బెయిర్‌స్టో విధ్వంసం..సిరీస్‌ ఇంగ్లండ్‌ కైవసం | England Won By Odi series Against New Zealand  | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 10 2018 11:03 AM | Last Updated on Sat, Mar 10 2018 11:03 AM

England Won By Odi series Against New Zealand  - Sakshi

బెయిర్‌ స్టో

సాక్షి, స్పోర్ట్స్‌ : న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 3-2తో సిరీస్‌ను ఇంగ్లండ్‌  కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 223 పరుగులకు కుప్పకూలింది. కివీస్‌ బ్యాట్స్‌మన్‌లలో సాంట్నర్‌(67), నికోలస్‌(55) తప్ప మిగిలిన ఆటగాళ్లు నిరాశపర్చడంతో స్పల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెయిర్‌స్టో విధ్వంసానికి 32.4 ఓవర్లలోని విజయాన్ని అందుకుంది. 58 బంతుల్లోనే సెంచరీ సాధించిన బెయిర్‌స్టో వేగంగా శతకం బాదిన మూడో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేశాడు.

పాకిస్తాన్‌పై బట్లర్‌ 46 బంతుల్లో శతకం బాదగా.. మొయిన్‌ అలీ వెస్టిండీస్‌పై 53 బంతుల్లో సెంచరీ సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బెయిర్‌స్టో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేసి హిట్‌ వికెట్‌ అయ్యాడు.

ఇంగ్లండ్‌ 229/3 (32.4)
న్యూజిలాండ్‌ 223 ఆలౌట్‌ 
 (49.5)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement