భారత్‌ శుభారంభం | Rani Rampal-led India beat Uruguay to begin campaign | Sakshi
Sakshi News home page

భారత్‌ శుభారంభం

Published Mon, Apr 3 2017 1:51 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

Rani Rampal-led India beat Uruguay to begin campaign

వెస్ట్‌ వాంకోవర్‌ (కెనడా): మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ రౌండ్‌–2 టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఉరుగ్వే జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ పెనాల్టీ షూటౌట్‌లో 4–2తో విజయం సాధించింది. నిర్ణీత సమయం పూర్తయ్యాక రెండు జట్లు 2–2తో సమఉజ్జీగా నిలిచాయి. భారత్‌ తరఫున రాణి రాంపాల్‌ (6వ ని.లో), వందన కటారియా (49వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా...

ఉరుగ్వే జట్టుకు మరియా తెరిసా వియానా (45వ ని.లో), మనుయెలా విలార్‌ (54వ ని.లో) ఒక్కో గోల్‌ అందించారు. ఫలితం తేలడానికి షూటౌట్‌ను నిర్వహించగా... భారత్‌ తరఫున మోనిక, దీపిక, నవజ్యోత్‌ కౌర్, రాణి రాంపాల్‌ సఫలంకాగా... గుర్జీత్‌ కౌర్‌ విఫలమైంది. ఉరుగ్వే తరఫున మనుయెలా విలార్, మిలాగ్రోస్‌ గోల్స్‌ చేయగా... కాన్‌స్టాంజా, లూసియా, మాటిల్డి షాట్‌లను భారత గోల్‌కీపర్‌ సవిత నిలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement