అనంతపురంపై కడప విజయం
కడప స్పోర్ట్స్ :
అంతర్ జిల్లాల సీనియర్ మహిళా క్రికెట్ పోటీలు కడప నగరంలో సోమవారం ప్రారంభమయ్యాయి. కేఎస్‌ఆర్‌ఎం క్రీడామైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో అనంతపురం, కడప జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 45.3 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని శ్రీలక్ష్మి 88 పరుగులు చేసింది. జట్టులోని రోజా 20, నాగమణి 18 పరుగులు చేశారు. అనంతపురం బౌలర్లు హర్షవర్ధిణి 3, అనూష 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 35.3 ఓవర్లలోనే 136 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని పల్లవి 68 పరుగులు, అనూష 21 పరుగులు చేసింది. కడప బౌలర్లు లక్ష్మి 3, ఓబులమ్మ 4 వికెట్లు తీశారు. దీంతో కడప జట్టు 62 పరుగులు తేడాతో విజయం సాధించి 4 పాయింట్లు పొందింది.
నెల్లూరుపై కర్నూలు ఘన విజయం
నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో నెల్లూరు, కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 362 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టులోని ఎన్.అనూష 18 ఫోర్లు, 1 సిక్సర్‌తో 126 బంతుల్లో 128 పరుగులు చేసింది. ఈమెకు జతగా నిలిచిన వి. అనూషారాణి 18 ఫోర్లతో 138 బంతుల్లో 138 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. జి. చంద్రలేఖ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. నెల్లూరు బౌలర్ యామిని 1 వికెట్ తీసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులోని సింధూజ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. కర్నూలు బౌలర్లు అంజలి 2, చంద్రలేఖ 2 వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 232 పరుగుల భారీ విజయం కైవసం చేసుకుంది. దీంతో కర్నూలు జట్టుకు 4 పాయింట్లు లభించాయి.