హామిల్టన్: న్యూజిలాండ్ విజయాల పరంపర కొనసాగుతోంది. పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో వన్డేలోనూ న్యూజిలాండ్ విజయం సాధించింది. గ్రాండ్‌హోమ్ (40 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (54; 7 ఫోర్లు, ఒక సిక్స్), హారీస్ సోహైల్ (50; 4 ఫోర్లు, ఒక సిక్స్), హఫీజ్ (81; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), సర్ఫరాజ్ అహ్మద్ (51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు.
అనంతరం న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 263 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. 154 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన కివీస్‌ను గ్రాండ్‌హోమ్, నికోల్స్ (52 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 109 పరుగులు జోడించి కివీస్ విజయాన్ని ఖాయం చేశారు. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే ఈనెల 19న జరుగుతుంది.
కివీస్‌ను గెలిపించిన గ్రాండ్‌హోమ్
Published Wed, Jan 17 2018 2:03 AM | Last Updated on Wed, Jan 17 2018 2:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment