grandhome
-
కివీస్‌ను గెలిపించిన గ్రాండ్‌హోమ్
హామిల్టన్: న్యూజిలాండ్ విజయాల పరంపర కొనసాగుతోంది. పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో వన్డేలోనూ న్యూజిలాండ్ విజయం సాధించింది. గ్రాండ్‌హోమ్ (40 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (54; 7 ఫోర్లు, ఒక సిక్స్), హారీస్ సోహైల్ (50; 4 ఫోర్లు, ఒక సిక్స్), హఫీజ్ (81; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), సర్ఫరాజ్ అహ్మద్ (51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 263 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. 154 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన కివీస్‌ను గ్రాండ్‌హోమ్, నికోల్స్ (52 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 109 పరుగులు జోడించి కివీస్ విజయాన్ని ఖాయం చేశారు. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే ఈనెల 19న జరుగుతుంది. -
రెండో ఫాస్టెస్ట్ సెంచరీ!
వెల్లింగ్టన్:న్యూజిలాండ్ క్రికెటర్ గ్రాండ్‌హోమ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. వెస్టిండీస్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లో శతకం సాధించాడు. ఇది న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో రెండో వేగవంతమైన సెంచరీగా నమోదైంది. అంతకుముందు 2015- 16 సీజన్లో ఆసీస్ తో జరిగిన టెస్టులో బ్రెండన్ మెకల్లమ్ 54 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆ తరువాత ఆ దేశం తరపున టెస్టుల్లో గ్రాండ్‌హోమ్ తాజాగా సాధించిన సెంచరీనే వేగవంతమైందిగా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 127 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 447 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్(105; 74 బంతుల్లో11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించిన తరువాత ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
రసెల్ స్థానంలో గ్రాండ్‌హోమ్
కోల్ కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ చేరాడు. డోపింగ్ పరీక్ష నిబంధనలను ఉల్లంఘించినందుకు... కోల్‌కతా జట్టు సభ్యుడైన వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్‌ను ఇటీవలే ఏడాదిపాటు నిషేధించారు. దాంతో కోల్‌కతా జట్టులో రసెల్ స్థానం ఖాళీ అయింది. అతని స్థానాన్ని కోల్‌కతా జట్టు గ్రాండ్‌హోమ్‌తో భర్తీ చేసుకుంది. 30 ఏళ్ల గ్రాండ్‌హోమ్ న్యూజిలాండ్ తరఫున ఎనిమిది టి20లతోపాటు ఆరు టెస్టులు, తొమ్మిది వన్డేలు ఆడాడు.