్కొన్నారు.

చదవండి: నేను తండ్రినయ్యా.. ఇప్పటిదాకా పరిగెత్తింది చాలు: ప్రభుదేవా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement