రసెల్ స్థానంలో గ్రాండ్‌హోమ్
కోల్ కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ చేరాడు. డోపింగ్ పరీక్ష నిబంధనలను ఉల్లంఘించినందుకు... కోల్‌కతా జట్టు సభ్యుడైన వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్‌ను ఇటీవలే ఏడాదిపాటు నిషేధించారు.
దాంతో కోల్‌కతా జట్టులో రసెల్ స్థానం ఖాళీ అయింది. అతని స్థానాన్ని కోల్‌కతా జట్టు గ్రాండ్‌హోమ్‌తో భర్తీ చేసుకుంది. 30 ఏళ్ల గ్రాండ్‌హోమ్ న్యూజిలాండ్ తరఫున ఎనిమిది టి20లతోపాటు ఆరు టెస్టులు, తొమ్మిది వన్డేలు ఆడాడు.