పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన పట్నా పైరేట్స్ మూడో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పట్నా 41–30తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 11, మన్‌జీత్ 10 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో వికాస్ కాలె (5 పాయింట్లు) సత్తా చాటడంతో పట్నా పైరేట్స్ సునాయాసంగా గెలుపొందింది. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున దీపక్ 7 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో సునీల్ (3 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 36–25తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్‌తో యు ముంబా తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment