హోరాహోరీ.. పుణే గెలుపు
ఐపీఎల్-10 సీజన్‌ను పుణే సూపర్ జెయింట్స్ ఘనవిజయంతో ప్రారంభించింది. టాస్ గెలిచిన పుణే బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 184/8 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మన్లలో హర్ధిక్ పాండ్యా 20వ ఓవర్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన పుణే ఆది నుంచి లక్ష్యం దిశగా సాగింది.
పుణే ఓపెనర్ అజింక్యా రహానే 60(34) సమయోచిత ఇన్నింగ్స్‌కు తోడు స్టీవ్ స్మిత్ 84(51) నాటౌట్ కెప్టెన్ ఇన్నింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇన్నింగ్స్ మరో బంతి మిగిలివుండగానే 187/3తో గెలుపొందింది. పుణే బౌలర్లలో ఇమ్రాన్ తహీర్‌కు మూడు వికెట్లు దక్కగా, రజత్ భాటియాకు రెండు వికెట్లు దక్కాయి. ముంబై బౌలర్లలో టిమ్ సౌథీ, హర్ధిక పాండ్యా, మిచెల్ మెక్‌క్లెనాగన్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.