
సన్‌రైజర్స్ ఘనవిజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. రైజర్స్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, విలియమ్సన్‌లు అర్ధసెంచరీలతో కదం తొక్కడంతో పంజాబ్ ముందు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది హైదరాబాద్. భారీ లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన పంజాబ్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్ష్(80, 47 బంతుల్లో రెండు సిక్సులు, 13 ఫోర్లు)తో రాణించాడు. దీంతో పంజాబ్ స్కోరు బోర్డు పెట్టింది. మ్యాక్స్‌వెల్ డకౌట్‌గా వెనుదిరిగినా.. ఆ వెంటనే వచ్చిన మోర్గాన్ మార్ష్ సహకారం అందించే ప్రయత్నం చేశాడు. రషీద్‌ఖాన్ కుదురుకుంటున్న ఈ జంటను విడదీశాడు.
మరో ఎండ్‌లో మార్ష్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఈ సమయంలో బంతి అందుకున్న భువనేశ్వర్ పదునైన బంతితో మార్ష్‌ను పెవిలియన్‌కు పంపాడు. రన్ రేట్ పెరిగిపోవడంతో మిగిలిన పంజాబ్ బ్యాట్స్‌మన్లు చేతులెత్తేశారు. పంజాబ్ బౌలర్లలో మాక్స్ వెల్ కు 2 వికెట్లు దక్కగా, మోహీత్ ఒక వికెట్ దక్కింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, సిద్దార్ధ్ కౌల్‌లు రెండు వికెట్లు పడగొట్టగా.. ఆశిష్ నెహ్రా, రషీద్‌ఖాన్‌లకు చెరో వికెట్ దక్కింది.