పాకిస్తాన్ జట్టు
మౌంట్ మాంగనీ: వన్డే సిరీస్‌ను 0–5తో కోల్పోయిన పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. మూడో టి20లో పాక్ 18 పరుగులతో నెగ్గింది. ఈ విజయంతో పాక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను తిరిగి దక్కించుకుంది. తొలుత పాక్ 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్), అమీన్ (7 బంతు ల్లో 21; 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అనంతరం కివీస్ ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. షాదాబ్ ఖాన్ (2/19)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment