russell
-
మిస్టరీ.. రసెల్ ఎవాన్స్
అర్ధరాత్రి పన్నెండున్నర దాటేసరికి జాన్ ఎవాన్స్ ఇంట్లో ల్యాండ్ ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి హలో అనగానే, ‘డాడ్! ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా, బయలుదేరుతున్నా. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తా’ అన్నాడు రసెల్. ‘సరే నాన్నా జాగ్రత్త!’ అని ఫోన్ పెట్టేశాడు జాన్. గంట దాటేసరికి, మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి కాల్ చేసింది సేక్రడ్ హాస్పిటల్ రిసెప్షనిస్ట్. తమ ఆసుపత్రి వివరాలన్నీ చెప్పి, ‘మీ అబ్బాయి రసెల్ పరిస్థితి సీరియస్‌గా ఉంది. త్వరగా రండి’ అంది. జాన్ కి కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. ‘ఏమంటున్నావ్?’ అని గట్టిగా అరిచాడు. వెంటనే రిసెప్షనిస్ట్ చేతిలోంచి ఫోన్ అందుకున్న రసెల్ స్నేహితురాలు శాండీ.. ‘అంకుల్! మన రసెల్ కోమాలోకెళ్లాడంటున్నారు త్వరగా రా అంకుల్’ అంటూ ఏడ్చేసింది. దాంతో జాన్ వెంటనే భార్య స్యూ ఎవాన్స్ని తీసుకుని ఆ ఆసుపత్రికి పరుగు తీశాడు.ఆసుపత్రిలో ఓ పక్క పోలీసుల ఫార్మాలిటీస్, మరో పక్క ఆసుపత్రి సిబ్బంది పరుగులు జాన్ దంపతుల్ని వణికించేశాయి. ఏం జరిగిందో చెప్పడానికి రసెల్ స్పృహలో లేడు. ఏమైందో తెలుసుకోవడానికి గుండెధైర్యం చాలట్లేదు. అయినా ఏడుస్తూనే పోలీసుల్ని ఆరా తీస్తే, హిట్ అండ్ రసెల్ కేసన్నారు. శాండీ మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పింది. ‘అంకుల్! నేను ఇందాకే వ¯Œ అయ్యేసరికి పార్ట్‌టైమ్ జాబ్ ముగించుకుని నడుస్తూ ఇంటికొస్తుంటే, మన అపార్ట్మెంట్కి సమీపంలో రోడ్డు మీద రసెల్ కదల్లేని స్థితిలో పడున్నాడు. ‘బ్రియాన్! బ్రియాన్!’ అని గట్టిగా అరుస్తున్నాడు. దగ్గరకెళ్లి చూస్తే ఒళ్లంతా రక్తం, భయమేసి అంబులెన్స్ కి కాల్ చేసి, ఆసుపత్రికి తీసుకొచ్చాం. రాగానే కోమాలోకి వెళ్లిపోయాడు. కానీ నేను రసెల్‌ని గుర్తించిన సమయంలో అక్కడ పొదల్లో ఎవరో ఉన్నట్లనిపించింది. ఎవరా? అని నేను వంగి చూసేసరికి, తెల్ల చొక్కా వేసుకున్న ఒక అబ్బాయి మన అపార్ట్మెంట్స్ వెనకున్న కొండలవైపు పారిపోయాడు. కానీ మన రసెల్‌కి బ్రియాన్ అనే స్నేహితుడున్నాడు కదా. తను అప్పటిదాకా రసెల్తోనే ఉన్నాడేమోనని నా అనుమానం. ఇదంతా పోలీసులకు చెప్పినా, హిట్ అండ్ రసెల్ అనే రాసుకున్నారు’ చెప్పింది శాండీ.జాన్ కుటుంబానికి శాండీ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్సే. అంతా ఒకే బ్లాక్‌లో ఉండేవారు. రసెల్, శాండీలు మంచి స్నేహితులు. ఎనిమిదో తరగతి చదువుతున్న రసెల్‌కి 13 ఏళ్లు. శాండీ అతడికంటే రెండేళ్లు పెద్దది. రసెల్‌కి డయానా అనే ఐదేళ్ల చెల్లెలు కూడా ఉంది. చదువులో ముందుండే రసెల్ బెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టీన్స్‌లోకి వచ్చేసరికి స్నేహితులు పెరగడంతో ఇంట్లో కంటే బయటే ఎక్కువ గడిపేవాడు. గతంలో స్యూ ఎవాన్స్ నర్స్‌గా, జాన్ కార్డియో పల్మనరీ టెక్నాలజిస్ట్‌గా పనిచేయడంతో వైద్యరంగంపై వారికి బాగానే అనుభవముంది. శాండీ మాటలు విన్న వెంటనే, తమ గత అనుభవాన్ని ఆ ఆసుపత్రి వైద్యులకు వివరించి, రసెల్ పరిస్థితిని గమనించడానికి చికిత్స జరుగుతున్న గదికెళ్లారు. రసెల్‌ని ఒక పెద్ద వాహనం ఢీ కొట్టినమాట నిజమే కాని, దానికంటే ముందు అతన్ని ఎవరో బ్యాట్‌లాంటి బలమైన వస్తువుతో కొట్టినట్లు అతడి ఒంటిపై ఆనవాళ్లున్నాయి. అదే విషయం పోలీసులకు చెప్పి వాపోయారు. అయినా అధికారుల్లో చలనం లేదు. దురదృష్టవశాత్తు ఉదయం తొమ్మిదయ్యేసరికి రసెల్ చనిపోయాడు. కొడుకు మరణంతో అల్లాడిపోతున్న ఆ దంపతులకు అప్పుడే ఆ ఆసుపత్రి రిసెప్షనిస్ట్ మరో క్లూ ఇచ్చింది. రసెల్ ఆసుపత్రిలో జాయిన్ అయిన ఒక గంటకే బ్రియాన్ అనే వ్యక్తి కాల్ చేసి, రసెల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడని చెప్పింది. వెంటనే రసెల్ స్నేహితుడు బ్రియాన్‌ని పిలిపించాడు జాన్. మొదటి నుంచి ‘నాకేం తెలియదు’ అన్నట్లే మాట్లాడాడు బ్రియాన్. జాన్ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలిస్తూ, రసెల్‌పై దాడి జరిగిన రాత్రి వైట్ కలర్ షర్ట్ వేసుకున్నానని అసంకల్పితంగా చెప్పేశాడు. అదే విషయాన్ని జాన్ పోలీసులకు చెప్పాడంతో బ్రియాన్‌ని అదుపులోకి తీసుకుని నిలదీశారు. అయితే బ్రియాన్ తనకసలు వైట్ షర్టే లేదని మాట మార్చేశాడు. దాంతో రసెల్ కుటుంబం ఈ విషాదంలో ప్రత్యక్ష సాక్షి బ్రియాన్ అని నమ్మడం మొదలుపెట్టింది.ఈలోపు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. దానిలో రసెల్‌ని ఏదో వాహనం గుద్దేయడంతోనే మరణం సంభవించిందని అందులో ఉంది. ఇంతలో రసెల్ చనిపోయాడని తెలియగానే, ఆరోన్ అనే స్నేహితుడు ముందుకొచ్చాడు. ‘ఆ రాత్రి తొమ్మిది అయ్యేసరికి మేమిద్దరం దగ్గర్లోని పార్క్‌కి వెళ్లాం. అక్కడ నాకు గతంలో నా గర్ల్‌ఫ్రెండ్‌ని ఏడిపించిన ఒక అబ్బాయి కనిపించాడు. వాడికి వార్నింగ్ ఇచ్చేక్రమంలో నా పక్కనే ఉన్న రసెల్ వాడ్ని కొట్టాడు. అయితే ఆ అబ్బాయి కోపంగా తన వాళ్లని తీసుకొస్తానని పరుగెత్తాడు. పార్క్‌లో మా గొడవ చూసిన కొందరు పెద్దవాళ్లు ‘ఆ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ మాకు తెలుసు. వాళ్లతో గొడవ మంచిది కాదు, ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోండి’ అని సలహా ఇచ్చారు. దాంతో మేము అక్కడి నుంచి వచ్చేశాం. రసెల్ తన బాస్కెట్‌బాల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాననడంతో నేను మా ఇంటికి వెళ్లిపోయా. బహుశా ఆ పార్క్‌లో అబ్బాయిగానీ రసెల్‌పై పగ తీర్చుకున్నాడేమో?’ అని తన మనసులో అనుమానాన్ని పోలీసుల ముందు బయటపెట్టాడు.దాంతో దేశంలోనే ప్రముఖ డాక్టర్ విలియం ఎకెర్ట్ని నియమించి, మరణానికి అసలు కారణం తేల్చమన్నారు జాన్ దంపతులు. విలియం మళ్లీ శవపరీక్ష చేసి, యాక్సిడెంట్‌కి ముందే రసెల్‌పై తీవ్రమైన దాడి జరిగిందని, అంటే ఎవరో కావాలనే ఆ యాక్సిడెంట్ చేశారని క్లారిటీ ఇచ్చాడు. రెసెల్ పడి ఉన్న ప్రదేశానికి 86 అడుగుల ముందే అతని షూస్, సాక్స్ రక్తం మరకలతో దొరికాయి. బహుశా మనిషిని కింద పడేసి, బండితో ఈడ్చి పారేసి ఉంటారని విలియం అంచనా వేశాడు.1996 జూన్ 3న అర్ధరాత్రి ఒంటిగంటకు వాషింగ్టన్, స్పోకాన్లో ర సెల్ అపార్ట్మెంట్కి చేరువలో రోడ్డుపై.. చావు బతుకుల మధ్య శాండీ అనే స్నేహితురాలికి కనిపించాడు. సుమారు 8 గంటలు కోమాలో ఉన్న రసెల్, జూన్ 4న ఉదయం 9 గంటలకు చనిపోయాడు.ఆ రాత్రి పార్క్‌లో గొడవపడిన కుర్రాడితో పాటు అతడి గ్యాంగ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ నిజాలు బయటికి రాలేదు. కొడుకు చనిపోయాడన్న బెంగతోనే జాన్ 1998లో మరణించాడు. మరో పదమూడేళ్ల న్యాయపోరాటం తర్వాత రసెల్ తల్లి స్యూ చనిపోయింది. ఇప్పటికీ అతని సోదరి డయానా తన అన్నను చంపిందెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఏది ఏమైనా, కొన ఊపిరితో ఉన్న రసెల్ తన స్నేహితుడు బ్రియాన్ పేరెందుకు పిలిచాడు? ఆసుపత్రికి కాల్ చేసింది ఎవరు? నిజంగానే పార్క్‌లో కుర్రాడికి, అతని గ్యాంగ్‌కి ఆ రాత్రి రసెల్ ఒంటరిగా దొరికేశాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే!∙సంహిత నిమ్మన -
రసెల్‌కు ‘పోల్ పొజిషన్’
మాంట్రియల్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్ తన కెరీర్లో రెండోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఫార్ములావన్ సీజన్లో భాగంగా తొమ్మిదో రేసు కెనడా గ్రాండ్‌ప్రిని రసెల్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. క్వాలిఫయింగ్ సెషన్లో రసెల్, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 12 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశారు. అయితే వెర్స్టాపెన్కంటే ముందుగా రసెల్ ఈ సమయాన్ని నమోదు చేయడంతో అతనికి పోల్ పొజిషన్ కేటాయించారు. మూడు క్వాలిఫయింగ్ సెషన్లు కలిపి రసెల్ 26 ల్యాప్‌లు... వెర్స్టాపెన్ 27 ల్యాప్‌లు పూర్తి చేశారు. 2022లో హంగేరి గ్రాండ్‌ప్రిలో తొలిసారి రసెల్ ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించాడు. ఆ తర్వాత రసెల్‌కు మళ్లీ పోల్ పొజిషన్ దక్కలేదు. లాండో నోరిస్ (మెక్లారెన్) మూడో స్థానం నుంచి... ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్) నాలుగో స్థానం నుంచి... డానియల్ రికార్డో (హోండా) ఐదో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎనిమిది రేసులు జరగ్గా... తొలి ఏడు రేసుల్లో వెర్స్టాపెన్, ఎనిమిదో రేసులో చార్లెస్ లెక్లెర్క్ పోల్ పొజిషన్లు సాధించారు. -
IPL 2024 KKR Vs SRH: ఆఖరి బంతికి...
కోల్‌కతా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టాలంటే కొండంత లక్ష్యాన్ని కరిగించాలి. ఒక దశలో గెలవడానికి 24 బంతుల్లో 76 పరుగులు కావాలి. దీంతో కోల్‌కతా విజయం లాంఛనమే అనిపించింది. కానీ హెన్రిచ్ క్లాసెన్ (29 బంతుల్లో 63; 8 సిక్స్‌లు) భారీ సిక్సర్లు ఒక్కసారిగా హైదరాబాద్ విజయానికి ఊపిరిపోశాయి. 17, 18, 19వ ఓవర్లలో వరుసగా 16, 21, 26 పరుగులు వచ్చాయి. వరుణ్ 3 సిక్సర్లు ఇవ్వగా...స్టార్క్ ఓవర్లో క్లాసెన్ 3, షహబాజ్ ఒక సిక్సర్ బాదారు! అంతే ఆఖరి 6 బంతులకు 13 పరుగులు సన్‌రైజర్స్ వైపు మొగ్గేలా చేసింది. హర్షిత్ రాణా వేసిన ఈ ఓవర్లో తొలి బంతికే క్లాసెన్ సిక్స్ బాదడంతో 5 బంతుల్లో 7 పరుగులు హైదరాబాద్‌ను సంబరాల్లో ముంచింది. కానీ హర్షిత్ (3/33) వైవిధ్యమైన బంతులతో రెండే పరుగులిచ్చి షహబాజ్ (16; 1 ఫోర్, 2 సిక్స్‌లు), క్లాసెన్‌లను అవుట్ చేశాడు. చివరి బంతికి గెలవాలంటే 5 పరుగులు కావాల్సి ఉండగా కమిన్స్ సింగిల్ కూడా తీయలేకపోయాడు. దాంతో కోల్‌కతా 4 పరుగులతో అనూహ్య విజయం సాధించింది. దీంతో గెలుపుదారిలో పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఈ ఐపీఎల్ సీజన్‌ను ప్రారంభించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా రెండో ఓవర్ నుంచే కష్టాల్లో పడింది. నరైన్ (2), వెంకటేశ్ అయ్యర్ (7), శ్రేయస్ అయ్యర్ (0), నితీశ్ రాణా (9) చేతులెత్తేశారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (40 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా... 14వ ఓవర్లో అతనూ అవుటయ్యాడు. కోల్‌కతా స్కోరు 119/6. అప్పుడు క్రీజులోకి వచ్చిన రస్సెల్ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) చాన్నాళ్ల తర్వాత విధ్వంసరచన చేశాడు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీస్కోరు చేసింది. మిగిలిన 6.1 ఓవర్లలోనే జట్టు 89 పరుగులు చేస్తే అందులో రసెల్ ఒక్కడివే 64 పరుగులంటే... హైదరాబాద్ బౌలర్లు కూడా ప్రేక్షకులు కావాల్సివచ్చింది. రసెల్ 20 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. నటరాజన్ 3, మయాంక్ మార్కండే 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసి ఓడింది. మయాంక్ (21 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ (19 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే స్వల్ప వ్యవధిలో మార్క్రమ్ (18), రాహుల్ త్రిపాఠి (20) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జాన్సెన్ (బి) మార్కండే 54; నరైన్ రనౌట్ 2; వెంకటేశ్ (సి) జాన్సెన్ (బి) నటరాజన్ 7; శ్రేయస్ (సి) కమిన్స్ (బి) నటరాజన్ 0; నితీశ్ (సి) త్రిపాఠి (బి) మార్కండే 9; రమణ్‌దీప్ (సి) మార్కండే (బి) కమిన్స్ 35; రింకూ సింగ్ (సి) మార్కండే (బి) నటరాజన్ 23; రసెల్ నాటౌట్ 64; స్టార్క్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–23, 2–32, 3–32, 4–51, 5–105, 6–119, 7–200. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–51–0, జాన్సెన్ 3–0–40–0, నటరాజన్ 4–0–32–3, కమిన్స్ 4–0–32–1, మార్కండే 4–0–39–2, షహబాజ్ 1–0–14–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) రింకూ (బి) హర్షిత్ 32; అభిషేక్ (సి) వరుణ్ (బి) రసెల్ 32; త్రిపాఠి (సి) హర్షిత్ (బి) నరైన్ 20; మార్క్రమ్ (సి) రింకూ (బి) వరుణ్ 18; క్లాసెన్ (సి) సుయశ్ (బి) హర్షిత్ 63; సమద్ (సి) వెంకటేశ్ (బి) రసెల్ 15; షహబాజ్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 16; జాన్సెన్ నాటౌట్ 1; కమిన్స్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–60, 2–71, 3–107, 4–111, 5–145, 6–203, 7–204. బౌలింగ్: స్టార్క్ 4–0–53–0, హర్షిత్ రాణా 4–0–33–3, వరుణ్ 4–0–55–1, నరైన్ 4–0–19–1, రసెల్ 2–0–25–2, సుయశ్ 2–0–18–0. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ X లక్నో వేదిక: జైపూర్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి గుజరాత్ X ముంబై వేదిక: అహ్మదాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కోల్‌కథ...ఇంకా ఉంది!
ముంబై: తొలి పది మ్యాచ్‌లలో తీసింది 5 వికెట్లే... ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈసారి తన సత్తా చూపించాడు. 9 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ముంబైకి మంచి విజయావకాశం సృష్టించాడు. కానీ రోహిత్ శర్మ బృందం ఆ అవకాశాన్ని వృథా చేసుకుంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించే స్థితిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కీలక విజయంతో ఆశలు నిలబెట్టుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచింది. ఐపీఎల్లో బుమ్రా తన అత్యుత్తమ ప్రదర్శన (5/10) నమోదు చేశాడు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. రాణించిన వెంకటేశ్, రాణా... కోల్‌కతాకు ఈసారి సరైన ఆరంభం లభించింది. వెంకటేశ్, అజింక్య రహానే (24 బంతుల్లో 25; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 34 బంతుల్లోనే 60 పరుగులు జోడించారు. మూడో స్థానంలో వచ్చిన రాణా కూడా ధాటిని ప్రదర్శించడంతో 11 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు సరిగ్గా 100 పరుగులకు చేరింది. రాణా, రసెల్ జోరు మీదుండటంతో ఇక మిగిలిన ఓవర్లలో విధ్వంసం ఖాయమనిపించింది. అయితే బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో ఆటను ఒక్కసారిగా మలుపు తిప్పాడు. ఒకే ఓవర్లో రాణా, రసెల్ (9)లను అవుట్ చేసిన బుమ్రా, తన తర్వాతి ఓవర్లో మరో 3 వికెట్లతో చెలరేగాడు. కోల్‌కతా వరుస వికెట్లు కోల్పోయిన తర్వాత చివర్లో రింకూ సింగ్ (19 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొంత పోరాడగలిగాడు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై తడబడింది. ఇషాన్ మినహా అంతా విఫలమయ్యారు. రోహిత్ శర్మ (2), తిలక్ వర్మ (6) ఆరంభంలోనే వెనుదిరగ్గా, టిమ్ డేవిడ్ (13), పొలార్డ్ (15) ప్రభావం చూపలేకపోయారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) స్యామ్స్ (బి) కార్తికేయ 43; రహానే (బి) కార్తికేయ 25; రాణా (సి) కిషన్ (బి) బుమ్రా 43; శ్రేయస్ (సి) కిషన్ (బి) మురుగన్ 6; రసెల్ (సి) పొలార్డ్ (బి) బుమ్రా 9; రింకూ (నాటౌట్) 23; జాక్సన్ (సి) స్యామ్స్ (బి) బుమ్రా 5; కమిన్స్ (సి) తిలక్ (బి) బుమ్రా 0; నరైన్ (సి అండ్ బి) బుమ్రా 0; సౌతీ (సి) పొలార్డ్ (బి) స్యామ్స్ 0; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–60, 2–87, 3–123, 4–136, 5–139, 6–156, 7–156, 8–156, 9–164. బౌలింగ్: స్యామ్స్ 4–0–26–1, మురుగన్ 4–0–35–1, బుమ్రా 4–1–10–5, మెరిడిత్ 3–0–35–0, కార్తికేయ 3–0–32–2, పొలార్డ్ 2–0–26–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) జాక్సన్ (బి) సౌతీ 2; ఇషాన్ (సి) రింకూ (బి) కమిన్స్ 51; తిలక్ (సి) రాణా (బి) రసెల్ 6; రమణ్‌దీప్ (సి) రాణా (బి) రసెల్ 12; డేవిడ్ (సి) రహానే (బి) వరుణ్ 13; పొలార్డ్ (రనౌట్) 15; స్యామ్స్ (సి) జాక్సన్ (బి) కమిన్స్ 1; మురుగన్ (సి) వరుణ్ (బి) కమిన్స్ 0; కార్తికేయ (రనౌట్) 3; బుమ్రా (రనౌట్) 0; మెరిడిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–2, 2–32, 3–69, 4–83, 5–100, 6–102, 7–102, 8–112, 9–113, 10–113. బౌలింగ్: సౌతీ 3–0–10–1, కమిన్స్ 4–0–22–3, రసెల్ 2.3–0–22–2, నరైన్ 4–0–21–0, వరుణ్ 3–0–22–1, వెంకటేశ్ 1–0–8–0. ఐపీఎల్లో నేడు గుజరాత్ టైటాన్స్ X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
కోల్‌కతా...చేజేతులా
డిఫెండింగ్ చాంపియనా మజాకా... వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడే పరిస్థితిని తప్పించి మరీ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. గెలుపు కోసం కోల్‌కతా చివరి 30 బంతుల్లో 31 పరుగులే చేయాల్సి ఉన్నా... క్రీజులో రసెల్, దినేశ్ కార్తీక్‌లాంటి హిట్టర్లున్నా... ఆ జట్టు అనూహ్యంగా తడబడింది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ మ్యాచ్‌కంటే ముందు ఐపీఎల్లో కోల్‌కతాతో ఆడిన 27 మ్యాచ్‌ల్లో 21 సార్లు గెలిచిన ముంబై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చివరి ఐదు ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి ఓటమి అంచుల్లో నుంచి విజయతీరానికి చేరింది. చిత్రంగా చివరి 30 బంతుల్లో ముంబై కేవలం ఒకే ఒక్క బౌండరీ మాత్రమే సమరి్పంచుకుందంటే ఆ జట్టు పోరాటపటిమను, బౌలర్ల శ్రమను కచ్చితంగా అభినందించాల్సిందే! చెన్నై: ఈ సీజన్లో రోహిత్ శర్మ సేన బోణీ కొట్టింది. తమ రెండో మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలుపొందింది. మొదట రసెల్ (కోల్‌కతా) వేసిన ఆఖరి ఓవర్లే హైలైట్ అనుకుంటే... తర్వాత బౌల్ట్ (ముంబై) వేసిన ఆఖరి ఓవర్ అంతకుమించి హైలైట్‌గా నిలిచింది. 1, 1, వికెట్, వికెట్, 2, 0లతో అతను వేసిన ఆఖరి ఆరు బంతులు కోల్‌కతాను ముంచేసింది. తొలుత ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌటైంది. టాపార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ రోహిత్ శర్మ (32 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. రసెల్ (5/15) ముంబైని అనూహ్యంగా కట్టడి చేశాడు. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఇక్కడా టాపార్డరే ఆడింది. నితీశ్ రాణా (47 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (24 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణిస్తే మిగతా వారెవరూ కనీసం పట్టుమని పది పరుగులైనా చేయలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ చహర్ (4/27) తన స్పిన్‌తో కోల్‌కతాను తిప్పేశాడు. సూర్య ‘మెరుపుల్’ ముంబై ఆట మొదలైన రెండో ఓవర్లోనే డికాక్ (2) వికెట్‌ను కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి అతని వికెట్‌ను పడేశాడు. వన్‌డౌన్‌లో సూర్యకుమార్ వచ్చీ రాగానే మెరుపుల పని మొదలుపెట్టాడు. భజ్జీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో స్క్వేర్ లెగ్, లాంగాన్, ఎక్స్ట్రా కవర్ల దిశగా మూడు బౌండరీలు బాదాడు. తిరిగి ప్రసిధ్ కృష్ణ వేసిన 8వ ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టాడు. కమిన్స్ వేసిన పదో ఓవర్లో డీప్ స్క్వేర్‌లో కొట్టిన భారీ సిక్సర్‌తో సూర్యకుమార్ ఫిఫ్టీ 33 బంతుల్లోనే (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పూర్తయ్యింది. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 81/1. ఇంతవరకు బాగానే ఉన్నా... రోహిత్ శర్మ క్రీజులో ఉన్నా... తర్వాత పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది. దెబ్బతీసిన షకీబ్, కమిన్స్ షకీబుల్ హసన్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేయగా రెండో బంతిని సూర్య బౌండరీకి తరలించాడు. తర్వాత బంతికి అదే ఊపులో భారీషాట్‌కు ప్రయత్నించి శుబ్‌మన్ చేతికి చిక్కాడు. మరుసటి ఓవర్లో కమిన్స్... ఇషాన్ కిషన్ (1)ను అవుట్ చేశాడు. దీంతో రోహిత్ చూసుకొని ఆడటంతో రన్‌రేట్ మందగించింది. 14వ ఓవర్లో స్కోరు వందకు చేరింది. రోహిత్ శర్మను కమిన్స్ బౌల్డ్ చేయడంతో పాటు రసెల్ బౌలింగ్ దిగడంతో ముంబై తడబడింది. హార్డ్ హిట్టర్లు హార్దిక్ పాండ్యా (15), పొలార్డ్ (5), కృనాల్ (15) కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలవంచారు. దీంతో ఒక దశలో 86/1తో పటిష్టంగా కనిపించిన ముంబై 126/7తో నేలకు దిగింది. 152 పరుగుల వద్ద ఆలౌటైంది. రాణా రాణించినా... ముంబై నిర్దేశించిన లక్ష్యం ఏమంత కష్టంగా లేదు. 20 ఓవర్లు నిలబడి అడపాదడపా షాట్లు కొడితే గెలిచే లక్ష్యం. కోల్‌కతా ఓపెనర్లు రాణా, గిల్ ముందుగా నింపాదిగా బ్యాటింగ్ చేశారు. గతి తప్పిన బంతుల్ని బౌండరీలకు తరలించాడు. బౌల్ట్ మూడో ఓవర్లో రాణా కవర్లో సిక్సర్ బాదాడు. మరోవైపు గిల్ బౌండరీలపై దృష్టిపెట్టాడు. నితీశ్ రాణా... పొలార్డ్ బౌలింగ్‌లో డీప్‌మిడ్ వికెట్ దిశగా మరో సిక్స్ కొట్టాడు. శుబ్‌మన్ కూడా స్పిన్నర్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. ఇదే ఉత్సాహంతో మరో షాట్‌కు ప్రయత్నించిన గిల్‌కు చహర్ చెక్ పెట్టాడు. దీంతో 72 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం చెదిరింది. చహర్ తన తదుపరి ఓవర్లలో వరుసగా రాహుల్ త్రిపాఠి (5), కెప్టెన్ మోర్గాన్ (7), నితీశ్ రాణాలను ఔట్ చేయడంతో ముంబై పట్టు బిగించింది. షకీబ్ (9) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 15.2 ఓవర్లలో కోల్‌కతా 122 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. హార్డ్ హిట్టర్ రసెల్ క్రీజులోకి రాగా దినేశ్ కార్తీక్ జతగా ఉన్నాడు. అయితే ముంబై బౌలర్లు ఒత్తిడి పెంచారు. 16వ ఓవర్లో కృనాల్ ఒక పరుగు మాత్రమే ఇచ్చి వికెట్ తీశాడు. కానీ రసెల్ రిటర్న్ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. 17వ ఓవర్లో బుమ్రా 8 పరుగులిచ్చినా... మరుసటి ఓవర్ వేసిన కృనాల్ 3 పరుగులే ఇచ్చి కవర్ చేశాడు. బుమ్రా తన నైపుణ్యాన్ని అంతా ఉపయోగించి వేసిన 19వ ఓవర్లో 4 పరుగులు ఇచ్చాడు. ఇక ఆఖరి 6 బంతుల్లో కోల్‌కతా విజయానికి 15 పరుగులు కావాలి. కానీ బౌల్ట్ మూడో బంతికి రసెల్ (9)ను రిటర్న్ క్యాచ్‌తో, నాలుగో బంతికి కమిన్స్‌ను క్లీన్ బౌల్డ్‌తో పెవిలియన్ చేర్చాడు. చివరకు 4 పరుగులే ఇవ్వడంతో కోల్‌కతా 142/7 స్కోరు దగ్గరే ఆగిపోయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) కమిన్స్ 43; డికాక్ (సి) త్రిపాఠి (బి) వరుణ్ 2; సూర్యకుమార్ (సి) గిల్ (బి) షకీబ్ 56; ఇషాన్ (సి) ప్రసిధ్ (బి) కమిన్స్ 1; హార్దిక్ పాండ్యా (సి) రసెల్ (బి) ప్రసిధ్ 15; పొలార్డ్ (సి) కార్తీక్ (బి) రసెల్ 5; కృనాల్ (సి) ప్రసిధ్ (బి) రసెల్ 15; జేన్సన్ (సి) కమిన్స్ (బి) రసెల్ 0; రాహుల్ చహర్ (సి) గిల్ (బి) రసెల్ 8; బుమ్రా (సి) షకీబ్ (బి) రసెల్ 0; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 152. వికెట్ల పతనం: 1–10, 2–86, 3–88, 4–115, 5–123, 6–125, 7–126, 8–150, 9–150, 10–152. బౌలింగ్: హర్భజన్ 2–0–17–0, వరుణ్ చక్రవర్తి 4–0–27–1, షకీబ్ 4–0–23–1, కమిన్స్ 4–0–24–2, ప్రసిధ్ 4–0–42–1, రసెల్ 2–0–15–5. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రాణా (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చహర్ 57; గిల్ (సి) పొలార్డ్ (బి) రాహుల్ చహర్ 33; రాహుల్ త్రిపాఠి (సి) డికాక్ (బి) రాహుల్ చహర్ 5; మోర్గాన్ (సి) జేన్సన్ (బి) రాహుల్ చహర్ 7; షకీబ్ (సి) సూర్య (బి) కృనాల్ 9; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 8; రసెల్ (సి అండ్ బి) బౌల్ట్ 9; కమిన్స్ (బి) బౌల్ట్ 0; హర్భజన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–72, 2–84, 3–104, 4–122, 5–122, 6–140, 7–140. బౌలింగ్: బౌల్ట్ 4–0–27–2, జేన్సన్ 2–0–17–0, బుమ్రా 4–0–28–0, కృనాల్ 4–0–13–1, పొలార్డ్ 1–0–12–0, రాహుల్ చహర్ 4–0–27–4, రోహిత్ 1–0–9–0. 2–0–15–5 ఆలస్యం అమృతం విషమన్నారు పెద్దలు. కానీ ఆలస్యం అద్భుతం ఆలౌట్ అన్నాడు రసెల్! అందరికంటే లేట్‌గా 18వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన రసెల్ ముంబైకి ముకుతాడు వేశాడు. డెత్ ఓవర్లలో పొలార్డ్, కృనాల్ పాండ్యాలాంటి హిట్టర్లున్న ముంబై ధనాధన్ బాదాలి. కానీ అలా జరగలేదు. కారణం రసెల్! 18వ ఓవర్లో ఒక వైడ్‌బాల్ వ్యవధిలో పొలార్డ్, జేన్సన్లను ఔట్ చేశాడు. మళ్లీ ఆఖరి ఓవర్ వేసిన అతను మొదటి 2 బంతులకు 4, 4 సమర్పించుకున్నాడు. తర్వాతి 2 బంతులకు కృనాల్, బుమ్రాలను పెవిలియన్ చేర్చాడు. ఆఖరి బంతికి రాహుల్ చహర్‌ను అవుట్ చేశాడు. ఇలా 12 బంతులేసి రసెల్ 5 వికెట్లు పడగొట్టేశాడు. -
రసెల్ స్థానంలో గ్రాండ్‌హోమ్
కోల్ కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ చేరాడు. డోపింగ్ పరీక్ష నిబంధనలను ఉల్లంఘించినందుకు... కోల్‌కతా జట్టు సభ్యుడైన వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్‌ను ఇటీవలే ఏడాదిపాటు నిషేధించారు. దాంతో కోల్‌కతా జట్టులో రసెల్ స్థానం ఖాళీ అయింది. అతని స్థానాన్ని కోల్‌కతా జట్టు గ్రాండ్‌హోమ్‌తో భర్తీ చేసుకుంది. 30 ఏళ్ల గ్రాండ్‌హోమ్ న్యూజిలాండ్ తరఫున ఎనిమిది టి20లతోపాటు ఆరు టెస్టులు, తొమ్మిది వన్డేలు ఆడాడు. -
బ్లాక్ బ్యాట్‌పై నిషేధం!
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో బ్లాక్ కలర్ బ్యాట్ పై నిషేధం విధించారు. ఆటగాళ్ల డ్రెస్ కోడ్ ను బట్టి బ్యాట్ కలర్ కూడా ఉండవచ్చని తొలుత పేర్కొన్న క్రికెట్ ఆస్ట్రేలియా.. దానిపై నిర్ణయాన్ని మార్చుకుంటూ నిషేధం విధించింది. పురుషుల బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఆరంభపు మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ తరపున విండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ బ్లాక్ బ్యాట్‌తో బరిలోకి దిగాడు. అయితే బ్లాక్ బ్యాట్ వాడకం వల్ల బంతి కలర్ దెబ్బతింటుందని మ్యాచ్ అధికారులు నివేదిక అందజేశారు. దాంతో బిగ్ బాష్ లీగ్‌లో బ్లాక్ బ్యాట్‌ను నిషేధం విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బిగ్ బాష్ లీగ్ లో బ్లాక్ బ్యాట్ వాడరాదంటూ నిబంధనలను విధించింది. 'మేము బ్లాక్ బ్యాట్ పై నిషేధం విధిస్తున్నాం. బ్లాక్ బ్యాట్ వాడటానికి ఎటువంటి ఇబ్బంది లేదని తొలుత చెప్పినా, బంతిపై నల్లని మరకలు పడుతూ ఉండటంతో ముందస్తు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. అది బీబీఎల్ కావొచ్చు.. డబ్యూబీబీఎల్ కావొచ్చు.. ఆటగాడు రస్సెల్ కావొచ్చు.. మరెవరైనా కావొచ్చు..బ్లాక్ బ్యాట్ పై నిషేధం విధిస్తున్నాం'అని సీఏ పేర్కొంది. గత బీబీఎల్ సీజన్లో క్రిస్ గేల్ బంగారు పూత కల్గిన బ్యాట్‌ను వాడిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు గేల్ బ్యాట్ ను తయారు చేసిన స్పార్టాన్ కంపెనీ.. ఇప్పుడు రస్సెల్ కు బ్లాక్ బ్యాట్‌ను తయారు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా, గత ఈసీబీ నిర్వహించిన లీగ్ లో కూడా ఈ తరహా పరిణామమే చోటు చేసుకుంది. అసర్ జైదీ వాడిన స్ప్రే పెయింట్ బ్యాట్‌పై ఈసీబీ నిషేధం విధించింది. -
‘అదిరే' రసెల్...
ఆండ్రీ రసెల్... ఈ ఏడాది కోల్‌కతా తరఫున ఐిపీఎల్లో రెండు మ్యాచ్‌లు ఆడి 2 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్... అయితే బుధవారం అతనిలో కొత్త చాంపియన్ బయటికి వచ్చాడు. 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టును ఈ విండీస్ బ్యాట్స్‌మన్ తన అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించాడు. మరో ఆల్‌రౌండర్ డస్కటే కూడా చెలరేగడంతో నైట్‌రైడర్స్ వరుస విజయాల రికార్డు కొనసాగింది. ఫలితంగా మాజీ చాంపియన్ చెన్నైకి చాంపియన్స్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. మెరుగైన స్కోరును కాపాడుకోగలమనే ధీమాలో కనిపించిన ధోని సేన ఒక్కసారిగా పట్టు కోల్పోయి మ్యాచ్ చేజార్చుకుంది. ఆండ్రీ రసెల్... ఈ ఏడాది కోల్‌కతా తరఫున ఐిపీఎల్లో రెండు మ్యాచ్‌లు ఆడి 2 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్... అయితే బుధవారం అతనిలో కొత్త చాంపియన్ బయటికి వచ్చాడు. 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టును ఈ విండీస్ బ్యాట్స్‌మన్ తన అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించాడు. మరో ఆల్‌రౌండర్ డస్కటే కూడా చెలరేగడంతో నైట్‌రైడర్స్ వరుస విజయాల రికార్డు కొనసాగింది. ఫలితంగా మాజీ చాంపియన్ చెన్నైకి చాంపియన్స్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. మెరుగైన స్కోరును కాపాడుకోగలమనే ధీమాలో కనిపించిన ధోని సేన ఒక్కసారిగా పట్టు కోల్పోయి మ్యాచ్ చేజార్చుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) బిస్లా (బి) చావ్లా 20; మెకల్లమ్ (ఎల్బీ) (బి) పఠాన్ 22; రైనా (ఎల్బీ) (బి) నరైన్ 28; డు ప్లెసిస్ (స్టంప్డ్) బిస్లా (బి) చావ్లా 14; ధోని (నాటౌట్) 35; బ్రేవో (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 157 వికెట్ల పతనం: 1-37; 2-49; 3-84; 4-86. బౌలింగ్: కమిన్స్ 4-0-49-0; ఉమేశ్ 4-0-43-0; చావ్లా 4-0-26-2; నరైన్ 4-0-9-1; పఠాన్ 3-0-16-1; రసెల్ 1-0-12-0 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: బిస్లా (సి) అశ్విన్ (బి) నెహ్రా 2; గంభీర్ (సి) బ్రేవో (బి) నెహ్రా 6; పాండే (సి) మోహిత్ (బి) నెహ్రా 0; పఠాన్ (సి) డు ప్లెసిస్ (బి) మోహిత్ 1; డస్కటే 51 (నాటౌట్); సూర్యకుమార్ (సి) అశ్విన్ (బి) జడేజా 19; రసెల్ (బి) నెహ్రా 58; కమిన్స్ (రనౌట్) 8; చావ్లా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 159 వికెట్ల పతనం: 1-9; 2-9; 3-10; 4-21; 5-51; 6-131; 7-155. బౌలింగ్: నెహ్రా 4-0-21-4; పాండే 4-0-31-0; మోహిత్ 3-0-31-0; జడేజా 2-0-25-1; అశ్విన్ 3-0-29-0; బ్రేవో 3-0-21-0.