IPL 10
-
పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి
సునీల్ గావస్కర్ సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ జట్టు గత మ్యాచ్‌లో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొంది. పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు చివరి స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లను మిగతా జట్లు ఓడిస్తాయని భావించవచ్చు. అయితే ఈ పొట్టి ఫార్మాట్లో ఏదైనా జరిగే అవకాశముంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న జట్లు తమదైన రోజున ఎంతటి మేటి జట్లనైనా మట్టి కరిపిస్తాయి. ఎట్టకేలకు ఏడో మ్యాచ్‌లో గెలిచి బోణీ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరిన్ని విజయాలపై దృష్టి పెడుతుంది. అయితే బెంగళూరు బౌలర్లలో యజువేంద్ర చహల్ మినహా మిగతా బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. వారు తమ పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. తమ స్థానం సుస్థిరంగా ఉందని ఆ జట్టులోని కొందరు భావిస్తున్నారు. ఐపీఎల్ ప్రదర్శన జాతీయ జట్టు ఎంపికలో లెక్కలోకి తీసుకోబోరని తెలుసుకాబట్టి వారి ఆటలోనూ పురోగతి కనిపించడం లేదు. గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమిని మర్చిపోయి మళ్లీ విజయాలబాట పట్టాలని ముంబై ఇండియన్స్ పట్టుదలగా ఉంది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను హార్దిక్ పాండ్యాకు ఇచ్చి కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని పొరపాటు చేశాడు. హార్దిక్ పాండ్యాకు మధ్య ఓవర్లలో బౌలింగ్ ఇస్తే సబబుగా ఉండేది. తొలి విజయాన్ని ఆస్వాదించిన బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లోనూ అలాంటి ఫలితమే రుచి చూడాలని అనుకుంటుందనడంలో సందేహం లేదు. -
సమష్టి మంత్రమే ఆయుధంగా...
♦ ముంబై ఇండియన్స్ విజయ రహస్యం ♦ వ్యూహాత్మక ఆటతీరుతో అనుకున్న ఫలితం ♦ అన్ని విభాగాల్లో సమతూకం ‘వ్యక్తిగత ప్రదర్శన ఒక్కోసారి మ్యాచ్‌లను గెలిపిస్తుందేమో కానీ... ఆటగాళ్ల సమష్టి కృషితోనే చాంపియన్లుగా ఎదుగుతాం’ ఐపీఎల్ పదో సీజన్ టైటిల్‌ను గెలిచిన అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. నిజానికి ప్రారంభం నుంచి ముంబై ప్రదర్శన గమనిస్తే ఇది వాస్తవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన టాప్–5 ఆటగాళ్లలో ఒక్కరు కూడా ముంబై బ్యాట్స్‌మన్ లేడు. అంతా కలిసికట్టుగా రాణించి తమ జట్టును విజేతగా నిలపగలిగారు. సాక్షి క్రీడా విభాగం : ముంబై ఇండియన్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్లో విజేతగా నిలిచింది. అయితే 2013, 2015లో సాధించిన టైటిళ్లకన్నా ఈసారి వీరి ప్రస్థానం ప్రత్యేకమైందిగా చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడకుండా జట్టు అందరికన్నా మిన్నగా దూసుకెళ్లింది. కీలక సమయంలో తలా ఓ చేయి వేసి జట్టును సమున్నత స్థాయిలో నిలిపారు. దీనికి అన్ని విభాగాల్లో సమతూకంతో ఉన్న జట్టు బాగా ఉపయోగపడింది. చక్కటి కాంబినేషన్‌తో టోర్నీ ఆసాంతం ముంబై అదరగొట్టింది. ఆఖరికి రిజర్వ్ బలం కూడా తమకు అందిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోగలిగింది. ఇంతకుముందు సాధించిన రెండు టైటిళ్లలో కచ్చితంగా ఒక్క బ్యాట్స్‌మన్ అయినా టాప్–5 పరుగుల జాబితాలో ఉన్నాడు. ఈసారి మాత్రం వీరిలో ఎవరికీ చోటు దక్కలేదు. అయితేనేం జట్టుకు కావల్సిన విలువైన పరుగులు అందిస్తూ చాంపియన్‌గా నిలపగలిగారు. ఒక్కో సందర్భంలో ఒక్కో ఆటగాడు బాధ్యత తీసుకుని అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ కావచ్చు ప్రత్యర్థిని మట్టికరిపించేందుకు ఉపయోగపడ్డారు. ఫైనల్ మ్యాచ్‌లో 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం ఏ జట్టుకైనా చాలా కష్టం. ముఖ్యంగా ఇలాంటి మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యం. ఓ రెండు క్యాచ్‌లు మిస్ అయినా చివరకు మేజిక్ ఆటతో పుణేను వణికించారు. ఓవరాల్‌గా బ్యాటింగ్‌లో నితీశ్ రాణా, పార్థివ్ పటేల్, పొలార్డ్, రోహిత్ శర్మ, జోస్ బట్లర్... బౌలింగ్‌లో బుమ్రా, మెక్లీనగన్, కరణ్ శర్మ, మలింగ ఆకట్టుకోగా... పాండ్యా బ్రదర్స్ హార్దిక్, కృనాల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై విజయాల్లో ముఖ్యపాత్ర పోషించారు. మైదానంలో ఆటగాళ్లు కష్టపడగా... తెర వెనుక ఉన్న హెడ్ కోచ్ మహేల జయవర్ధనే, బ్యాటింగ్ కోచ్ రాబిన్ సింగ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ముంబై సక్సెస్‌లో తమవంతు పాత్ర పోషించారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మెంటార్ రూపంలో ముంబై ఇండియన్స్ శిబిరంలో ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చింది. రోహిత్ కెప్టెన్సీ అదుర్స్... ఓవరాల్‌గా జట్టును మూడోసారి చాంపియన్‌గా నిలపడంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లను ప్రేరేపించిన విధానం ప్రశంసనీయం. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో అతని చొరవ ఆటగాళ్లను ఉత్తేజపరిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు కనీసం 160 పరుగులైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మ్యాచ్ ఆరంభం నుంచే ముంబై టపటపా వికెట్లు కోల్పోయి కేవలం 129 పరుగులకే పరిమితం కావడంతో ఓరకమైన నిర్వేదం కనిపించింది. కచ్చితంగా ఓటమి ఖాయమే అనే అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. అయితే సారథి రోహిత్ మాత్రం దీన్ని ఓ సవాల్‌గా స్వీకరించాడు. బరిలోకి దిగడానికి ముందే ఆటగాళ్లలో విశ్వాసం నింపాడు. ‘రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో భీకర ఫామ్‌లో ఉన్న కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కేవలం 107 పరుగులకే ఆలౌట్ చేసిన విషయం గుర్తుంచుకోండి. అదే ఇక్కడా ఎందుకు పునరావృతం కాకూడదు? ప్రత్యర్థిపై మనకు పేలవ రికార్డు ఉన్నప్పటికీ ఆ విషయం మరిచిపోండి’ అని వారికి ప్రేరణ ఇచ్చాడు. ఇక బరిలోకి దిగాక తన వ్యూహాలకు పదునుపెడుతూ ముందుగా పరుగులను నియంత్రించేందుకు స్పిన్నర్లు కరణ్ శర్మ, కృనాల్ పాండ్యాలతో బౌలింగ్ వేయించాడు. ఈ వ్యూహం ఫలితాన్నిచ్చి పుణే పరుగుల తీసేందుకు తెగ ఇబ్బంది పడింది. అటు బుమ్రా, మలింగ, జాన్సన్ కూడా జత కలవడంతో వారికి దిక్కు తోచలేదు. ముఖ్యంగా చివరి ఓవర్లో జాన్సన్ రెండు వికెట్లు పడగొట్టి పుణేకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. దీంతో సునాయాసంగా నెగ్గుతుందని భావించిన పుణే భంగపడగా.. ఆఖరి బంతి వరకు ముంబై బౌలర్లు పోరాడి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. -
ముంబై స్కోరు 129...టీవీ కట్టేసిన అమితాబ్
ముంబై: ఆయన ఓ బాలీవుడ్ సూపర్‌స్టార్. భారత క్రికెట్‌కు ‘బిగ్’ ఫ్యాన్. ఐపీఎల్లో మాత్రం ముంబై ఇండియన్స్ వీరాభిమాని. కానీ ఆదివారం ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేసిన స్కోరుతో తన అభిమాన జట్టు ఓడిపోతుందని నిరాశగా టీవీ కట్టేశారు. కానీ తన కుమారుడు ఫోన్ చేసి ముంబై గెలించిందనేసరికి ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. ఆయనే బాలీవుడ్ ‘బిగ్–బి’ అమితాబ్ బచ్చన్. ముంబై 20 ఓవర్లలో చేసిన 129 పరుగుల స్కోరు సీనియర్ బచ్చన్‌కు రుచించలేదు. అందుకే ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత కట్టేసిన టీవీవైపు మళ్లీ కన్నెత్తి చూడలేదు. కానీ అభిషేక్ బచ్చన్ సమాచారంతో సంతోషించిన ఆయన ట్విట్టర్లో ఆ అనుభూతిని డైలాగ్‌తో పంచుకున్నారు. ‘తుమ్ అపున్ కో దస్ మారా. అపున్ ఏక్ మారా... పర్ సాలిడ్ మారా’ (మీరు మమ్మల్ని పదిసార్లు కొట్టారు. కానీ మేం ఒక్కసారే మిమ్మల్ని కొట్టాం. అదరగొట్టాం) అని పోస్ట్ చేశారు అమితాబ్. -
ఐపీఎల్–10 విజేత ముంబై ఇండియన్స్
-
ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర
-
రెండో ఇన్నింగ్స్ సంతృప్తికరం
⇔ మనస్సుకు నచ్చిన పనులు చేస్తున్నాను ⇔ ఐపీఎల్‌తో యువ క్రికెటర్లకు మేలు ⇔ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కే అవకాశం ⇔ ‘సచిన్’ సినిమాలో అన్ని విషయాలను పంచుకున్నాను ⇔ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మనోగతం సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి నాలుగేళ్లు దాటినా... భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మనసు నుంచి ఈ ఆట మాత్రం దూరం కాలేదు. ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తూనే మరోవైపు తన జీవిత చరిత్రపై వర్ధమాన క్రీడాకారులకు, యువతకు ప్రేరణగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా ఈనెల 26న ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ పేరిట ఆయన బయోపిక్ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చారిటీలతో పాటు మనసుకు నచ్చిన పనులు చేస్తూ సంతృప్తికరంగా ఉన్నానని చెప్పారు. ఐపీఎల్–10 ఫైనల్ సందర్భంగా ముంబై ఇండియన్స్ జట్టు మెంటార్‌గా హైదరాబాద్‌కు వచ్చిన సచిన్ తన సినిమా విశేషాలతో పాటు చాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రదర్శన, ఐపీఎల్లో యువ ఆటగాళ్ల రాణింపు గురించి కూడా వివరంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... తొలి ఇన్నింగ్స్ మైదానంలోనే... నా జీవితంలో ఓ అధ్యాయమంతా క్రికెట్ మైదానంలోనే గడిచిపోయింది. ప్రత్యర్థి విధించిన లక్ష్యాలను ఛేదిస్తూ ఉండిపోయాను. అయితే నా రెండో ఇన్నింగ్స్ మాత్రం సంతృప్తికి సంబంధించినదిగా భావిస్తున్నాను. జీవితంలో ఏంచేసినా ఓ లక్ష్యమంటూ ఉండాలి. అదే మనకు సంతృప్తినిస్తుంది. యువీ, రైనా కలిస్తే రిషభ్... ఐపీఎల్లో రిషభ్ పంత్ ఆటను గమనించాను. అద్భుతంగా ఆడుతున్నాడు. నాకైతే యువరాజ్ సింగ్, సురేశ్ రైనా కలిస్తే రిషభ్ పంతేమో అనిపిస్తుంది. తండ్రి చనిపోయిన కఠిన పరిస్థితిలోనూ రిషభ్ పంత్ మెరుగ్గా ఆడగలిగాడు. ఇలాంటి అనుభవమే నాకు 1999 ప్రపంచకప్ సమయంలో ఎదురైంది. థంపి, సిరాజ్ సూపర్... భవిష్యత్ భారత బౌలింగ్‌కు ఢోకా లేదేమో అనిపిస్తోంది. ఐపీఎల్–10లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, కేరళ బౌలర్ బాసిల్ థంపి అంతలా నన్ను ఆకట్టుకున్నారు. రైజింగ్ పుణే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు కొట్టిన ఓ కవర్‌డ్రైవ్.. వీరేంద్ర సెహ్వాగ్‌ను తలపించింది. అయితే ఫుట్‌వర్క్ మెరుగుపడాల్సి ఉంది. ‘చాంపియన్స్’లో ధోని కీలకం ... చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఎంఎస్ ధోని అనుభవం జట్టుకు కీలకంగా మారనుంది. ఇంగ్లండ్ పరిస్థితులపై అతడికి అవగాహన ఉంది. ఇక తను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనేది టీమ్ మేనేజిమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. నేను నటించను అన్నాను... నా జీవితంపై సినిమా అనేసరికి ముందుగా నిర్మాత రవికి నటించడం నా వల్ల కాదు అని స్పష్టం చేశాను. ఇతర ఆటగాళ్లపై వచ్చినట్టుగానే నాపై కూడా ఓ సినిమా రావాలనేది ఆయన అభిప్రాయం. అయితే దీనికి అంగీకరించేందుకు కాస్త సమయం తీసుకున్నాను. ఎందుకంటే ఊహాత్మక కల్పన అనేది ఇక్కడ కుదరదు. నా జీవితం తెరిచిన పుస్తకం. అయితే అన్నీ నిజ జీవిత ఫుటేజి నుంచి, అరుదైన ఫొటోలతో పాటు నా ఇంటర్వూ్యల ద్వారా చిత్రీకరించాం. వాటిలో కొన్నింటిని అభిమానులు ఇప్పటిదాకా చూడలేదు. ఒడిదుడుకులూ ఉన్నాయి... అందరిలాగే నా కెరీర్లోనూ ఒడిదుడుకులు ఉన్నాయి. ఇక 2000లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం గురించి నాకు ఎంతవరకు తెలుసో, నేనేం చెప్పానో ఈ సినిమాలో చూడవచ్చు. అపజయాల్లో ఉన్నప్పుడు నా మనోస్థితి ఎలా ఉండేదో కూడా చెప్పాను. ఎయిర్‌ఫోర్స్ అధికారులకు ప్రత్యేక ప్రదర్శన ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ సినిమాను విడుదలకు ముందే శనివారం రాత్రి భారత ఆర్మీ అధికారుల కోసం సచిన్ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. భారత వాయు సేన (ఐఏఓఫ్)లో సచిన్ గౌరవనీయ గ్రూప్ కెప్టెన్ హోదాలో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాను తిలకించిన వారిలో ఎయిర్‌చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతోపాటు ఆర్మీ, నావికాదళం అధికారులు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సచిన్ భార్య అంజలి కూడా వీరితో పాటు సినిమా తిలకించారు. సినిమా చూస్తున్నంతసేపు వారంతా ‘సచిన్... సచిన్’ అని అరవడంతో పాటు ముగిశాక లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. ఈసందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా.. సచిన్‌కు జ్ఞాపికను అందించారు. ‘సినిమా చిత్రీకరణ అనంతరం మొదటగా భారత త్రివిధ దళాల అధికారులకు చూపించాలని అనుకున్నాను. అలాగే ఈ దేశ రక్షణ కోసం మీరు అందిస్తున్న సేవలకు వంద కోట్లకు పైగా ఉన్న భారతీయుల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని సచిన్ తెలిపారు. -
ముంబై మహాన్
♦ ఐపీఎల్–10 విజేత ముంబై ఇండియన్స్ ♦ మూడోసారి టైటిల్ సాధించిన రోహిత్ సేన ♦ ఫైనల్లో పరుగు తేడాతో పుణేపై అద్భుత విజయం ♦ కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన ♦ స్మిత్ పోరాటం వృథా డ్రామా... చివరి బంతి వరకు డ్రామా... తక్కువ స్కోర్ల మ్యాచే అయినా ఐపీఎల్ ఫైనల్ అంటే ఎంత ఉత్కంఠగా సాగాలో అలాగే సాగింది. అనూహ్య రీతిలో మలుపులు తిరిగి ఆటను చివరి క్షణం వరకు రక్తి కట్టించింది. ఈ అద్భుత పోరులో చివరకు ముంబై అనుభవం గెలిచింది. ఒకే ఒక్క పరుగుతో ఆ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు అవసరం. తొలి బంతిని మనోజ్ తివారీ చక్కటి ఫోర్‌గా మలిచాడు. అయితే తర్వాతి రెండు బంతుల్లో తివారీ, స్మిత్‌లను అవుట్ చేసిన జాన్సన్ మ్యాచ్‌ను ముంబై చేతుల్లోకి తెచ్చాడు. చివరి 3 బంతుల్లో 5 పరుగులు చేసినా పుణేకు ఓటమి తప్పలేదు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా, మూడో పరుగు తీసే ప్రయత్నంలో సుచిత్ త్రోకు క్రిస్టియాన్ అవుటయ్యాడు. పాపం రైజింగ్ పుణే సూపర్ జెయింట్... అతి జాగ్రత్త జట్టు కొంప ముంచింది. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని 129 పరుగులకే పరిమితం చేయగలిగినా... టి20 తరహా దూకుడు ఎక్కడా చూపించకుండా ఒత్తిడి పెంచుకుంది. 20 ఓవర్లలో ఏ దశలోనూ జట్టు రన్‌రేట్ కనీసం 7 పరుగులు దాటలేదు. చివరి వరకు నిలిచి విజయం వైపు నడిపించగలడని నమ్మిన స్టీవ్ స్మిత్ చివరకు ఈ పాపంలో భాగమయ్యాడు. సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్–2017 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ముంబై ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. తక్కువ స్కోరే అయినా పట్టుదలగా ఆడిన రోహిత్ సేన ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (38 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ రోహిత్ శర్మ (22 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం పుణే సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (50 బంతుల్లో 51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు లభించింది. కీలక భాగస్వామ్యం... ఆరంభంలో ముంబై ఇండియన్స్ ప్రదర్శన గత మ్యాచ్‌లో కోల్‌కతా ఆటను తలపించింది. పుణే పదునైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కాగా, చివర్లో కృనాల్ ఇన్నింగ్స్ ఆ జట్టును నిలబెట్టింది. ఐపీఎల్ ఫైనల్లో 31వ బంతికి గానీ తొలి ఫోర్ రాలేదు... ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మందగమనానికి ఇది ఉదాహరణ. తొలి రెండు ఓవర్లలో 7 పరుగులే రాగా... మూడో ఓవర్లో ఉనాద్కట్ రెండు వికెట్లతో దెబ్బ తీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి పార్థివ్ (4) అవుట్ కాగా, అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో సిమన్స్ (3) ఆటను ఉనాద్కట్ ముగించాడు. తొలి 5 ఓవర్లలో 16 పరుగులే చేయగలిగిన ముంబై, ఆరో ఓవర్లో మరో 16 పరుగులతో పవర్‌ప్లేను 32 పరుగులతో ముగించింది. ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో రోహిత్ నాలుగు ఫోర్లు బాదడం విశేషం. అయితే ఈ జోరు ఎంతో సేపు నిలవలేదు. స్మిత్ చక్కటి త్రోకు అంబటి రాయుడు (12) రనౌట్ కాగా, జంపా ఒకే ఓవర్లో రోహిత్, పొలార్డ్ (7) వికెట్లు తీశాడు. శార్దుల్ ఠాకూర్ సమయస్ఫూర్తితో బౌండరీ వద్ద క్యాచ్ పట్టి రోహిత్‌ను వెనక్కి పంపగా, జంపా బౌలింగ్‌లో తివారీ చేతికి పొలార్డ్ చిక్కాడు. క్రిస్టియాన్ బంతికి హార్దిక్ పాండ్యా (10) అవుట్ కాగా, అతని అద్భుత ఫీల్డింగ్‌కు కరణ్ శర్మ (1) రనౌటయ్యాడు. ఈ దశలో కృనాల్, జాన్సన్ జోడి ముంబైని ఆదుకుంది. ఫలితంగా చివరి మూడు ఓవర్లలో జట్టు 37 పరుగులు సాధించింది. క్రిస్టియాన్ వేసిన చివరి ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన కృనాల్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. కృనాల్, జాన్సన్ ఎనిమిదో వికెట్‌కు 36 బంతుల్లో 50 పరుగులు జోడించారు. అతి జాగ్రత్త... పుణే ఇన్నింగ్స్ కూడా నెమ్మదిగానే ప్రారంభమైంది. రాహుల్ త్రిపాఠి (3)ని బుమ్రా అవుట్ చేయగా... రహానే, స్మిత్ కలిసి జాగ్రత్తగా ఆడారు. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోలేదు. మధ్యలో రహానే కొన్ని చక్కటి షాట్లు ఆడినా... స్మిత్ తన 23వ బంతికి గానీ తొలి బౌండరీ కొట్టలేదు. అయితే 14 పరుగుల వద్ద రహానే ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కృనాల్ వదిలేయడం పుణేకు కలిసొచ్చింది. అయితే ఈ భాగస్వామ్యం మాత్రం మరీ నెమ్మదిగా సాగింది. చివరకు 57 బంతుల్లో 54 పరుగులు జోడించిన తర్వాత రహానేను అవుట్ చేసి జాన్సన్ ఈ జోడీని విడదీశాడు.ఆ తర్వాతి ముంబైకి ఒక్కసారిగా పట్టు చిక్కింది. ధోని (10), తివారి (7) విఫలం కావడంతో ఒత్తిడి పెరిగిపోయింది. చివరి వరకు ఒంటరిగా పోరాడిన స్మిత్ జట్టును గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమన్స్ (సి అండ్ బి) ఉనాద్కట్ 3; పార్థివ్ పటేల్ (సి) శార్దుల్ (బి) ఉనాద్కట్ 4; రాయుడు రనౌట్ 12; రోహిత్ శర్మ (సి) శార్దుల్ (బి) జంపా 24; కృనాల్ పాండ్యా (సి) రహానే (బి) క్రిస్టియాన్ 47; పొలార్డ్ (సి) తివారీ (బి) జంపా 7; హార్దిక్ పాండ్యా ఎల్బీడబ్ల్యూ (బి) క్రిస్టియాన్ 10; కరణ్ శర్మ రనౌట్ 1; జాన్సన్ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1–7, 2–8, 3–41, 4–56, 5–65, 6–78, 7–79, 8–129. బౌలింగ్: ఉనాద్కట్ 4–0–19–2, వాషింగ్టన్ సుందర్ 4–0–13–0, శార్దుల్ ఠాకూర్ 2–0–7–0, ఫెర్గూసన్ 2–0–21–0, జంపా 4–0–32–2, క్రిస్టియాన్ 4–0–34–2. రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) పొలార్డ్ (బి) జాన్సన్ 44; రాహుల్ త్రిపాఠి ఎల్బీడబ్ల్యూ (బి) బుమ్రా 3; స్మిత్ (సి) రాయుడు (బి) జాన్సన్ 51; ధోని (సి) పార్థివ్ పటేల్ (బి) బుమ్రా 10; మనోజ్ తివారీ (సి) పొలార్డ్ (బి) జాన్సన్ 7; క్రిస్టియాన్ రనౌట్ 4; సుందర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–17, 2–71, 3–98, 4–123, 5–123, 6–128. బౌలింగ్: కృనాల్ 4–0–31–0, జాన్సన్ 4–0–26–3, బుమ్రా 4–0–26–2, మలింగ 4–0–21–0, కరణ్ శర్మ 4–0–18–0. ఐపీఎల్–10 అవార్డీలు అరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు; రూ.10 లక్షలు): వార్నర్ (641 పరుగులు; హైదరాబాద్) పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు; రూ.10 లక్షలు): భువనేశ్వర్ (26 వికెట్లు; హైదరాబాద్) ఫర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ (రూ.10 లక్షలు): సురేశ్ రైనా ఎమర్జింగ్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): బాసిల్ థంపీ ఫెయిర్ ప్లే అవార్డు : గుజరాత్ లయన్స్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): బెన్ స్టోక్స్ రన్నరప్ (రూ. 10 కోట్లు): రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ విన్నర్ (రూ. 15 కోట్లు): ముంబై ఇండియన్స్ -
దస్ కా చార్
-
ఐపీఎల్ ఉన్నంత కాలం ఈ రికార్డు పదిలం!
కాన్పూర్: ఐపీఎల్–2017లో భాగంగా గుజరాత్ లయన్స్‌పై నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. నిన్న (శనివారం) జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌ను చిత్తుగా ఓడించి అరుదైన రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్లో తలపడ్డ ప్రతీసారి ఓ ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించిన తొలి జట్టుగా డేవిడ్ వార్నర్ సేన చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ ఐదుసార్లు గుజరాత్‌తో తలపడ్డ సన్‌రైజర్స్ కు ఒక్క ఓటమి లేకపోవడం విశేషం. శనివారం మ్యాచ్‌తో గుజరాత్‌పై తమ గెలుపోటముల రికార్డును 5-0తో మెరుగు పరుచుకుంది. కాగా, 2016లో కొత్త జట్లుగా గుజరాత్, పుణే జట్లు వచ్చాయి. ఆ సీజన్లో మూడుసార్లు తలపడగా అన్ని పర్యాయాలు హైదరాబాద్‌నే విజయం వరించింది. ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు నెగ్గింది. శనివారంతో గుజరాత్ కథ ముగిసింది. వచ్చే సీజన్లో గుజరాత్, పుణే జట్లు కనిపించవన్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ లయన్స్ చేతిలో ఏ విధంగానూ సన్ రైజర్స్ ఓటమి చవిచూసే అవకాశం లేదు. బహుశా ఇలాంటి రికార్డు ఏ జట్టుకు సాధ్యమయ్యే అవకాశం లేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు సీజన్లలో కలిపి మొత్తం 30 మ్యాచ్‌లు ఆడిన లయన్స్ 13 గెలిచి 16 ఓడగా, మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 2016లో 9 మ్యాచ్‌లు గెలిచి నంబర్‌వన్‌గా ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన లయన్స్... ఈసారి కేవలం 4 విజయాలు సాధించి ఏడో స్థానంతో ముగించింది. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ 19.2 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ కాగా, కెప్టెన్ డేవిడ్ వార్నర్ (52 బంతుల్లో 69 నాటౌట్; 9 ఫోర్లు), విజయ్ శంకర్ (44 బంతుల్లో 63 నాటౌట్; 9 ఫోర్లు) రాణించడంతో 18.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్ బౌలర్ సిరాజ్ (4/32) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. -
ముంబైదే టాప్
-
ముంబైదే టాప్
-
‘ఆరెంజ్’ అడుగు పడింది
♦ ప్లే ఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్l ♦ చివరి మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై 8 వికెట్లతో ఘన విజయం l ♦ సిరాజ్‌కు 4 వికెట్లు ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ దీటుగా నిలబడింది. ట్రోఫీని నిలబెట్టుకునే క్రమంలో తొలి దశను విజయవంతంగా అధిగమించింది. ముందుకు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగింది. ఇతర జట్ల ప్రదర్శన, సమీకరణాలను పట్టించుకోవాల్సిన అవసరం రాకుండా తమ సత్తాను నమ్ముకొని సగర్వంగా ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి ముందంజ వేసిన ‘ఆరెంజ్ ఆర్మీ’ మరో టైటిల్ వేటలో తానూ ఉన్నానని తమ బలమైన ఆటతో సంకేతాలు ఇచ్చింది. గుజరాత్ స్కోరు ఒక దశలో 111/0... కానీ కేవలం 43 పరుగులకే ఆ జట్టు 10 వికెట్లూ కోల్పోయి బేలగా నిలబడిపోయింది. దూసుకుపోతున్న ప్రత్యర్థిని రైజర్స్ బౌలర్లు సిరాజ్, రషీద్ ఖాన్ పదునైన బంతులతో కుప్పకూల్చారు. గ్రీన్పార్క్లాంటి చిన్న మైదానంలో ఈ సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో హైదరాబాద్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. వార్నర్ తన భీకర ఫామ్‌ను కొనసాగించగా, అంది వచ్చిన అవకాశాన్ని విజయ్ శంకర్ ఉపయోగించుకోవడంతో లయన్స్ అవమాన భారంతో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పింది. కాన్పూర్: ఐపీఎల్–2017లో ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌ను చిత్తుగా ఓడించి ముందంజ వేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.2 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), డ్వేన్ స్మిత్ (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 65 బంతుల్లోనే 111 పరుగులు జోడించారు. హైదరాబాద్ బౌలర్లు సిరాజ్ (4/32), రషీద్ (3/34), భువనేశ్వర్ (2/25) చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. తొలి పది ఓవర్లలో మొదటిసారి వికెట్ తీయలేకపోయిన రైజర్స్, తర్వాత పది ఓవర్లలో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం విశేషం. అనంతరం సన్ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు సాధించింది. వార్నర్ (52 బంతుల్లో 69 నాటౌట్; 9 ఫోర్లు), విజయ్ శంకర్ (44 బంతుల్లో 63 నాటౌట్; 9 ఫోర్లు) మూడో వికెట్‌కు 91 బంతుల్లో అభేద్యంగా 133 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. 4 వికెట్లతో చెలరేగిన మొహమ్మద్ సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్లో గుజరాత్‌తో ఆడిన 5 మ్యాచ్‌లు కూడా రైజర్స్ గెలిచింది. భారీ భాగస్వామ్యం నుంచి... గుజరాత్‌కు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే ఆ జట్టు కనీసం 200 పరుగులు చేస్తుందేమో అనిపించింది. ఓపెనర్లు స్మిత్, ఇషాన్ పోటీ పడి ధాటిగా పరుగులు సాధించారు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 11 పరుగులు రాగా, తర్వాతి రెండు ఓవర్లలో ఇషాన్ 2 సిక్సర్లు, ఫోర్ కొట్టడంతో మరో 22 పరుగులు లభించాయి. నబీ వేసిన నాలుగో ఓవర్లో 2 పరుగులే వచ్చినా... ఆ తర్వాత కూడా లయన్స్ జోరు తగ్గలేదు. తర్వాతి మూడు ఓవర్లలో ఆ జట్టు 4 ఫోర్లు, 2 సిక్సర్లతో మొత్తం 38 పరుగులు రాబట్టింది. రషీద్ తొలి ఓవర్లో కూడా గుజరాత్ 17 పరుగులు సాధించగా, ఇషాన్ 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో వరుసగా బౌండరీలు సాధించిన స్మిత్ 31 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఈ జోడి 57 బంతుల్లోనే 100 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు 11వ ఓవర్లో ఈ భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత సిరాజ్, రషీద్ వేసిన ఓవర్లు ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పాయి. ముందుగా సిరాజ్ తన మూడో బంతికి ఇషాన్‌ను అవుట్ చేసి, చివరి బంతికి రైనా (2) వికెట్ కూడా తీశాడు. తర్వాతి ఓవర్లోనే రషీద్... దినేశ్ కార్తీక్ (0), ఫించ్ (2)లను అవుట్ చేయడంతో గుజరాత్ పరిస్థితి దిగజారింది. 19 బంతుల వ్యవధిలో 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన లయన్స్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఫాల్క్‌నర్ (8), సాంగ్వాన్ (0)లను వరుస బంతుల్లో సిరాజ్ వెనక్కి పంపగా... రవీంద్ర జడేజా (14 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) కొంత పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. కీలక అర్ధ సెంచరీలు... ఛేదనలో సన్‌రైజర్స్ మొదట్లో కాస్త తడబాటుకు గురైంది. సాంగ్వాన్ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు బౌండరీలు కొట్టిన ధావన్ (11 బంతుల్లో 18; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ప్రవీణ్ కుమార్ ఒకే ఓవర్లో ధావన్, హెన్రిక్స్ (4)లను అవుట్ చేయడం గుజరాత్‌కు ఆనందాన్నిచ్చింది. పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 47 పరుగులు చేసింది. ఈ దశలో వార్నర్ తన సహజశైలికి భిన్నంగా సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించగా, విజయ్ శంకర్ తొలిసారి సీజన్లో తన ముద్ర చూపించాడు. వార్నర్ 29 పరుగుల వద్ద ఉన్న సమయంలో అంపైర్ నిర్ణయం రైజర్స్‌కు కలిసొచ్చింది. సోని బౌలింగ్‌లో వార్నర్ బ్యాట్‌ను తగిలి బంతి కీపర్ కార్తీక్ చేతుల్లో పడ్డా అంపైర్ దానిని సరిగా గుర్తించకుండా నాటౌట్‌గా ప్రకటించారు. దీంతో ముందుగా వార్నర్ 41 బంతుల్లో, విజయ్ శంకర్ 35 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి మలుపులు, సమస్య లేకుండా హైదరాబాద్ విజయం దిశగా వేగంగా దూసుకుపోయింది. 19వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టి వార్నర్ జట్టును ప్లే ఆఫ్‌కు చేర్చాడు. ముగిసిన గుజరాత్ ప్రస్థానం ఐపీఎల్లో రెండేళ్ల గుజరాత్ లయన్స్ ఆట శనివారంతో ముగిసింది. వచ్చే ఏడాది నుంచి రెండు పాత జట్లు తిరిగి వస్తాయని బీసీసీఐ అధికారికంగా ప్రకటించడంతో 2018 సీజన్ నుంచి ఈ జట్టు కనిపించదు. రెండు సీజన్లలో కలిపి మొత్తం 30 మ్యాచ్‌లు ఆడిన లయన్స్ 13 గెలిచి 16 ఓడగా, మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 2016లో 9 మ్యాచ్‌లు గెలిచి నంబర్‌వన్‌గా ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన లయన్స్... ఈసారి కేవలం 4 విజయాలు సాధించి ఏడో స్థానంతో ముగించింది. స్కోరు వివరాలు గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ ఎల్బీడబ్ల్యూ (బి) రషీద్ ఖాన్ 54; ఇషాన్ కిషన్ (సి) నమన్ ఓజా (బి) సిరాజ్ 61; రైనా (సి) ధావన్ (బి) సిరాజ్ 2; దినేశ్ కార్తీక్ (సి) హుడా (బి) రషీద్ ఖాన్ 0; ఫించ్ (బి) రషీద్ ఖాన్ 2; జడేజా నాటౌట్ 20; ఫాల్క్‌నర్ (బి) సిరాజ్ 8; సాంగ్వాన్ (బి) సిరాజ్ 0; అంకిత్ సోని (బి) సిద్ధార్థ్ కౌల్ 0; ప్రవీణ్ కుమార్ (బి) భువనేశ్వర్ 1; మునాఫ్ పటేల్ (బి) భువనేశ్వర్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 154. వికెట్ల పతనం: 1–111, 2–120, 3–120, 4–120, 5–123, 6–142, 7–142, 8–153, 9–154, 10–154. బౌలింగ్: భువనేశ్వర్ 3.2–0–25–2, మొహమ్మద్ సిరాజ్ 4–0–34–4, సిద్ధార్థ్ కౌల్ 4–0–30–1, నబీ 3–0–17–0, రషీద్ ఖాన్ 4–0–34–3, హెన్రిక్స్ 1–0–12–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ నాటౌట్ 69; ధావన్ (సి) ఫాల్క్‌నర్ (బి) ప్రవీణ్ కుమార్ 18; హెన్రిక్స్ (సి) దినేశ్ కార్తీక్ (బి) ప్రవీణ్ కుమార్ 4; విజయ్ శంకర్ నాటౌట్ 63; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–20, 2–25. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4–0–22–2, సాంగ్వాన్ 4–0–37–0, ఫాల్క్‌నర్ 2–0–24–0, మునాఫ్ పటేల్ 3–0–22–0, రవీంద్ర జడేజా 3–0–19–0, అంకిత్ సోని 2.1–0–31–0. -
ముంబైదే టాప్
♦ కోల్‌కతాపై 9 పరుగులతో గెలుపు ♦ రాణించిన రాయుడు ఇప్పటికే ‘ప్లే–ఆఫ్’కు చేరిన ముంబై కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రిజర్వ్ సత్తా చాటింది. కోల్‌కతాను వారి సొంతగడ్డపై ఓడించి లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది. అయితే మెరుగైన రన్‌రేట్‌తో కోల్‌కతా కూడా ప్లే ఆఫ్‌కు చేరింది. ఇపుడిక మిగిలిన ఒక బెర్త్ కోసం రైజింగ్ పుణే, పంజాబ్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్‌కు చేరుతుంది. కోల్‌కతా: ఐపీఎల్లో ముంబై టాప్ లేపింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. వచ్చిన ‘ఒక్క’ అవకాశాన్ని అర్ధ సెంచరీగా మలిచిన సౌరభ్ తివారి (43 బంతుల్లో 52; 9 ఫోర్లు), గాయం నుంచి కోలుకున్న అంబటి రాయుడు (37 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేయగలిగింది. మనీశ్ పాండే (33 బంతుల్లో 33; 2 ఫోర్లు), గ్రాండ్ హోమ్ (16 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. రాయుడుకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ టి20ల్లో 100వ విజయం నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 2012 తర్వాత సొంత మైదానంలో కోల్‌కతా ఛేజింగ్ చేస్తూ ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాయుడు, తివారి ఫిఫ్టీ–ఫిఫ్టీ ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్లో తొలిసారి చాన్స్ దక్కించుకున్న సౌరభ్ తివారి ఓపెనర్‌గా రాణించాడు. సిమన్స్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. రోహిత్ నిష్క్రమణ తర్వాత అంబటి రాయుడుతో కలిసి ముంబై ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో భారీ షాట్లు ఆడే క్రమంలో రాయుడు, పొలార్డ్ (13; 1 సిక్స్) ఔటయ్యారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతాను ముంబై పేసర్లు బెంబేలెత్తించారు. నరైన్ (0) సౌతీ బౌలింగ్‌లో డకౌట్ కాగా... ఇన్నింగ్స్ కుదుటపడుతున్న తరుణంలో గంభీర్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్)ను జాన్సన్... లిన్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ను వినయ్ పెవిలియన్ చేర్చారు. ఉతప్ప (2) కరణ్ స్పిన్ ఉచ్చులో పడ్డాడు. సిక్సర్లతో విరుచుకుపడిన యూసుఫ్ ఫఠాన్ (7 బంతుల్లో 20; 3 సిక్స్‌లు) ఎంతో సేపు నిలువలేకపోయాడు. మనీశ్, గ్రాండ్‌హోమ్‌లు పోరాడినా ముంబై పేస్‌కు తలవంచారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సౌరభ్ రనౌట్ 52; సిమన్స్ (సి) నరైన్ (బి) బౌల్ట్ 0; రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ (బి) అంకిత్ 27; రాయుడు (స్టంప్డ్) ఉతప్ప (బి) కుల్దీప్ 63; పొలార్డ్ (సి) పఠాన్ (బి) బౌల్ట్ 13; హార్దిక్ నాటౌట్ 1; కృనాల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–12, 2–69, 3–130, 4–168, 5–170. బౌలింగ్: బౌల్ట్ 4–0–30–2, గ్రాండ్‌హోమ్ 2–0–16–0, ఉమేశ్ 4–0–40–0, నరైన్ 4–0–37–0, కుల్దీప్ 3–0–25–1, అంకిత్ 3–0–14–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: నరైన్ (సి) హార్దిక్ (బి) సౌతీ 0; లిన్ (సి) సబ్–సుచిత్ (బి) వినయ్ 26; గంభీర్ (సి) కరణ్ శర్మ (బి) జాన్సన్ 21; ఉతప్ప (సి) రోహిత్ (బి) కరణ్ శర్మ 2; మనీశ్ పాండే (సి) సబ్–సుచిత్ (బి) హార్దిక్ 33; యూసుఫ్ పఠాన్ (సి) హార్దిక్ (బి) వినయ్ 20; గ్రాండ్‌హోమ్ (బి) హార్దిక్ 29; కుల్దీప్ (సి) రాయుడు (బి) సౌతీ 16; ఉమేశ్ నాటౌట్ 4; బౌల్ట్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–0, 2–41, 3–53, 4–53, 5–87, 6–128, 7–149, 8–158. బౌలింగ్: సౌతీ 4–1–39–2, జాన్సన్ 4–0–30–1, కరణ్ శర్మ 3–0–26–1, వినయ్ 3–0–31–2, కృనాల్ 2–0–14–0, హార్దిక్ 4–0–22–2. -
బుకీలు కలిస్తే ఆ పని చేసేవాడ్ని: సెహ్వాగ్
ముంబయి: క్రికెట్లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ లాంటి అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండేందుకు ఆటగాళ్లు ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. బుధవారం కాన్పూర్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ముగ్గురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ డాషింగ్ ఓపెనర్ ఈ విధంగా స్పదించారు. 'బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఇలాంటి వ్యవహారాలను ఎవరూ ఆపలేరు. తాను ఎవరిని కలుసుకుంటున్నాం అనేది ప్రతి ఆటగాడికి తెలిసుండాలి. తన మనస్సాక్షి స్పష్టంగా ఉన్నప్పుడే ఆటను కూడా క్లీన్‌గా ఉంచగలరు. ఎంత భద్రత ఉన్నా ఓ ఆటగాడు ఫిక్సింగ్‌కు పాల్పడాలనుకుంటే ఎవరూ ఆపలేరు. తనను ఎవరూ తప్పుపట్టకూడదనే విచక్షణ ఎవరికి వారు కలిగి ఉంటేనే ఈ మార్పు సాధ్యం. ఒకవేళ నేను క్రికెట్ ఆడే రోజుల్లో ఎవరైనా నాపై బెట్టింగ్ ఆరోపణలు లేవనెత్తినట్లయితే మరో ఆలోచన లేకుండా రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. దాంతో పాటు నేను సాధించిన రికార్డులను తొలగించేయాలని విజ్ఞప్తి చేసేవాడిని. ముఖ్యంగా ఫిక్సింగ్ మహమ్మారి పారిపోవాలంటే ఆటగాళ్లు వంద శాతం నిజాయితీగా ఉండటమే దానికి విరుగుడు' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం గుజరాత్, ఢిల్లీ ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. -
బాలుడి చిట్కాతో హ్యాట్రిక్ ఫీట్: ఉనద్కత్
న్యూఢిల్లీ: సన్ రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచ్‌లో చివరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించి హీరో అయిపోయిన జయదేవ్ ఉనద్కత్ అందుకు గల కారణాలు వింటే షాకవ్వాల్సిందే. హ్యాట్రిక్ ట్రిక్స్ తాను 12 ఏళ్ల బాలుడి నుంచి నేర్చుకున్నానని పుణే బౌలర్ ఉనద్కత్ తెలిపాడు. గత ఆదివారం మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పై 12 పరుగుల తేడాతో పుణేను గెలిపించాడు. తన ఇన్స్టాగ్రామ్ లో ఈ వివరాలను పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 28న సహచర ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డుప్లెసిస్ లతో కలిసి ఉనద్కత్ పుణేలోని ఏపీఎస్ఎస్ పాఠశాల విద్యార్థులతో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ సమయంలో 12 ఏళ్ల ఓంకార్ పవార్ అనే విద్యార్థి ఏ మోహమాటం లేకుండా తనకు బౌలింగ్ మెలకువలు నేర్పించాడని చెప్పాడు. బంతులలో వైవిధ్యం చూపించడానికి బౌలింగ్ చేసి చూపించాడని వివరించాడు. చివరి ఓవర్లో వరుస బంతుల్లో సన్ రైజర్స్ ఆటగాళ్లు బిపుల్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ లను పెవిలియన్ బాట పట్టించి హ్యాట్రిక్ ఫీట్ నమోదుచేశాడు. ఆ స్కూళ్లోనే తన హ్యాట్రిక్ ఫీట్‌కు బీజం పడిందని పుణే ప్లేయర్ హర్షం వ్యక్తం చేశాడు. హాట్రికె వికెట్లతో పాటు మెయిడిన్ ఓవర్ వేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. -
ఎంతమంది బ్యాట్స్ మెన్ ఇలా చేస్తున్నారు!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా నిజాయితీని మెచ్చుకున్నాడు. ఈ కాలంలో కూడా అతనిలా ఎవరైనా నిజాయితీగా ఉంటూ, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించగలరా అని ప్రశ్నించాడు. అసలు విషయం ఇది.. నిన్న (శుక్రవారం) బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్లోనే హషీం ఆమ్లా ఔటయ్యాడు. బెంగళూరు బౌలర్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతిని ఆమ్లా ఆడగా ఎడ్జ్ తీసుకుంది. ఆ బంతి నేరుగా వెళ్లి కీపర్ కేదార్ జాదవ్ చేతుల్లో పడింది. బెంగళూరు ఆటగాళ్లు అప్పీల్ చేసేలోగానే ఆమ్లా క్రీజు వదిలి వెళ్లిపోయాడు. వాస్తవానికి ఆ బంతి బ్యాట్ కు తాకిందా లేదా అన్నదానిపై కీపర్ జాదవ్, బౌలర్ చౌదరికి స్పష్టతలేకున్నా.. ఆమ్లా మాత్రం నిజాయితీగా ఔట్ ను ఒప్పుకున్నాడు. దీనిపై గుజరాత్ లయన్స్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో ప్రశంసించాడు. ‘ఎంత మంది బ్యాట్స్ మెన్.. బౌలర్లు అప్పీలు చేయకుండానే క్రీజు వదిలి వెళ్లిపోతున్నారు. ఆమ్లా నిజాయితీని చూసి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించండి’ అంటూ పఠాన్ ట్వీట్ చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో పట్టుదలతో ఆడిన పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. How many batsmen would walk without bowler appealing but that's how this guy plays his cricket @amlahash @IPL #honestman — Irfan Pathan (@IrfanPathan) 5 May 2017 -
బెంగళూరు కథ కంచికే!
► ఏడో ఓటమితో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి ► 61 పరుగులతో రైజింగ్ పూణే గెలుపు ► తాహిర్ ,ఫెర్గూసన్ సూపర్ బౌలింగ్ జట్టులో చెప్పుకుంటూ పోతే హిట్టర్లే... కానీ ప్రత్యర్థితో ఆడుకుంటూ వెళితే పరాజయాలే అన్న చందంగా తయారైంది బెంగళూరు జట్టు పరిస్థితి. తీరు మారని విరాట్ సేన మరో పరాజయంతో ‘ప్లే ఆఫ్’కు దాదాపు దూరమైంది. ఆశల్లేవ్... అవకాశాల్లేవ్... మేం ప్లే–ఆఫ్ రేసులో లేం. ఇక మా దారులు మూసుకుపోయాయి. మా ఆటతీరు ఎంత ఘోరంగా ఉందో అందరూ చూశారు. ఇలాంటి చెత్త ప్రదర్శన కనబరిచాక ఇంకేం మాట్లాడతాను. ఇది స్వయంకృతాపరాధం. దీనికి సాకులు వెతకను. కానీ ఇది పెద్ద గుణపాఠమని మా వాళ్లందరికి చెబుతున్నా. ఇక మిగిలిన మ్యాచుల్ని ఆస్వాదించేందుకే ఆడతాం. –కోహ్లి, బెంగళూరు కెప్టెన్ పుణే: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ ఓడింది. లక్ష్యం కష్టసాధ్యం కాకపోయినా... ఒంటిచేత్తో గెలిపించే బ్యాట్స్‌మెన్ ఉన్నా... నిర్లక్ష్యం నిండా ఆవహిస్తే... ఆట ఆదమరిస్తే... పరాజయాలు మావెంటే! అన్నట్లు సాగింది బెంగళూరు ఇన్నింగ్స్. శనివారం రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఏడో పరాజయంతో ఐపీఎల్–10లో అందరికంటే ముందుగా నిష్క్రమించేందుకు అడుగులేస్తోంది. మొదట పుణే 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్టు కోల్పోయి 96 పరుగులే చేయగల్గింది. నాలుగు ఓవర్లలో ఒక మెయిడిన్ తీసుకొని కేవలం ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన పుణే జట్ట పేస్ బౌలర్ ఫెర్గూసన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆకట్టుకున్న స్మిత్, తివారి... టాస్ నెగ్గిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పుణేకు ఓపెనర్ రహానే (6) రూపంలో తొలిదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద అతను బద్రీ బౌలింగ్‌లో మిల్నేకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. తర్వాత కెప్టెన్ స్మిత్, ఓపెనర్ రాహుల్ త్రిపాఠికి జతయ్యాడు. రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. ఇద్దరూ కుదురుకుంటున్న ఈ తరుణంలో త్రిపాఠి (28 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్)ని నేగి ఔట్ చేశాడు. దీంతో మనోజ్ తివారి క్రీజులోకి వచ్చాడు. స్మిత్, తివారిలు అడపాదడపా ఫోర్లతో జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. సరిగ్గా మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించాక 108 స్కోరు వద్ద స్మిత్ (32 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్)ను స్టువర్ట్ బిన్నీ పెవిలియన్‌కు పంపాడు. తర్వాత వచ్చిన ధోని (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), తివారి (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) మరో వికెట్ పడకుండా జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించారు. బద్రీ, నేగి, స్టువర్ట్ బిన్నీ తలా ఒక వికెట్ తీశారు. ఒకే ఒక్కడు కోహ్లి! జట్టులోని పదకొండు మంది కలిసి 96 పరుగులు చేస్తే... నాయకుడు మినహా సహచరులందరిదీ సింగిల్ డిజిటే! ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి (48 బంతుల్లో 55; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా... అవతలి వైపు నుంచి కనీస సహకారం లోపించింది. దీంతో జట్టు పరువు నిలిపే మూడంకెల స్కోరైనా సాధించలేకపోయింది. కోహ్లి తర్వాత రెండో అత్యధిక స్కోరు అరవింద్ చేసిన 8 (నాటౌట్) పరుగులే! చెత్త షాట్లతో హెడ్ (2), డివిలియర్స్ (3), కేదార్ జాదవ్ (7), సచిన్ బేబి (2), స్టువర్ట్ బిన్నీ (1) బ్యాట్లెత్తేశారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ బెంగళూరు లక్ష్యం వైపు కనీసం చూడలేకపోయింది. పుణే బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 3, ఫెర్గూసన్ 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) మిల్నే (బి) బద్రీ 6; త్రిపాఠి (సి) జాదవ్ (బి) నేగి 37; స్మిత్ (సి) మిల్నే (బి) బిన్నీ 45; తివారి నాటౌట్ 44; ధోని నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–18, 2–58, 3–108. బౌలింగ్: మిల్నే 4–0–35–0, బద్రీ 4–0–31–1, అరవింద్ 4–0–30–0, చహల్ 2–0–25–0, నేగి 4–0–18–1, బిన్నీ 2–0–17–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: హెడ్ (బి) ఉనాద్కట్ 2; కోహ్లి (సి) సబ్–మయాంక్ (బి) క్రిస్టియాన్ 55; డివిలియర్స్ (సి) తివారి (బి) ఫెర్గూసన్ 3; జాదవ్ రనౌట్ 7; సచిన్ బేబి (సి) స్మిత్ (బి) సుందర్ 2; స్టువర్ట్ బిన్నీ (సి) సుందర్ (బి) ఫెర్గూసన్ 1; నేగి (సి) క్రిస్టియాన్ (బి) తాహిర్ 3; మిల్నే (సి) స్మిత్ (బి) తాహిర్ 5; బద్రీ (బి) తాహిర్ 2; అరవింద్ నాటౌట్ 8; చహల్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1–11, 2–32, 3–44, 4–47, 5–48, 6–61, 7–71, 8–82, 9–84. బౌలింగ్: దీపక్ 2–0–18–0, ఉనాద్కట్ 4–0–19–1, ఫెర్గూసన్ 4–1–7–2, క్రిస్టియాన్ 4–0–25–1, తాహిర్ 4–0–18–3, సుందర్ 2–0–7–1. -
పాండ్యాకు తృటిలో తప్పిన ప్రమాదం
-
వికెట్ల ధీరుడు ’రషీద్’
-
కొత్త లుక్‌లో యువీ
-
హోరాహోరీ.. పుణే గెలుపు
ఐపీఎల్-10 సీజన్‌ను పుణే సూపర్ జెయింట్స్ ఘనవిజయంతో ప్రారంభించింది. టాస్ గెలిచిన పుణే బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 184/8 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్మన్లలో హర్ధిక్ పాండ్యా 20వ ఓవర్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన పుణే ఆది నుంచి లక్ష్యం దిశగా సాగింది. పుణే ఓపెనర్ అజింక్యా రహానే 60(34) సమయోచిత ఇన్నింగ్స్‌కు తోడు స్టీవ్ స్మిత్ 84(51) నాటౌట్ కెప్టెన్ ఇన్నింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇన్నింగ్స్ మరో బంతి మిగిలివుండగానే 187/3తో గెలుపొందింది. పుణే బౌలర్లలో ఇమ్రాన్ తహీర్కు మూడు వికెట్లు దక్కగా, రజత్ భాటియాకు రెండు వికెట్లు దక్కాయి. ముంబై బౌలర్లలో టిమ్ సౌథీ, హర్ధిక పాండ్యా, మిచెల్ మెక్క్లెనాగన్లకు తలా ఓ వికెట్ దక్కింది. -
ఐపీఎల్‌కు ముస్తాబవుతున్న ఉప్పల్ స్టేడియం..
-
సీఈవోగా ధోనీ సడన్ సర్ ప్రైజ్
⇒ సరికొత్త అవతారంలో ధోనీ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ కంపెనీకి సీఈవో అయ్యాడు. అదేంటీ.. క్రికెటర్ గా కొనసాగుతున్న మహీ కంపెనీ సీఈవోగా చేయడమేంటని ఆలోచిస్తున్నారా.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ 10 కోసం సన్నధ్దమైన పుణే సూపర్ జెయింట్స్ ఆటగాడు ఎంఎస్ ధోనీ సోమవారం ఓ కంపెనీకి ఒకరోజు సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఒకేఒక్కడు మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒకరోజు సీఎంగా వ్యవహరించినట్లే.. ధోనీకి ఒకరోజు సీఈవోగా చాన్స్ వచ్చింది. బ్యాటింగ్ సమయంలో మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల బంతులను స్టాండ్స్ లోకి పంపిస్తూ, ఫీల్డిండ్ సమయంలో కెప్టెన్ కూల్ గా ఇన్నిరోజులు వ్యవహరిస్తూ కనిపించిన ధోనీ.. సూట్ లో గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీకి వెళ్లాడు. సీఈవోగా కొత్త అవతారం ఎత్తాడు. సీఈవో కుర్చీలో ధోనీని చూసిన కంపెనీ ఉద్యోగులు షాక్ తిన్నారు. . ధోనీ స్నేహితుడు ఆ కంపెనీ కమర్షియల్ ఇంటరెస్ట్స్ మేనేజర్ అరుణ్ పాండే ఈ విషయాలను చెప్పారు. గతంలో ఈ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరించాడు. సీఈవోగా చేసిన ధోనీ.. కంపెనీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని తెలిపారు. ఎన్నో రోజుల కిందటే ఈ విధంగా ప్లాన్ చేశామని.. అయితే ఇప్పుడు సాధ్యమైందని పాండే వివరించారు.