
భారత్‘ హ్యాట్రిక్’
వెస్టిండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్ విజయం దక్కించుకుంది. 2006, 2010ల్లో కరీబియన్లను ఓడించిన భారత్...
వెస్టిండీస్ గడ్డపై వరుసగా మూడో సిరీస్ విజయం
మూడో టెస్టులో 237 పరుగులతో కోహ్లిసేన గెలుపు
గ్రాస్ ఐలెట్: వెస్టిండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్ విజయం దక్కించుకుంది. 2006, 2010ల్లో కరీబియన్లను ఓడించిన భారత్... ప్రస్తుతం జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది. స్యామీ స్టేడియంలో శనివారం ముగిసిన మూడో టెస్టులో కోహ్లి సేన 237 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. 346 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్లు... రెండో ఇన్నింగ్స్‌లో 47.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటయ్యారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో ఏడు వికెట్లకు 217 పరుగులు చేసి డిక్లేర్ చేసింది రహానే (78 నాటౌట్), రోహిత్ (41) రాణించారు. నాలుగో టెస్టు 18 నుంచి జరుగుతుంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 353; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 225.
భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బ్రాత్‌వైట్ (బి) కమ్మిన్స్ 28; ధావన్ ఎల్బీడబ్ల్యు (బి) చేజ్ 26; కోహ్లి ఎల్బీడబ్ల్యు (బి) కమ్మిన్స్ 4; రహానే నాటౌట్ 78; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) కమ్మిన్స్ 41; సాహా (సి) డోరిచ్ (బి) కమ్మిన్స్ 14; జడేజా (సి) శామ్యూల్స్ (బి) కమ్మిన్స్ 16; అశ్విన్ (సి) బ్రాత్‌వైట్ (బి) కమ్మిన్స్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (48 ఓవర్లలో 7 వికెట్లకు డిక్లేర్డ్) 217. వికెట్ల పతనం: 1-49, 2-58, 3-72, 4-157, 5-181, 6-213, 7-217.
బౌలింగ్: గాబ్రియల్ 3-0-19-0; జోసెఫ్ 4-0-23-0; కమ్మిన్స్ 11-1-48-6; హోల్డర్ 9-1-50-0; చేజ్ 11-1-41-1; బ్రాత్‌వైట్ 10-1-33-0.
విండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ ఎల్బీడబ్ల్యు (బి) భువనేశ్వర్ 4; జాన్సన్ (సి) రోహిత్ (బి) షమీ 0; బ్రావో (సి) రోహిత్ (బి) షమీ 59; శామ్యూల్స్ (బి) ఇషాంత్ 12; చేజ్ (బి) ఇషాంత్ 10; బ్లాక్‌వుడ్ (స్టంప్డ్) సాహా (బి) జడేజా 1; డౌరిచ్ (సి) కోహ్లి (బి) షమీ 5; హోల్డర్ (రనౌట్) 1; జోసెఫ్ (సి) షమీ (బి) అశ్విన్ 0; కమ్మిన్స్ నాటౌట్ 2; గాబ్రియల్ (సి) భువనేశ్వర్ (బి) జడేజా 11; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (47.3 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1-4, 2-4, 3-35, 4-64, 5-68, 6-84, 7-88, 8-95, 9-95, 10-108.
బౌలింగ్: భువనేశ్వర్ 12-6-13-1; షమీ 11-2-15-3; ఇషాంత్ 7-0-30-2; అశ్విన్ 12-2-28-1; జడేజా 5.3-1-20-2.