వెల్లింగ్టన్:న్యూజిలాండ్ క్రికెటర్ గ్రాండ్‌హోమ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. వెస్టిండీస్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లో శతకం సాధించాడు. ఇది న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో రెండో వేగవంతమైన సెంచరీగా నమోదైంది. అంతకుముందు 2015- 16 సీజన్‌లో ఆసీస్ తో జరిగిన టెస్టులో బ్రెండన్ మెకల్లమ్ 54 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆ తరువాత ఆ దేశం తరపున టెస్టుల్లో గ్రాండ్‌హోమ్ తాజాగా సాధించిన సెంచరీనే వేగవంతమైందిగా రికార్డులకెక్కింది.
ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 127 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 447 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్(105; 74 బంతుల్లో11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించిన తరువాత ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment